ఇండియన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌కు హైఅలర్ట్
జమ్ముకశ్మీర్‌కు సంబంధించి రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. రాజ్యసభలో ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇండియన్ ఆర్మీ, ఎయిర్‌పోర్స్‌కు హైఅలర్ట్ ప్రకటించారు. మరోవైపు జమ్ముకశ్మీర్‌కు అదనపు బలగాలు తరలించారు. ప్రత్యేక విమానాల్లో 8వేల మంది అదనపు బలగాలను అక్కడి పంపారు అధికారులు. అలాగే దక్షిణ కశ్మీర్‌లో కర్ఫ్యూ విధించారు.