Azadi Ka Amrit Mahotsav: ఆగస్టు 15న దేశం మొత్తం 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకునేందుకు సిద్ధమైంది. 75 ఏళ్ల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలకు సన్నాహాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈసారి ఆగస్టు 15వ తేదీని ప్రత్యేకంగా నిర్వహించుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా సన్నాహాలు చేస్తున్నారు. ప్రధాని మోదీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఈ రోజు అంటే మంగళవారం తన ప్రొఫైల్ ఫొటోను మార్చాడు. తన సోషల్ మీడియా ఖాతాలో తన ప్రొఫైల్‌లో జాతీయ జెండాను ఉంచాడు. దీనితో పాటు, ఆగస్టు 2 నుంచి 15 మధ్య సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లోని వారంతా వారి ప్రొఫైల్‌లో మూడు రంగుల జెండాను ఉంచాలని ప్రధానమంత్రి ప్రజలను కోరారు.
ప్రధాన మంత్రి ట్వీట్ చేస్తూ, “ఈ రోజు ఆగస్ట్ 2 ఎంతో ప్రత్యేకం! మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలకు సిద్ధమవుతున్న తరుణంలో, మన దేశం ప్రతి ఇంటి వద్ద త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించి ఒక సామూహిక ఉద్యమానికి సిద్ధంగా ఉంది. నేను నా సోషల్ మీడియాలో ప్రొఫైల్ ఫొటోను మారుస్తున్నాను. మీరు కూడా అలాగే చేస్తారని కోరుకుంటున్నాను” అంటూ రాసుకొచ్చారు.
పింగళి వెంకయ్యకు నివాళులు..
అలాగే నేడు పింగళి వెంకయ్యకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఈమేరకు మరో ట్వీట్‌లో ప్రధాని, “మహానీయుడు పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా నేను ఆయనకు నివాళులర్పిస్తున్నాను. మనకు త్రివర్ణ పతాకాన్ని అందించడానికి ఆయన చేసిన కృషికి మన దేశం ఎల్లప్పుడూ ఆయనకు రుణపడి ఉంటుంది. మేం చాలా గర్విస్తున్నాం. బలం, స్ఫూర్తి, దేశ ప్రగతికి కృషి చేద్దాం” అంటూ పిలిపునిచ్చారు.
It is a special 2nd August today! At a time when we are marking Azadi Ka Amrit Mahotsav, our nation is all set for #HarGharTiranga, a collective movement to celebrate our Tricolour. I have changed the DP on my social media pages and urge you all to do the same. pic.twitter.com/y9ljGmtZMk
— Narendra Modi (@narendramodi) August 2, 2022
మన్ కీ బాత్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలంటూ విజ్ఞప్తి..
జులై 31న ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘ఆజాదీ అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రత్యేక ఉద్యమం ‘హర్ ఘర్ తిరంగ, హర్ ఘర్ తిరంగ’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉద్యమంలో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రతీ ఇంట్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయండి లేదా మీ ఇంటిని దానితో అలంకరించండి” అంటూ పేర్కొన్నారు.