Army Helicopter Crash Live: ఊటిలో కూప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. సీడీఎస్ బిపిన్‌ రావత్‌‌తో సహా 13మంది మృతి!

Balaraju Goud

|

Updated on: Dec 08, 2021 | 10:04 PM

తమిళనాడులోని ఊటి దగ్గర ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ హెలికాప్టర్‌లో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణితో పాటు మరో 10 మంది ఆర్మీ ఉన్నతాధికారులు ప్రాణాలను కోల్పోయారు.

Army Helicopter Crash Live: ఊటిలో కూప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. సీడీఎస్ బిపిన్‌ రావత్‌‌తో సహా 13మంది మృతి!
Defence Helicopter Crashes

Army Helicopter Crash Live: తమిళనాడు లోని ఊటి దగ్గర ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ హెలికాప్టర్‌లో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌ సతీమణితో పాటు 13 మంది ప్రాణాలను కోల్పోయారు.  త‌మిళ‌నాడులోని నీల‌గిరి కొండ‌ల్లో బుధ‌వారం మ‌ధ్యాహ్నం కుప్ప‌కూలిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో రావ‌త్‌తో పాటు ఆయ‌న భార్య‌, ఏడుగురు ఆర్మీ అధికారులు, ఐదుగురు సిబ్బంది ఉన్న‌ట్లు ఆర్మీ అధికారులు వెల్ల‌డించారు. ఇందులో 11 మంది మృత‌దేహాలను వెలికితీశారు.

కాగా, తమిళనాడులో మిలిటరీ హెలికాప్టర్ కూలిన ఘటనలో 14 మంది సిబ్బందిలో 13 మంది మరణించినట్లు నిర్ధారించారు. మృతదేహాల గుర్తింపులు DNA పరీక్ష ద్వారా నిర్ధారించడం జరుగుతుందని విశ్వనీయవర్గాల వెల్లడిచాయి.

Helicopter Crash

Helicopter Crash

ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు నీటితో మంటలు ఆర్పేందుకు విశ్వప్రయత్నం చేశారు. ప్రమాదంలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న బిపీన్ రావత్ సతీమణి మరణించినట్లు ఇండియన్ ఆర్మీ ధృవీకరించింది.

ఎం ఐ హెలికాఫ్టర్ లో మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నారని, వీరిలో 13మంది మరణించినట్లు అనధికారిక వర్గాల నుంచి సమాచారం తెలుస్తోంది. నీలగిరి జిల్లా కూనుర్‌ వెల్లింగటన్‌లో సైనిక అధికారుల శిక్షణ కళాశాల కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ జరిగే కార్యక్రమానికి హాజరుకావడానికి కొయంబత్తూరులోని ఆర్మీ సెంటర్‌ నుంచి హెలికాప్టర్‌లో ప్రయణించే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ప్రమాదంపై స్పందించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్..

ప్రమాదం జరిగిన సమయంలో బిపిన్ రావత్ హెలికాప్టర్ లో ఉన్నట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారికంగా ధృవీకరించింది. ప్రమాదం జరగడానికి గల కారణంపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీ ట్విట్టర్ వేదికగా తెలిపింది.

హెలికాప్టర్‌లో ఎవరెవరున్నారంటే..

ప్రమాదం జరిగి సమయంలో సీడీస్‌ బిపిన్‌ రావత్‌, సీడీఎస్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హర్జిందర్‌ సింగ్‌, నాయక్‌ గురుసేవక్‌ సింగ్ (పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌), నాయక్‌ జితేందర్‌ కుమార్‌ (పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌), లాన్స్‌ నాయక్‌ వివేక్‌ కుమార్‌ (పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌), లాన్స్‌ నాయక్‌ సాయి తేజ (పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌), హవాల్దార్‌ సత్పాల్‌ (పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌) ఉన్నారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 08 Dec 2021 10:03 PM (IST)

    బయటకు వచ్చిన ప్రమాద వీడియో

    ఆర్మీ హెలికాప్ట‌ర్ కుప్ప‌కూలిన ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. సిడిఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ఇక్కడ కూలిపోయింది. ఇందులో ఆయన భార్య, ఇతర సిబ్బంది కూడా ఉన్నారు.

