AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆర్టికల్ 35 ఏ రాజ్యాంగబధ్దం కాదా ? అరుణ్ జైట్లీ ..!

జమ్మూ కశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 35 ఏ ని కేంద్రం రద్దు చేయవచ్చునని వార్తలు వస్తున్న వేళ… మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ..ఇది దొడ్డి దారిన రాజ్యాంగంలో ప్రవేశించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. (నిజానికి దీన్ని రద్దు చేయరాదని కశ్మీర్ లోని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి). ‘ డిఫైనింగ్ ఇండియా.. థ్రు దెయిర్ ఐస్ ‘ పేరిట సోనియా సింగ్ రాసిన పుస్తకాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. […]

ఆర్టికల్ 35 ఏ రాజ్యాంగబధ్దం కాదా ?  అరుణ్ జైట్లీ ..!
Pardhasaradhi Peri
| Edited By: |

Updated on: Aug 05, 2019 | 2:48 PM

Share

జమ్మూ కశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 35 ఏ ని కేంద్రం రద్దు చేయవచ్చునని వార్తలు వస్తున్న వేళ… మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ..ఇది దొడ్డి దారిన రాజ్యాంగంలో ప్రవేశించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. (నిజానికి దీన్ని రద్దు చేయరాదని కశ్మీర్ లోని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి). ‘ డిఫైనింగ్ ఇండియా.. థ్రు దెయిర్ ఐస్ ‘ పేరిట సోనియా సింగ్ రాసిన పుస్తకాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. వివాదాస్పదమైన ఈ అధికరణం సముచితం కాదని, దీన్ని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన కొన్ని పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగులో ఉన్నాయని ఆయన అన్నారు. కశ్మీర్ లో ఎవరికి శాశ్వతంగా నివసించే హక్కు ఉందో, నిర్ణయించే అధికారాన్ని ఈ అధికరణం ఆ రాష్ట్ర అసెంబ్లీకి కల్పిస్తోంది. అలాగే వారికి రాష్ట్రంలో ఆస్తుల కొనుగోలు, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన హక్కులను కూడా ఇది నిర్దేశిస్తోంది. అయితే పార్లమెంటు ఉభయసభలు చేసిన ఓ సవరణ ఫలితంగా రాజ్యాంగంలో దీన్ని చేర్చలేదు. కానీ ప్రెసిడెన్షియల్ నోటిఫికేషన్ ద్వారా ఈ ఆర్టికల్ని చేర్చారు. అంటే ఇది దొడ్డి దారిన రాజ్యాంగంలో ప్రవేశించినట్టేనని అరుణ్ జైట్లీ అంటున్నారు. ఒకే రాష్ట్రంలోని రెండు కేటగిరీలకు చెందిన ప్రజల మధ్య వివక్ష రేపేదిగా ఈ అధికరణం ఉందన్నది ఆయన వాదన. కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు ఉద్దేశించిన అధికరణంతో బాటు ఇది కూడా ఆ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దెబ్బ తీసేదిగా ఉందని ఆయన అంటున్నారు. ఈ ఆర్టికల్ నేపథ్యంలో పెద్ద పరిశ్రమలు గానీ, బడా హోటళ్లు గానీ, ఇతర కంపెనీలు గానీ కశ్మీర్ కు రాలేదని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ఏడు దశాబ్దాల క్రితం నెహ్రు హయాంలో జరిగిన పొరబాట్లను, లొసుగులను సరిదిద్దుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. సోమవారం పార్లమెంటులో ఈ అధికరణం పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని భావించారు. ముఖ్యంగా కశ్మీర్ ఎంపీలు ఈ అధికారణాన్నీ రద్దు చేసేందుకు సంబంధించిన ప్రకటన ఏదైనా ప్రభుత్వం చేస్తుందేమోనని ఆందోళన చెందారు. అయితే వారి అంచనాలను తారుమారు చేస్తూ.. కాశ్మీర్ లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, ఇతరాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించడానికి ఉద్దేశించిన సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది.