ఢిల్లీ మద్యం కుంభకోణం విషయంలో ఈడీ గతంలో అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లను జారీ చేసింది. విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఆయన నవంబర్ 2న ఈడీ ముందర హాజరుకావల్సి ఉండగా వాటిని తిరిగి వెనక్కు తీసుకోవాలని ఆప్ అధినేత ఈడీకి లేఖ రాశారు. కేవలం రాజకీయ కక్ష్య సాధింపు చర్యగా అభివర్ణించారు ఆయన. అయితే ఇప్పుడు ఇది చర్చనీయాంశమైంది. దీని ప్రభావంతో ఢిల్లీలో పలు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. దీంతో ప్రజలకు కొంత ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక ఇలా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
మద్యం కుంభకోణంలో తనకు సమన్లు జారీ చేయడాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యతిరేకించారు. నవంబర్ 2న విచారణకు రావడంలేదని ఈడీ అధికారులకు లేఖ రాశారు. ఇదిలా ఉంటే ఈడీ కార్యాలయం ముందు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసు అధికారులు ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. తుగ్లక్ సమీపంలోని ఈడీ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ఆప్ కార్యకర్తలను నిలువరింపజేసేందుకు బారీకేట్లను ఏర్పాటు చేసింది. పోలీసులతో పాటూ పారా మిలిటరీ బలగాలను మొహరించారు.
డీడీయూ మార్గ్ సహా ఇండియా గేట్, బీజేపీ ప్రధాన కార్యాలయం, ఐటీఓ, వికాస్ మార్గ్ వంటి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో కొంత మేర ట్రాఫిక్ జామ్ ఏర్పాడింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మహాత్మా గాంధీకి నివాళులు అర్పించేందుకు రాజ్ ఘాట్ వెళ్లనున్నట్లు సమాచారం. దీంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతను పెంచారు. ఈడీ జారీ చేసిన సమన్లపై స్పందిస్తూ ఇవి రాజకీయ కుట్ర పూరితమైనవని, బీజేపీ పెద్దల సూచన మేరకే వాటిని జారీ చేసినట్లు తెలిపారు. త్వరలో జరిగే అసెంబ్లీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా చేసేందుకు ఈ సమన్లను అడ్డం పెట్టుకొని రాజకీయ నాటకం అడుతున్నారన్నారు.
మధ్యప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ తో పాటూ కేజ్రీవాల్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. అందుకే కొత్త తేదీన సమన్లు జారీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది ఈడీ. నవంబర్ 2న కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అదే నిజమైతే.. ఢిల్లీ అసెంబ్లీతో పాటూ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని ఓడించింది ఆమ్ ఆద్మీ పార్టీ. వచ్చే ఎన్నికల్లో కూడా కేజ్రీవాల్ ఎక్కడ తనను ఓడిస్తారో అన్న భయంతోనే ఇలాంటి తప్పుడు కేసులు పెడుతుందని ఢిల్లీ మంత్రి అతీషీ విమర్శించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి