Aurangabad ZP: జిల్లా పరిషత్‌లో కొత్త తీర్మానం.. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఉద్యోగుల జీతంలో కోత

Aurangabad ZP:  మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ జిల్లా పరిషత్‌ ఓ వినూత్న తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఉద్యోగులు తమ తమ తల్లిదండ్రులను పట్టించుకోకపోతే వారి ...

Aurangabad ZP: జిల్లా పరిషత్‌లో కొత్త తీర్మానం.. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఉద్యోగుల జీతంలో కోత
Follow us

|

Updated on: Jan 23, 2021 | 3:12 PM

Aurangabad ZP:  మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ జిల్లా పరిషత్‌ ఓ వినూత్న తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఉద్యోగులు తమ తమ తల్లిదండ్రులను పట్టించుకోకపోతే వారి జీతంలో కోత ఉంటుందని స్పష్ట చేసింది. విధి నిర్వహణలో ఒత్తిడి కారణంగా వారిపై అలసత్వం ప్రదర్శిస్తే సంబంధిత సిబ్బంది వేతనంలో 30 శాతం వరకు కోత విధించాలని ప్రతిపాదించింది. ఈ సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. తదుపరి అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు షెల్కే తెలిపారు. తల్లిదండ్రుల ఆలనాపాలనా చూసుకోని ఉద్యోగులకు ఇదో హెచ్చరిక అవుతుందని ఆమె పేర్కొన్నారు.

కాగా, ఈ మధ్య కాలంలో కొందరు తమ తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదని, కన్నవారినే పట్టించుకోకపోవడం అనేది పెరిగిపోయిందని ఆమె అన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఆలనాపాలనా చూసుకోవడం అందరి బాధ్యత అని అన్నారు. ఇలాంటివి జరుగుతున్న నేపథ్యంలో తాము ఈ నిర్ణయం తీసుకుని తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు.

ఎన్నికలపై దృష్టి, అస్సాంలో పేదలకు భూపట్టాలను పంపిణీ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, కోల్ కతాకు పయనం