Azadi Ka Amrit Mahotsav: అంతరిక్ష రంగంలో అపూర్వ ఘట్టం.. భారత్‌ను అగ్రగ్రామిగా నిలిపిన తొలి కమ్యూనికేషన్ ఉపగ్రహ ప్రయోగం..
అంతరిక్షం అయినా లేదా సాంకేతిక రంగం అయినా.. భారతదేశం ప్రతి రంగంలో ముందంజలోనే ఉంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలలో భారత్ పోటీపడుతున్న విషయం తెలిసిందే.
Azadi Ka Amrit Mahotsav: భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 2022 ఆగస్టు 15తో 75 ఏళ్లు పూర్తికానున్నాయి. 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల (Independence Day) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. 75 ఏళ్లలో భారతదేశం అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించింది. అంతరిక్షం అయినా లేదా సాంకేతిక రంగం అయినా.. భారతదేశం ప్రతి రంగంలో ముందంజలోనే ఉంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలలో భారత్ పోటీపడుతున్న విషయం తెలిసిందే. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అంతరిక్ష రంగంలో ఎన్నో ప్రాజెక్టులను ప్రారంభించింది. ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం నుంచి చంద్రయాన్ వరకు ఎన్నో మైలు రాళ్లను అధిగమించి ప్రపంచ వ్యాప్తంగా అంతరిక్ష రంగంలో సత్తాచాటింది. అయితే.. అజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా గత 75 ఏళ్లలో భారతదేశం అంతరిక్ష రంగంలో సాధించిన పురోగతి, ప్రయాణం గురించి TV-9 డిజిటల్ ఆసక్తికర కథనాలను ప్రచురిస్తోంది. ఈ క్రమంలో భారతదేశం అంతరిక్ష రంగంలో సాధించిన పురోగతి.. దీనికోసం తీసుకున్న నిర్ణయాలు.. ముందడుగు గురించి ఇప్పుడు తెలుసుకోండి..
అజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా.. ఈ రోజు మనం 1981 సంవత్సరం గురించి మాట్లాడుకుందాం.. 1981 జూన్ 18న భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) పంపిన ఉపగ్రహం భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశాలతో నిలబడేలా చేసింది. ఇస్రో ఎన్నో విజయాలు సాధించినా నేటికీ 43 ఏళ్ల క్రితమే భారత్ ఆ రికార్డును సాధించింది. ఆ సమయంలో భారతదేశం ఒక కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని పంపింది. ఇది భారతదేశానికి చెందిన మొదటి ఉపగ్రహం. ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహం పేరు (Ariane Passenger Payload Experiment ) ఆపిల్. భారతదేశపు మొట్టమొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహం యాపిల్ ను ఫ్రెంచ్ గయానా నుంచి ప్రయోగించారు.
దీనిని GTO అని పిలుస్తారు. ఇది కక్ష్యలోకి ప్రవేశం నాటినుంచి ఆపిల్ శాండ్‌విచ్ ప్యాసింజర్‌గా రూపొందించారు. విశేషమేమిటంటే ఇది కేవలం రెండేళ్లలో తయారైంది. TV ప్రోగ్రామ్‌ల ప్రసారం, రేడియో నెట్‌వర్కింగ్‌తో సహా అనేక కమ్యూనికేషన్ పరీక్షలలో Apple ను ఉపయోగించారు. దీనితో పాటు, రేడియో నెట్‌వర్కింగ్ కంప్యూటర్ ఇంటర్‌కనెక్ట్‌కు ఇది చాలా ఉపయోగం చేకూర్చింది.
ఆపిల్ పేరు వెనుక అసలు కథ ఇదే..
Apple పేరు గురించి మాట్లాడుకుంటే.. Apple అనేది ఏరియన్ ప్యాసింజర్ పేలోడ్ ప్రయోగం (Ariane Passenger Payload Experiment ) సంక్షిప్త రూపం. ఈ ఉపగ్రహం బరువు 670 కిలోలు, ఎత్తు-వెడల్పు 1.2 మీటర్లు. దీని ఆన్‌బోర్డ్ పవర్ 210 వాట్స్.
మొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహం..
Apple 6.4 GHz రెండు C బ్యాండ్ ట్రాన్స్‌పాండర్‌లతో ఇస్రో ప్రయోగించిన ప్రయోగాత్మక కమ్యూనికేషన్ ఉపగ్రహం. దీనిని బెంగళూరులోని శాటిలైట్ సెంటర్‌లో ఇస్రో డిజైన్ చేసి అభివృద్ధి చేసింది. ఈ ఉపగ్రహాన్ని టెలివిజన్, రేడియో ప్రసార ప్రయోగాలకు ఉపయోగించారు. ఈ ఉపగ్రహాన్ని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశానికి అంకితం చేశారు.
మరిన్ని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..