  • 08 Dec 2021 09:57 PM (IST)

    ఢిల్లీ కంటోన్మెంట్‌లో రావత్ అంత్యక్రియలు

    చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ అతని భార్య అంత్యక్రియలు శుక్రవారం డిసెంబర్ 10న ఢిల్లీ కంటోన్మెంట్‌లో జరగనున్నాయి. రేపు సాయంత్రంలోగా వారి పార్థివ దేహాన్ని సైనిక విమానంలో దేశ రాజధానికి చేరుకునే అవకాశం ఉంది.

  • 08 Dec 2021 09:56 PM (IST)

    శుక్రవారం ఢిల్లీకి రావత్ దంపతుల మృతదేహాలు

    హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావ‌త్‌, ఆయన సతీమణి మృతదేహాలను శుక్రవారం ఢిల్లీలోని వారి ఇంటికి తీసుకురానున్నారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజలకు అంతిమ నివాళులర్పించేందుకు అనుమతిస్తారు. ఆ తర్వాత ఢిల్లీ కంటోన్మెంట్‌లోని బ్రార్ స్క్వేర్ శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర సాగనుంది. అంత్యక్రియల ఊరేగింపు కామరాజ్ మార్గ్ నుండి ప్రారంభమవుతుంది.

  • 08 Dec 2021 09:07 PM (IST)

    భూటాన్ ప్రధాని సంతాపం

    CDS బిపిన్ రావత్, మరో 12 మంది మృతి పట్ల భూటాన్ ప్రధాని సంతాపం తెలిపారు. “భారతదేశంలో హెలికాప్టర్ ప్రమాదంలో CDS జనరల్ బిపిన్ రావత్, అతని భార్యతో సహా 11 మంది విలువైన ప్రాణాలను కోల్పోవడం చాలా బాధ కలిగించింది. భూటాన్ ప్రజలు, మేము మృతుల కుటుంబాల కోసం ప్రార్థనలు చేస్తున్నాము.” అంటూ భూటాన్ ప్రధాని ట్వీట్ చేశారు.

  • 08 Dec 2021 09:02 PM (IST)

    పాక్ సైనికాధికారుల సంతాపం

    సీడీఎస్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ మ‌ర‌ణం పట్ల పాక్ సైనికాధికారులు సంతాపం తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

  • 08 Dec 2021 08:58 PM (IST)

    రావ‌త్ మ‌ర‌ణం దుర‌దృష్ట‌క‌రంః కేటీఆర్

    సీడీఎస్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ మ‌ర‌ణం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని రాష్ట్ర మంత్రి కేటీ రామారావు సంతాపం వ్యక్తం చేశారు. ఆర్మీ హెలికాప్ట‌ర్ ప్ర‌మాద ఘ‌ట‌న‌లో రావ‌త్‌, ఆయ‌న స‌తీమ‌ణి మ‌ధులిక‌తో పాటు మ‌రో 11 మంది సైనికులు మృతి చెంద‌డం త‌న‌ను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. మృతి చెందిన‌ సైనికుల కుటుంబాల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్న‌ట్టు కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

  • 08 Dec 2021 08:57 PM (IST)

    గురువారం సాయంత్రం కల్లా ఢిల్లీకి భౌతికకాయాలు!

    తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ కూలి మరణించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, అతని భార్యతో పాటు ఇతర సాయుధ దళాల భౌతిక అవశేషాలు గురువారం సాయంత్రంలోగా ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉందని మిలటరీ వర్గాలు తెలిపాయి.

