Aditya-L1: ఇస్రో ఆదిత్య L1 ప్రయోగానికి కౌంట్‌డౌన్.. శ్రీహరికోట వేదికగా మరో ప్రతిష్టాత్మక మిషన్
సెప్టెంబర్ 02 న.. PSLV C-57 ద్వారా ఆదిత్య ఎల్-1 ప్రయోగం జరగనుంది. సూర్యుని అయస్కాంత క్షేత్రంలో సంభవించే మార్పులు.. కరోనియంలో ఉన్న పదార్థాలు.. సూర్యునిలో నిత్యం జరిగే డైనమిక్ ప్రక్రియలను అధ్యయనం చేయడానికి భారత్ చేస్తున్న తొలి ప్రయోగం ఇది..! తరచూ మనం చూస్తున్న సౌర తుఫాన్ కారణంగా అంతరిక్షంలో ఉపగ్రహాలపై పడుతున్న ప్రభావంతో.. సమాచార వ్యవస్థ పై అంతరాయాలు ఏర్పడుతున్నాయి.
అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో స్పీడ్ పెంచింది. కీలక ప్రయోగాలతో ఇస్రో దూసుకెళ్తోంది. ఇంతవరకూ దేశీయ అవసరాల కోసం వందలాది ఉపగ్రహాలను నింగిలోకి పంపిన ఇస్రో.. ఇకపై అత్యంత సాహసోపేతమైన పరిశోధనలపై దృష్టి సారించింది. చంద్రయాన్-3 సక్సెస్ తర్వాత..’ఆదిత్య హృదయాన్ని’ ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది. సూర్యగోళం రహస్యాలను ఛేదించడానికి.. శ్రీహరికోట వేదికగా రంగం సిద్ధమైంది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన.. ఆదిత్య L1 ప్రయోగానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఇప్పటికే ప్రయోగానికి సంబంధించిన పరికరాలన్నీ శ్రీహరికోట-షార్ కేంద్రానికి చేరుకున్నాయి. విశ్వ రహస్యాల గుట్టువిప్పడానికి సంకల్పం చేసిన ఇస్రో..కీలక ప్రయోగాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. చంద్రయాన్ త్రీ సక్సెస్‌తో.. అగ్రరాజ్యాలకు దీటుగా నిలబడిన ఇస్రో..తాజాగా ఆదిత్య-L1 ప్రయోగానికి సిద్ధమైంది. ఆదిత్య ఎల్-1- సూర్యుని పై పరిశోధనలకు ఇస్రో చేస్తున్న తొలి ప్రయత్నం..! ఇప్పటిదాకా చంద్రుడు, అంగారక గ్రహాలపై పరిశోధనలు చేసిన ఇస్రో.. అద్భుత రహస్యాలను బయటపెట్టింది. అదేవిధంగా సూర్యుడి రహస్యాలను కనిపెట్టడమే లక్ష్యంగా ఇస్రో ఆదిత్య-L1 ప్రయోగం చేపడుతోంది.
సెప్టెంబర్ 02 న.. PSLV C-57 ద్వారా ఆదిత్య ఎల్-1 ప్రయోగం జరగనుంది. సూర్యుని అయస్కాంత క్షేత్రంలో సంభవించే మార్పులు.. కరోనియంలో ఉన్న పదార్థాలు.. సూర్యునిలో నిత్యం జరిగే డైనమిక్ ప్రక్రియలను అధ్యయనం చేయడానికి భారత్ చేస్తున్న తొలి ప్రయోగం ఇది..! తరచూ మనం చూస్తున్న సౌర తుఫాన్ కారణంగా అంతరిక్షంలో ఉపగ్రహాలపై పడుతున్న ప్రభావంతో.. సమాచార వ్యవస్థ పై అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఈ ప్రయోగం ద్వారా ఫోటో స్పియర్, క్రోమోస్పియర్ లపై పరిశోధనలు చేసి భూమిపై సూర్యుని వల్ల కలిగే దుష్పరిణామాలకు కారణాలు, పరిష్కారాలు చూపేందుకు అవకాశాలు తెలిసే అవకాశం ఉందంటోంది ఇస్రో! సెప్టెంబరు 2న ఉదయం 11.50 గంటలకు ఆదిత్య L1 ప్రయోగం జరుగుతుంది.
మరోవైపు చంద్రయాన్ -3 ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్ల 14 రోజుల వర్కింగ్ టైమ్‌లో ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అంటే విక్రమ్-ప్రజ్ఞాన్ కు దాదాపు 150 గంటలు మిగిలి ఉన్నాయి. చంద్రయాన్-3 తన చివరి ఆరు రోజుల్లో అనేక అద్భుతాలను చేయగలదు. అవి ప్రపంచానికి ఉపయోగపడతాయి. విక్రమ్ ల్యాండర్..ప్రజ్ఞాన్ రోవర్ జీవితం కేవలం 14 రోజులు మాత్రమే! ఇది చంద్రుని ఒక పూటతో సమానం! చంద్రునిపై సూర్యుడు అస్తమించగానే.. ఇక అవి పనిచేయలేవు. చంద్రుని దక్షిణ భాగంలో ఆక్సిజన్, ఇతర మూలకాల ఉనికి..ఉష్ణోగ్రతల్లో మార్పులు..వివిధ క్రేటర్స్ ఉనికిని చంద్రయాన్-3 ఇప్పటివరకు గుర్తించింది. రాబోయే కొద్ది రోజుల్లో..చంద్రునిపై భూకంప సంబంధిత కార్యకలాపాలు, చంద్రుడు-భూమి మధ్య సిగ్నల్ దూరం.. మట్టిలో కనుగొన్న కణాలను పరిశీలిస్తుంది.
ఇది కాకుండా, చంద్రుని ఉపరితలంపై ఆక్సిజన్‌తో సహా మొత్తం 8 మూలకాలు ఉన్నాయని విక్రమ్ ల్యాండర్- LIBS పేలోడ్ కనుగొంది. ఇక్కడ హైడ్రోజన్ దొరికితే నీటికి అవకాశాలు పెరుగుతాయి. మొత్తంమ్మీద చంద్రయాన్-3 పరిశోధనలు ప్రపంచానికి విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి.
🚀PSLV-C57/🛰️Aditya-L1 Mission:
The launch of Aditya-L1, the first space-based Indian observatory to study the Sun ☀️, is scheduled for 🗓️September 2, 2023, at 🕛11:50 Hrs. IST from Sriharikota.
Citizens are invited to witness the launch from the Launch View Gallery at… pic.twitter.com/bjhM5mZNrx
— ISRO (@isro) August 28, 2023
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..