కోవిడ్ పై పోరులో ఆయా దేశాలకు ఇండియా సహకారం, ప్రధాని మోదీకి ప్రపంచ బ్యాంక్ సంస్థ హెడ్ టెడ్రోస్ ప్రశంసలు

కరోనా వైరస్ పై జరుపుతున్న పోరాటంలో ఇండియా సహకారాన్ని కొనసాగిస్తున్నందుకు ప్రధాని మోదీకి ప్రపంచ బ్యాంక్ సంస్థ హెడ్ టెడ్రోస్ కృతజ్ఞతలు తెలిపారు.

కోవిడ్ పై పోరులో ఆయా దేశాలకు ఇండియా సహకారం, ప్రధాని మోదీకి ప్రపంచ బ్యాంక్ సంస్థ హెడ్ టెడ్రోస్ ప్రశంసలు
Follow us

| Edited By: Balu

Updated on: Jan 23, 2021 | 4:00 PM

కరోనా వైరస్ పై జరుపుతున్న పోరాటంలో ఇండియా సహకారాన్ని కొనసాగిస్తున్నందుకు ప్రధాని మోదీకి ప్రపంచ బ్యాంక్ సంస్థ హెడ్ టెడ్రోస్ కృతజ్ఞతలు తెలిపారు. మీ పొరుగునున్న అగ్నేయాసియా దేశాలకు, బ్రెజిల్, మొరాకో, సౌతాఫ్రికా వంటి దేశాలకు మీరు వ్యాక్సిన్లు పంపుతున్నందుకు మీకు ధన్యవాదాలని ఆయన ట్వీట్ చేశారు. మనమంతా ఇలా విజ్ఞానంతో సహా సహకరించుకుంటుంటే ఈ వైరస్ కు అడ్డుకట్ట వేయవచ్చునని, అనేకమంది ప్రాణాలను కాపాడవచ్చునని ఆయన అన్నారు.   బ్రెజిల్ సహా బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మాల్దీవులు వంటి దేశాలకు ఇండియా నుంచి టీకామందులు రవాణా అయ్యాయి. ఈ దేశాలకు 3.2 మిలియన్ డోసుల కోవీషీల్డ్ వెళ్ళింది. ఇక మారిషస్, మయన్మార్, సిషెల్లస్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ దేశాలకు కూడా  ఈ టీకామందు రవాణా అయింది. నేపాల్ ఆరోగ్య శాఖ మంత్రి హృదయేష్ త్రిపాఠీ సైతం ఇండియాకు, మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు.

తాజాగా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సనారో ప్రత్యేకంగా మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. తమ దేశానికి ఇండియా  కోవీషీల్డ్ టీకామందును పంపడాన్ని హనుమంతుడు సంజీవనిని తీసుకువస్తున్నట్టు పోలుస్తూ ట్వీట్ చేశారు. లోగడ హైడ్రాక్సీక్లోరోక్విన్ పంపినప్పుడు కూడా ఆయన ఇలాగే స్పందించారు.

Read Also:ప్రపంచ రికార్డు సాధించిన రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్విట్టర్‌ ఖాతా. Read Also:ఏపీలో రెచ్చిపోతున్న దొంగలు, అమలాపురం బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో భారీ చోరీ!