73 ఏళ్ల వయసులో ‘వరుడు కావలెను’ అంటూ ప్రకటన ఇచ్చిన బామ్మ.. ఒంటరిగా ఉండలేకపోతున్నానంటున్న వద్ధురాలు

|

Mar 28, 2021 | 8:31 PM

సాధారణంగా మ్యాట్రిమోనిలో వివాహం కోసం వరుడు, వధువుల కావలెను అంటూ ప్రకటనలు ఇవ్వడం చూశాం. ఇలాంటి ప్రకటనలు సర్వసాధరణమే. కానీ ఈ ప్రకటన చేస్తూ మాత్రం ప్రతి ఒక్కరు..

73 ఏళ్ల వయసులో వరుడు కావలెను అంటూ ప్రకటన ఇచ్చిన బామ్మ.. ఒంటరిగా ఉండలేకపోతున్నానంటున్న వద్ధురాలు
Life Partner
Follow us on

సాధారణంగా మ్యాట్రిమోనిలో వివాహం కోసం వరుడు, వధువుల కావలెను అంటూ ప్రకటనలు ఇవ్వడం చూశాం. ఇలాంటి ప్రకటనలు సర్వసాధరణమే. కానీ ఈ ప్రకటన  చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు ఆశ్యర్యపోక మానరు. 73 ఏళ్ల వయసున్న ఓ వృద్ధురాలు తనకు వరుడు కావలెను అంటూ మ్యాట్రిమోనిలోప్రకటన ఇవ్వడం ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదేం ప్రకటన అంటూ కొందరు ఆశ్యర్యానికి గురవుతున్నారు. ఆ వృద్ధురాల కర్ణాటకకు ఓ రిటైర్డ్‌ ఉపాధ్యాయురాలు.. పైగా ఆమె వయసు 73 ఏళ్లు. ఈ వయసులో ఉన్న ఆ వృద్దురాలు తకు తోడు కావాలంటూ ప్రకటన ఇవ్వడం విడ్డూరంగా మారింది. మైసూర్‌కు చెందిన ఆమె గతంలో వివాహం జరిగినా.. భర్తతో విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి ఆమె మళ్లీ వివాహం చేసుకోలేదు. అంతేకాదు ఆమె పిల్లలు కూడా లేరు. పైగా తల్లిదండ్రులు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆ 73 ఏళ్ల వృద్ధురాలు ఒంటరిగా జీవిస్తోంది.

అయితే ఈ పరిస్థితుల్లో తనకు తోడు అవసరమని ఆ వృద్ధురాలు భావిస్తోంది. ఒంటరిగా ఉండాలంటే భయమేస్తోందని, బస్టాపు నుంచి ఇంటికి రావాలంటే భయం వేస్తోందని, ఇప్పటి పరిస్థితుల్లో ఓ జీవిత భాగస్వామి ఉంటే బాగుంటుందని ఆమె కోరుకుంటోంది. తనకంటూ సొంత కుటుంబం లేదని, తొలి వివాహం విడాకులకు దారి తీసిందని, అందుకే తనకు తోడు కావాలంటూ ప్రకటన ఇచ్చానని చెబుతోంది. ఈ ప్రకటనను చూసిన పలువురు ఇదేమి విచిత్రం అంటూ గుసగుసలాడుకుంటున్నారు. అయితే తన శేషజీవితాన్ని కాబోయే భర్తతోనే గడవాలని భావిస్తున్నట్టు ఆ వృద్ధురాలు చెప్పుకొచ్చింది.

అయితే తాను బ్రహ్మణ కులానికి చెందిన స్త్రీని కాబట్టి వరుడు బ్రహ్మణ సామాజిక వర్గానికి చెందిన వాడై ఉండాలంటోంది. అంతేకాదండోయ్… తనకంటే వయసులో పెద్దవాడై ఉండాలని ఆ ప్రకటనలో పేర్కొంది. కాగా, ఆ వృద్ధురాలు నిర్ణయాన్ని పెద్ద సంఖ్యలో ప్రజలు స్వాగతిస్తున్నారు. జీవితానికి విలువ ఇస్తూ వయసు గురించి లెక్కచేయకుండా వివాహం కోసం ప్రకటన ఇవ్వడం హర్షించదగ్గ విషయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏదీఏమైనా ఈ వయసులో కూడా తనకు తోడు కావాలంటూ ప్రకటన ఇవ్వడం విడ్డూరంగానే అనిపించినా…కొందరు మంచి ఆలోచననే అంటూ చెప్పుకుంటున్నారు.

కాగా, ఈ సందర్భంగా మానసిక నిపుణులు మాట్లాడుతూ.. ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు చాలా తక్కువగా ఉన్నాయని, కొందరు ఇలాంటి ఒంటరి జీవితాలు గడపడం వల్ల మానసిక వేదనకు గురవుతున్నారని అన్నారు. ఇలాంటి వ్యక్తుల్లో ఆరోగ్య దెబ్బతింటుందని, వయసు పైబడిన వారికి ఎవరైనా ఆసరా ఉంటేనే వారు సంతోషంగా జీవిస్తారని అన్నారు. వయసులో కూడా తనకు తోడు కావాలని కోరుకోవడం మంచి విషయమేనని చెబుతున్నారు.

కాగా, ఈ ప్రకటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రకటన చేసిన వారు ఆమెను అభినందిస్తున్నారు. ఇదే సమయంలో తనకు ఓ తోడు కావాలని ప్రకటన ఇచ్చిన బామ్మకు సామాజిక మాధ్యమాల్లో మద్దతు లభిస్తోంది. ఆమె నిర్ణయాన్ని యువత మరింత ఎక్కువగా స్వాగతిస్తున్నారు. వృద్ధుల పట్ల నిరాదరణ ప్రదర్శిస్తున్న సమాజానికి ఈ ప్రకటన మేలుకొలుపు అని కొందరు అంటున్నారు.

ఇవీ చదవండి:

Insurance: బ్యాంకులు మూసివేస్తే డిపాజిట్‌ చేసిన డబ్బుల పరిస్థితి ఏమిటీ..? తాజాగా కేంద్రం కీలక నిర్ణయం

Credit Card: మీరు క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా…? రివార్డు పాయింట్లను ఎలా వాడాలి..? వాటి విలువ ఎంత..?

PM Kisan Samman Nidhi: రైతులకు డబుల్‌ బెనిఫిట్స్‌.. మార్చి 31లోగా చేరండి.. బ్యాంకు ఖాతాలో రూ.4 వేలు పొందండి

Provident Fund (PF): ఉద్యోగులు అలర్డ్‌.. మీరు ఈ పనులు చేయకపోతే పీఎఫ్‌ డబ్బులు తీసుకోలేరు

Health Check-up Benefits: మార్చి 31లోపు ఇలా చేయండి.. రూ.50 వేల వరకు ప్రయోజనం పొందే అవకాశం..!