ఉగ్రస్థావరం గుట్టురట్టు.. భారీగా ఆయుధాలు స్వాధీనం

ఉగ్రస్థావరం గుట్టురట్టు.. భారీగా ఆయుధాలు స్వాధీనం

జమ్ముకశ్మీర్‌లో మరో ఉగ్రస్థావరం గుట్టురట్టయ్యింది. జమ్ముకశ్మీర్‌ పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా నిర్వహించిన కూంబింగ్‌లో ఈ స్థావరం బయటపడింది. పూంచ్‌ జిల్లాలోని మంగర్‌ ప్రాంతంలో..

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 08, 2020 | 6:07 AM

జమ్ముకశ్మీర్‌లో మరో ఉగ్రస్థావరం గుట్టురట్టయ్యింది. జమ్ముకశ్మీర్‌ పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా నిర్వహించిన కూంబింగ్‌లో ఈ స్థావరం బయటపడింది. పూంచ్‌ జిల్లాలోని మంగర్‌ ప్రాంతంలో శుక్రవారం నాడు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ ఉగ్రస్థావరాన్ని గుర్తించారు. అందులో తనిఖీలు చేయగా. రెండు ఏకే-47 రైఫిల్స్‌, నాలుగు మ్యాగజైన్లు సీజ్ చేశారు. పక్కా సమాచారం అందడంతో.. సర్చ్ ఆపరేషన్ ప్రారంభించామని.. అయితే స్థావరం బయటపడింది కానీ.. ఉగ్రవాదులు తప్పించుకున్నారని పోలీసులు తెలిపారు. కల్సా అటవీ ప్రాంతంలో ఈ స్థావరం బయటపడ్డట్లు పూంచ్‌ జిల్లా సీనియర్ సూపరింటెండెంట్‌ పోలీస్ తెలిపారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల సంచారం ఉన్నట్లు గుర్తించామని.. తరచూ ఈ ప్రాంతంలో తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు. కాగా, గత కొద్ది రోజులుగా జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఎక్కడో ఓ చోట ఉగ్రస్థావరాలు బయటపడుతున్నాయి. ఈ ఆపరేషన్‌లో పెద్ద ఎత్తున ఆయుధాలను సీజ్ చేస్తోంది సైన్యం.

Read More :

కర్ణాటకలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు మహారాష్ట్రలో తగ్గని కేసులు.. మళ్లీ 10వేలకు పైగానే

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu