India Economy: మోడీ సర్కార్ మార్క్.. ఆర్థిక వృద్ధిలో చతికిలపడిన చైనా.. పైపైకి భారత్..

India - China GDP: కరోనా మహమ్మారి అనంతరం ఆర్థిక వ్యవస్థ క్రమంగా గాడినపడుతోంది. ఆర్థిక మాంద్యం, పెట్టుబడులు తగ్గిపోవడం, తదితర పరిణామాలతో పలు దేశాల వృద్ధి పెద్దగా పుంజుకోలేదు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తి అయిన చైనా కూడా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ సమయంలో భారత్ వృద్ధి పరంగా అత్యధిక గణాంకాలను నమోదు చేసింది.

India Economy: మోడీ సర్కార్ మార్క్.. ఆర్థిక వృద్ధిలో చతికిలపడిన చైనా.. పైపైకి భారత్..
India Economy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 31, 2023 | 6:48 PM

India – China GDP: కరోనా మహమ్మారి అనంతరం ఆర్థిక వ్యవస్థ క్రమంగా గాడినపడుతోంది. ఆర్థిక మాంద్యం, పెట్టుబడులు తగ్గిపోవడం, తదితర పరిణామాలతో పలు దేశాల వృద్ధి పెద్దగా పుంజుకోలేదు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తి అయిన చైనా కూడా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ సమయంలో భారత్ వృద్ధి పరంగా అత్యధిక గణాంకాలను నమోదు చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో.. ఏప్రిల్-జూన్‌ త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 7.8% గా నమోదైంది. గత త్రైమాసికంలో 6.1% వృద్ధి రేటు నమోదు కాగా.. ఇప్పుడు అంచనాలన్నీ తలక్రిందులు చేసి.. అత్యధికంగా నమోదైంది. అయితే, దీనికి కారణం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలన్నీ భారత్ వైపు చూస్తుండటమే.. ముఖ్యంగా గత కొంత కాలం నుంచి చైనా గడ్డు పరిస్తితులను ఎదుర్కొంటోంది. గత ఆరు నెలలుగా చైనా ఆర్థిక వ్యవస్థ నెమ్మదించింది. వృద్ధి, రికార్డు స్థాయిలో యువత నిరుద్యోగం, తక్కువ విదేశీ పెట్టుబడులు, బలహీన ఎగుమతులు, కరెన్సీ, సంక్షోభంలో ఉన్న ఆస్తి రంగం లాంటి సమస్యలతో సతమతమవుతోంది. ఈ క్రమంలో భారత వృద్ధి రేటు పెరగడం ఇప్పు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

చైనా వృద్ధి రేటు పతనం గురించి US అధ్యక్షుడు జో బిడెన్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను “టిక్కింగ్ టైమ్ బాంబ్”గా అభివర్ణించారు. దేశంలో పెరుగుతున్న అసంతృప్తిని అంచనా వేశారు. ఆర్థిక వ్యవస్థ “బలమైన స్థితిస్థాపకత, అద్భుతమైన సంభావ్యత, గొప్ప శక్తిని” సమర్థిస్తూ చైనా నాయకుడు జి జిన్‌పింగ్ కూడా బైడెన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చినప్పటికీ.. పరిస్థితులు అనుకూలంగా లేవని తెలుస్తోంది.

మొదటి త్రైమాసికంలో చైనా 6.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆ తర్వాత కూడా పరిస్థితులు చక్కబడలేదు. దీంతో భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని చెప్పవచ్చు. ప్రపంచంలోని అన్ని దేశాల పరిస్థితులను అంచనా వేసే అమెరికన్ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ కూడా భారత ఆర్థిక వృద్ది మరింత పెరుగుతుందని చెప్పింది. గతంలో కంటే చైనా వృద్ధి తక్కువగా ఉంటుందని అంచనా వేసింది. ఆర్థిక వృద్దికి ముఖ్యంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాలే కారణం.. సంస్కరణలు, స్థూల ఆర్థిక స్థిరత్వానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలతో భారత్‌లో విదేశీ పెట్టబడులు పెరిగాయి. అంతేకాకుండా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి మొదలైంది. దీంతో గతంతో పోలిస్తే భారత్ మెరుగైన స్థానంలో ప్రవేశించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉత్పత్పి, విదేశీ పెట్టుబడులు, తదితర రంగాల్లో మెరుగైన వృద్ది కనిపిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..