AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎయిర్ ఇండియా ప్రమాదం.. మృతి చెందిన నర్సుపై కేరళ అధికారి నోటి దూల..!

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దేశమంతా అయ్యో పాపం అంటుంటే.. కేరళలోని డిప్యూటీ తహశీల్దార్‌ మాత్రం అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అదే ఫ్లైట్‌లో ప్రయాణిస్తూ.. మృతిచెందిన రంజిత అనే నర్సును కించపర్చేలా వ్యాఖ్యానించాడు. అసలు ప్రమాదం ఎలా జరిగిందో ఇంకా విచారణ కొనసాగుతుండగానే, పైలట్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందంటూ రెచ్చిపోయాడు.

ఎయిర్ ఇండియా ప్రమాదం.. మృతి చెందిన నర్సుపై కేరళ అధికారి నోటి దూల..!
Kerala Deputy Tahsildar Arrest
Balaraju Goud
|

Updated on: Jun 14, 2025 | 6:31 PM

Share

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దేశమంతా అయ్యో పాపం అంటుంటే.. కేరళలోని డిప్యూటీ తహశీల్దార్‌ మాత్రం అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అదే ఫ్లైట్‌లో ప్రయాణిస్తూ.. మృతిచెందిన రంజిత అనే నర్సును కించపర్చేలా వ్యాఖ్యానించాడు. అసలు ప్రమాదం ఎలా జరిగిందో ఇంకా విచారణ కొనసాగుతుండగానే, పైలట్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందంటూ రెచ్చిపోయాడు.

అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై కారుకూతలు కూసిన కేరళ రెవెన్యూ అధికారి పవిత్రన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళలోని వల్లారికుండు తాలూకా కార్యాలయంలో పవిత్రన్ డిప్యూటీ తహశీల్దార్‌గా పనిచేస్తున్నాడు పవిత్రన్. విమాన ప్రమాదంలో చనిపోయిన కేరళ నర్సు రంజిత, ఎయిరిండియా పైలట్‌ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలను పోస్ట్ చేశాడు పవిత్రన్. రంజితను కులం పేరుతో దూషిస్తూ అసభ్య పదజాలంను వాడాడు. విమాన ప్రమాద బాధితుల్లో ఓ నాయ‌ర్ మ‌హిళ ఉంద‌ని, ఆమె చ‌నిపోయింద‌ని, కేర‌ళ ప్రభుత్వం ఆమెకు ఉద్యోగం ఇచ్చింద‌ని, కానీ ఆమె లీవ్ పెట్టి విదేశాల‌కు వెళ్లింద‌ని, ఆమెకు ద‌క్కాల్సిందే ద‌క్కిన‌ట్లు విమ‌ర్శించాడు.

బ్రిట‌న్‌లో ఏడాది నుంచి రంజిత న‌ర్సుగా పని చేస్తోంది. ఇంటి నిర్మాణ ప‌నులు చూసేందుకు ఆదివారం కేరళలోని ఆమె ఇంటికి వ‌చ్చిన‌ట్లు స్థానికులు చెప్పారు. కేర‌ళ ఆరోగ్య శాఖ‌లో ఉద్యోగం సంపాదించడంతో బ్రిట‌న్‌లో జాబ్ కాంట్రాక్టును ముగించుకుని, త్వరగా కేర‌ళ‌కు రావాల‌న్న ఆలోచ‌న‌లో ఉందని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు విమానాన్ని ఆటో డ్రైవర్‌లా నడిపాడంటూ పైలట్‌పైనా విమర్శలు గుప్పించాడు పవిత్రన్. పవిత్రన్ పోస్టు వైరల్‌గా మారడంతో కేరళ ప్రభుత్వం చర్యలకు దిగింది. పవిత్రన్‌ను సస్పెండ్‌చేస్తూ కాసర్‌గడ్ కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు.

అంతేకాదు పవిత్రన్‌పై BNSS సెక్షన్ 75 కింద లైంగిక వేధింపులు, సెక్షన్ 79 కింద మహిళలను కించపరచడం, సెక్షన్ 196 కింద రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడంతో పాటు ఐటీ యాక్ట్ సెక్షన్ 67 (ఎ) ప్రకారం కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. పవిత్రన్‌ తన నోటి దురుసుతనంతో గతంలో కూడా అధికారుల చేతుల్లో చర్యలకు గురయ్యాడు. క‌న్‌హంగ‌ద్ ఎమ్మెల్యే ఈ చంద్రశేఖ‌ర్ కులంపై కామెంట్ చేసిన కేసులోనూ ప‌విత్రన్‌పై చర్యలు తీసుకున్నారు. 2024 సెప్టెంబ‌ర్‌లో సైతం పవిత్రన్‌ సస్పెన్షన్‌కు గురయ్యాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?