  • 08 Dec 2021 08:43 PM (IST)

    పుట్టినరోజు వేడుకలకు సోనియా గాంధీ దూరం

    కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన పుట్టినరోజును గురువారం జరుపుకోకూడదని నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీ బుధవారం తెలిపింది. ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ పార్టీ చీఫ్ నిర్ణయాన్ని ట్విట్టర్‌లో ప్రకటించారు. పార్టీ కార్యకర్తలు పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని కోరారు.

  • 08 Dec 2021 08:40 PM (IST)

    జనరల్ రావత్ మృతికి ప్రముఖులు సంతాపం

    బిపిన్ రావత్ బృందం మృతి పట్ల ప్రముఖ నేపథ్య గాయని లతా మంగేష్కర్, నటుడు కంగనా రనౌత్, కమల్ హాసన్ మరియు ఇతర సినీ ప్రముఖులు బుధవారం ట్విట్టర్‌లో సంతాపం తెలిపారు. తమిళనాడులోని కూనూర్ సమీపంలో వారు ప్రయాణిస్తున్న సైనిక హెలికాప్టర్ కూలిపోవడంతో జనరల్ రావత్, అతని భార్య మధులిక,మరో 11 మంది సాయుధ దళాల సిబ్బంది బుధవారం మరణించినట్లు భారత వైమానిక దళం తెలిపింది.

  • 08 Dec 2021 08:36 PM (IST)

    హెలికాప్టర్ ప్రమాదం దురదృష్టకరంః హరీష్‌రావు

    హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావ‌త్‌తో సహా ఆర్మీ సిబ్బంది మృతిప‌ట్ల ఆర్థిక‌, వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. ఆర్మీ హెలికాప్ట‌ర్ కుప్ప‌కూలిన ఘ‌ట‌న‌లో భార‌త తొలి సీడీఎస్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్, ఆయ‌న భార్య మ‌ధులిక‌తో పాటు 11 మంది సైనికులు మృతి చెంద‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని పేర్కొన్నారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి ప్ర‌క‌టిస్తున్నాన‌ని హ‌రీశ్‌రావు తెలిపారు.

  • 08 Dec 2021 08:30 PM (IST)

    ప్రమాదంలో మృతులు వీరే

    ఈ ప్రమాదంలో బిపిన్‌ రావత్‌, సాయితేజతో పాటు మధులిక, హర్జీందర్‌ లిడ్డర్‌, గురుసేవక్‌ సింగ్‌, జితేంద్ర కుమార్‌, వివేక్‌కుమార్‌, సత్‌పాల్ మృతి చెందారు. హెలికాప్టర్‌లో ఉన్న కేవలం ఒక్కరు మాత్రమే తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

  • 08 Dec 2021 08:29 PM (IST)

    చిత్తూరు జిల్లాలో విషాద ఛాయలు

    చిత్తూరు జిల్లా కురబలకోటకు చెందిన సాయితేజ బిపిన్‌ రావత్‌కు సెక్యూరిటీ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రమాద సమయంలో సాయితేజ హెలికాప్టర్‌లోనే ఉండటంతో మృతి చెందినట్టు ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని చిత్తూరు జిల్లాలో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో సాయితేజ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

  • 08 Dec 2021 08:28 PM (IST)

    తెలుగు జవాన్‌ సాయితేజ

    హెలికాప్టర్‌ ప్రమాదంలో సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌లో పాటు మొత్తం 13 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఓ తెలుగు జవాన్‌ కూడా చనిపోవడంతో ఆయన కుటుంబంలో విషాదం అలుముకుంది. సాయితేజ అనే తెలుగు జవాన్‌ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందారు.

