బాల రాముడి డబ్బు బొక్కేసిందెవరు? దేశమంతా ఇదే చర్చ.. యూపీలో రాజకీయ రచ్చ
అయోధ్య రామ్ మందిర్ విరాళాల గోల్‌మాల్ కేసు యూపీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. అరెస్టయిన నిందితులకు వాదించబోమని అయోధ్య బార్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ ఘటన 2027 యూపీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు రాజకీయ మలుపులకు దారితీశాయని కథనం విశ్లేషిస్తుంది.

అయోధ్య రామ్ మందిర్ విరాళాల గోల్‌మాల్ కేసు మలుపుల మీద మలుపులు తిరుగుతూ, రోజుకో సంచలనం క్రియేట్ చేస్తోంది. అరెస్టయిన 8 మంది నిందితుల్లో ఏ ఒక్కరి తరఫునా వాదించడానికి నో చెప్పింది అయోధ్య బార్ అసోసియేషన్. ఒకవేళ ఏ లాయరైనా కాదూకూడదు అని పైసల కోసం దొంగల తరఫున వకాల్తా పుచ్చుకుంటే 5 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించింది కూడా. అయోధ్యలోని ఫైజాబాద్ అడ్వొకేట్స్ అసోసియేషన్ సమావేశమై ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానించింది. ఇరవైఏళ్ల కిందట టెర్రరిస్ట్ ఎటాక్‌లో నిందితుల విషయంలో కూడా ఇటువంటి తీర్మానమే జరిగింది. అంటే, గుడిలో దొంగలు పడ్డది నిజం. దోచుకున్న మాటా నిజం. అ దోచుకున్నవాళ్లు టెర్రరిస్టులతో సమానం అని ఉత్తరప్రదేశ్ ప్రజానీకం అంతా ప్రగాఢంగా నమ్ముతోంది. అందుకేనా.. నార్త్ మీడియా మొత్తం అయోధ్య చుట్టూనే తిరుగుతోంది? అందుకేనా.. అయోధ్య రాముడ్ని యూపీ రాజకీయం మరోసారి ఇంతలా రౌండప్ చేసింది? రామభక్తులపై బుల్లెట్లు ప్రయోగించినవాళ్లే ఇప్పుడు రామజపం ఆలపిస్తున్నారు. జైశ్రీరామ్ అన్నవాళ్లను లాఠీలతో కొట్టినవాళ్లకు ఇప్పుడు ఆ రాముడు గుర్తుకొస్తున్నాడు! నిజమైన భక్తులు ఎవరో రాముడికి తెలుసు! యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఇచ్చిన తాజా స్టేట్‌మెంట్ ఇది. 2017కు ముందు రామభక్తులపై పగబట్టినవాళ్లకు ఇప్పుడు ఆ రామభక్తులతోనే అవసరం ఏర్పడింది అని సాక్షాత్తూ ముఖ్యమంత్రే చెప్పేశారు. ఈవిధంగా 2027లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్ని ఆయాచితంగా గుర్తు చేశారా? రాముడితో రాజకీయం మరోసారి ముడివేసుకుందని అర్థం చేసుకోవచ్చా..? నైన్‌టీస్‌లో...
