జమ్ము కశ్మీర్ సరిహద్దులో కాల్పులు.. ముగ్గురు పాక్ జవాన్లు మ‌ృతి

దేశం మొత్తం 73వ స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో సంతోషంగా ఉన్న సమయంలో జమ్ము కశ్మీర్ సరిహద్దు ప్రాంతంలో గురువారం అనూహ్యంగా పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడింది . ఈ కాల్పుల్లో ముగ్గురు పాక్ ఆర్మీ జవాన్లు మ‌ృతి చెందారు. కాల్పలు విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ఉరీ, రాజౌరీ సెక్టార్లో భారత జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. సరిహద్దు దాటి అనూహ్యంగా కాల్పులు జరపడంతో భారత భద్రతా దళాలు వెంటనే పాక్ దళాలపై ప్రతిదాడులు చేశారు. ఈ కాల్పుల్లో […]

జమ్ము కశ్మీర్ సరిహద్దులో కాల్పులు.. ముగ్గురు పాక్ జవాన్లు మ‌ృతి
Follow us

| Edited By:

Updated on: Aug 15, 2019 | 8:00 PM

దేశం మొత్తం 73వ స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో సంతోషంగా ఉన్న సమయంలో జమ్ము కశ్మీర్ సరిహద్దు ప్రాంతంలో గురువారం అనూహ్యంగా పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడింది . ఈ కాల్పుల్లో ముగ్గురు పాక్ ఆర్మీ జవాన్లు మ‌ృతి చెందారు. కాల్పలు విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ఉరీ, రాజౌరీ సెక్టార్లో భారత జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. సరిహద్దు దాటి అనూహ్యంగా కాల్పులు జరపడంతో భారత భద్రతా దళాలు వెంటనే పాక్ దళాలపై ప్రతిదాడులు చేశారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పాక్ సైనికులు మృతిచెందారు. కాల్పులపై ఎలాంటి ముందస్తు హెచ్చరికలు చేయకుండా దాడి జరగడంతో నాయక్ తన్వీర్, సిపాయి రంజాన్, లాన్స్ నాయక్ తైమూర్ అనే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

ఇదిలా ఉంటే ఈ కాల్పల్లో ఐదుగురు భారత సైనికులు మరణించారనే పాక్ ఆర్మీ వాదనలను భారత్ ఖండించింది. ప్రస్తుతం  సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.