  • 08 Dec 2021 08:24 PM (IST)

    మంచి స్నేహశీలిని కోల్పోయాంః అమెరికా కాన్సలేట్

    తమిళనాడులో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు, CDS బిపిన్ రావత్ కుటుంబ సభ్యులకు అమెరికా రాయబార కార్యాలయం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.  భారతదేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా, జనరల్ రావత్ భారత సైన్యంలో ఒక చారిత్రాత్మక మార్పునకు నాయకత్వం వహించారు. అతను యునైటెడ్ స్టేట్స్‌కు బలమైన స్నేహితుడు, US మిలిటరీతో భారతదేశం రక్షణ సహకారంలో ప్రధాన విస్తరణను పర్యవేక్షించారు. సెప్టెంబరులో, అతను సైనిక అభివృద్ధి, సారూప్య దేశాలతో మన సహకారాన్ని పెంపొందించే అవకాశాలను చర్చించడానికి జనరల్ మార్క్ మిల్లీతో ఒక కౌంటర్ పర్యటనలో భాగంగా యునైటెడ్ స్టేట్స్ అంతటా ఐదు రోజులు ప్రయాణించారు. భారత ప్రజలకు, భారత సైన్యానికి ప్రగాఢ సానుభూతి తెలిజేసింది అమెరికా రాయబార కార్యాలయం. అలాగే, ఈ ప్రమాదంలో గాయపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ పూర్తిగా కోలుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము అంటూ ఒక ప్రకటనలో తెలిపింది.

  • 08 Dec 2021 07:43 PM (IST)

    తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఉప రాష్ట్రపతి

    తమిళనాడులోని కూనూర్‌లో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆయన భార్య, ఇతర సాయుధ బలగాల మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.

  • 08 Dec 2021 07:40 PM (IST)

    అమర వీరులకు నివాళి

    ప్రధాని మోదీ నేతృత్వంలో ఈరోజు జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో, సభ్యులందరూ రెండు నిమిషాలు మౌనం పాటించి సైనిక హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ నివాళులు అర్పించారు.

  • 08 Dec 2021 07:39 PM (IST)

    రక్షణ రంగానికి రావత్ సేవలు మరవలేనివిః సీఎం కేసీఆర్

    జనరల్ బిపిన్ రావత్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు సంతాపం ప్రకటించారు. హెలికాప్టర్ ప్రమాదంలో రావత్ తో పాటు ఆయన సతీమణి, పలువురు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రక్షణ రంగానికి బిపిన్ రావత్ చేసిన సేవలను సీఎం కేసిఆర్ స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

  • 08 Dec 2021 07:28 PM (IST)

    ఇప్పటి వరకు ప్రమాదానికి గురైన MI విమానాలు..

    08 డిసెంబర్‌ 2021 – కూనూర్‌ – తమిళనాడు ( మరణాలు 13) 18 నవంబర్‌ 2021 – రోచామ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ ( మరణాలు 3) 27 ఫిబ్రవరి 2019- బుడగాం – కశ్మీర్‌ ( మరణాలు 7) 14 జులై 2018 – చమోలి – ఉత్తరాఖండ్‌ 06 అక్టోబర్‌ 2017 – తవాంగ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ ( మరణాలు 6) 25 జూన్‌ 2013 ఉత్తరాఖండ్‌ – (మరణాలు 8 ) 31 ఆగస్టు 2012 జామ్‌ నగర్‌ ఎయిర్‌ బేస్ – గుజరాత్‌ ( మరణాలు 9) నవంబర్‌ 19, 2010 తవాంగ్‌ – అరుణాచల్‌ ప్రదేశ్‌ (మరణాలు 12)

  • 08 Dec 2021 06:43 PM (IST)

    దేశానికి చాలా విచారకరమైన రోజుః అమిత్ షా

    మన CDS, జనరల్ బిపిన్ రావత్ జీని చాలా విషాదకరమైన ప్రమాదంలో కోల్పోయిన దేశానికి చాలా విచారకరమైన రోజు. మాతృభూమికి అత్యంత భక్తిశ్రద్ధలతో సేవ చేసిన వీర సైనికుల్లో ఆయన ఒకరు. అతని ఆదర్శప్రాయమైన సహకారం, నిబద్ధత మాటల్లో చెప్పలేము. నేను తీవ్రంగా బాధపడ్డాను.అంటూ హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.

  • 08 Dec 2021 06:41 PM (IST)

    ప్రమాదంలో వీరులను కోల్పోవడం బాధగా ఉందిః మోడీ

    తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదం తీవ్రంగా కలిచివేసిందని భారతమాత వీరులను కోల్పోయిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య , ఇతర సాయుధ దళాల సిబ్బందిని కోల్పోయినందుకు నేను చాలా బాధపడ్డాను. వారు భారతదేశానికి అత్యంత శ్రద్ధతో సేవ చేశారు. నా ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి. భారతదేశపు మొదటి CDSగా, జనరల్ రావత్ రక్షణ సంస్కరణలతో సహా మన సాయుధ దళాలకు సంబంధించిన విభిన్న అంశాలపై పనిచేశారు. అతను తనతో పాటు ఆర్మీలో పనిచేసిన గొప్ప అనుభవాన్ని తెచ్చుకున్నారు. ఆయన చేసిన విశేష సేవలను భారతదేశం ఎన్నటికీ మరువదు. జనరల్ బిపిన్ రావత్ అద్భుతమైన సైనికుడు. నిజమైన దేశభక్తుడు, అతను మన సాయుధ దళాలను, భద్రతా యంత్రాంగాన్ని ఆధునీకరించడంలో గొప్పగా దోహదపడ్డారు. వ్యూహాత్మక విషయాలపై అతని దృక్పథాలు అసాధారణమైనవి. ఆయన మృతి నన్ను తీవ్రంగా కలచివేసింది. ఓం శాంతి. అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

  • 08 Dec 2021 06:33 PM (IST)

    దేశం ఒక ధీరుడుని కోల్పోయిందిః రాష్ట్రపతి

    తమిళనాడులోని కూనూర్‌లో హెలికాప్టర్ ప్రమాదంలో CDS జనరల్ బిపిన్ రావత్ మరణం పట్ల భారత రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. జనరల్ బిపిన్ రావత్, అతని భార్య మధులికా జీ అకాల మరణం పట్ల నేను దిగ్భ్రాంతి చెందాను, తీవ్ర వేదనకు గురయ్యాను. దేశం తన ధీర కుమారుల్లో ఒకరిని కోల్పోయింది. మాతృభూమికి అతని నాలుగు దశాబ్దాల నిస్వార్థ సేవ అసాధారణమైన శౌర్యం, వీరత్వంతో దేశం గుర్తించుకుంటుంది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. అంటూ రాష్ట్రపతి ట్వీట్ చేశారు.

  • 08 Dec 2021 06:28 PM (IST)

    తీవ్ర సంతాపం తెలిపిన రాహుల్ గాంధీ

    బిపిన్ రావత్ మృతిపట్ల కాంగ్రెస్ ఎంపీ రాహుల్ సంతాపం వ్యక్తం చేశారు. జనరల్ బిపిన్ రావత్, అతని భార్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం బాధకరం. వారి కుటుంబానికి నా సానుభూతిని తెలియజేస్తున్నాను. ఇది తీవ్ర విషాదం, ఈ కష్ట సమయంలో మా ఆలోచనలు వారి కుటుంబంతో ఉన్నాయి. ప్రాణాలు కోల్పోయిన మిగతా వారందరికీ కూడా హృదయపూర్వక సంతాపం. ఈ దుఃఖంలో భారతదేశం ఐక్యంగా ఉందామని. అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

  • 08 Dec 2021 06:24 PM (IST)

    చికిత్స పొందుతున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్

    మిలిటరీ ఛాపర్ ప్రమాదంలో గాయపడిన భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ వెల్లింగ్‌టన్‌లోని మిలిటరీ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. 2020లో వైమానిక అత్యవసర సమయంలో తన LCA తేజస్ యుద్ధ విమానాన్ని రక్షించినందుకు ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శౌర్య చక్రను అందుకున్నారు.

  • 08 Dec 2021 06:20 PM (IST)

    బిపిన్ రావత్ కన్నుమూత

    తమిళనాడులోని కూనూర్‌లో హెలికాప్టర్ ప్రమాదంలో CDS జనరల్ బిపిన్ రావత్ మరణించినట్లు IAF ధృవీకరించింది.

  • 08 Dec 2021 06:13 PM (IST)

    బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్ దుర్మరణం

    Cds Bipin Rawat1

    Cds Bipin Rawat1

    తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ బిపిన్ రావత్‌తో పాటు ఆయన సతీమణి మధులికా రావత్ మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. హెలికాఫ్ట‌ర్ ప్ర‌మాదానికి లోన‌వ‌డంతో వాయుసేన ఉన్న‌తాధికారులు దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు.

    బిపిన్ రావత్ దుర్మరణం పట్ల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతాపం తెలిపారు.

  • 08 Dec 2021 06:07 PM (IST)

    హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది మృతి, ఒకరు సీరియస్

    తమిళనాడులో కూలిపోయిన ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్‌లోని 14 మందిలో 13 మంది మరణించారు. తీవ్రంగా గాయపడ్డ ఒక వ్యక్తిని సహాయక బృందాలు రక్షించాయని నీలగిరి జిల్లా మేజిస్ట్రేట్ చెప్పారు.

  • 08 Dec 2021 05:07 PM (IST)

    ప్రమాదస్థలానికి రక్షణ మంత్రి!

    ఘ‌ట‌నా స్ధ‌లాన్ని సంద‌ర్శించేందుకు ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ వీఆర్ చౌధ‌రి సుపూర్ ఎయిర్‌బేస్‌కు వెళ్లారు. ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ కూడా ఘ‌ట‌నా స్ధ‌లానికి చేరుకోనున్నారు.

    Rajnath Singh

    Rajnath Singh

  • 08 Dec 2021 05:03 PM (IST)

    హెలికాప్టర్ చెట్లను ఢీకొట్టి మంట‌లు

    సీడీఎస్ ప్ర‌యాణిస్తున్న హెలికాఫ్ట‌ర్ ప్ర‌మాదానికి లోన‌వ‌డంతో వాయుసేన ఉన్న‌తాధికారులు దిగ్ర్భాంతి వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ప్ర‌మాదానికి దారితీసిన ప‌రిస్ధితులు, కార‌ణాల‌పై హాట్ డిబేట్ సాగుతోంది. హెలికాప్టర్ చెట్లను ఢీకొట్టి మంట‌లు వ్యాపించ‌గా తాను చూశాన‌ని ప్ర‌త్య‌క్ష సాక్షి చెప్పుకొచ్చారు. హెలికాఫ్ట‌ర్ పూర్తిగా ద‌గ్ధ‌మైన దృశ్యాలు క‌నిపించాయి.

    Bipin Rawat

    Bipin Rawat

  • 08 Dec 2021 04:52 PM (IST)

    14 మంది సిబ్బందిలో 13 మంది మృతి

    తమిళనాడులో మిలిటరీ హెలికాప్టర్ కూలిన ఘటనలో 14 మంది సిబ్బందిలో 13 మంది మరణించినట్లు నిర్ధారించారు. మృతదేహాల గుర్తింపులు DNA పరీక్ష ద్వారా నిర్ధారించడం జరుగుతుందని విశ్వనీయవర్గాల వెల్లడిచాయి.

  • 08 Dec 2021 04:50 PM (IST)

    రెస్క్యూ ఆపరేషన్స్‌లో పాల్గొనండిః స్టాలిన్

    రెస్క్యూ ఆపరేషన్స్‌లో అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించాలని స్థానిక అధికార యంత్రాంగాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదేశించారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని మరికాసేపట్లో సీఎం స్టాలిన్ పరిశీలించనున్నారు.

  • 08 Dec 2021 04:43 PM (IST)

    రక్షణ మంత్రితో ఆర్మీ చీఫ్ జనరల్ కీలక భేటీ

    రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే కలుసుకున్నారు. తమిళనాడులో సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ కూడా ప్రయాణిస్తున్న మిలటరీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనపై ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు.

  • 08 Dec 2021 04:37 PM (IST)

    తీవ్ర గాయాలతో బిపిన్ రావత్?

    విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించిన వ్యక్తులలో సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ కూడా ఉన్నారు. వెల్లింగ్‌టన్‌లోని మిలిటరీ ఆసుపత్రి నుంచి సీరియస్‌గా ఉన్న సైనికాధికారులను ఢిల్లీకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకే ఎయిర్‌ఫోర్స్ తమిళనాడుకు ఎయిర్ అంబులెన్స్‌ను పంపింది.

  • 08 Dec 2021 04:33 PM (IST)

    హెలికాప్టర్ ప్రమాద వీడియో

    ఆర్మీ హెలికాప్ట‌ర్ కుప్ప‌కూలిన ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. సిడిఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ఇక్కడ కూలిపోయింది. ఇందులో ఆయన భార్య, ఇతర సిబ్బంది కూడా ఉన్నారు.

  • 08 Dec 2021 04:24 PM (IST)

    ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం జరిగిన తీరు – ఆ తర్వాత..

    సీడీఎస్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ ప్ర‌యాణిస్తోన్న ఆర్మీ హెలికాప్ట‌ర్ త‌మిళ‌నాడులోని నీల‌గిరి కొండ‌ల్లో బుధ‌వారం మ‌ధ్యాహ్నం కుప్ప‌కూలిన సంగ‌తి తెలిసిందే.

    11.50am – సూలూరు ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి బయలు దేరిన హెలికాప్టర్ 12.27pm – జిల్లా కూనూరు దగ్గర హెలికాప్టర్ ప్రమాదం 01.15pm – ప్రధాని, రక్షణ మంత్రికి సమాచారమిచ్చిన ఎయిర్‌పోర్స్ 01.30pm – ప్రమాదాన్ని ధృవీకరించిన రక్షణ శాఖ 03.00pm – ప్రధాని మోడీ అద్యక్షతన కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ 03.15pm – ఘటన వివరాలను కేబినెట్‌కు వివరించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ 03.45pm – బిపిన్ రావత్ ఇంటికి వెళ్లిన రాజ్‌నాథ్ సింగ్

  • 08 Dec 2021 04:18 PM (IST)

    గ‌తంలోనూ బిపిన్ రావ‌త్ హెలికాప్ట‌ర్‌కి ప్రమాదం

    గ‌తంలోనూ బిపిన్ రావ‌త్ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదానికి గుర‌య్యారు. 2015, ఫిబ్ర‌వ‌రి 3వ తేదీన బిపిన్ రావ‌త్ నాగాలాండ్‌లోని దిమాపూర్ ప‌ర్య‌ట‌న‌కు ఆర్మీ హెలికాప్ట‌ర్‌లో బ‌య‌ల్దేరారు. ఆ స‌మ‌యంలో ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో హెలికాప్ట‌ర్ కుప్ప‌కూలిపోయింది. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న నుంచి రావ‌త్‌తో పాటు ఇద్ద‌రు పైల‌ట్లు స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. నాగాలాండ్ ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో బిపిన్ రావ‌త్ లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్నారు.

  • 08 Dec 2021 04:10 PM (IST)

    రేపు పార్లమెంట్‌లో రక్షణ మంత్రి ప్రకటన

    ఊటీ ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రేపు పార్లమెంట్‌లో ప్రకటన చేయనున్నారు.

  • 08 Dec 2021 04:04 PM (IST)

    బిపిన్ రావత్ ఇంటికి రాజ్‌నాథ్

    రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దేశ రాజధాని ఢిల్లీలోని సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ఇంటికి చేరుకున్నారు.

  • 08 Dec 2021 04:02 PM (IST)

    సీనియర్ ఆర్మీ అధికారులతో రక్షణమంత్రి అత్యవసర భేటీ

    తమిళనాడులో కూలిన సైనిక హెలికాప్టర్‌కు సంబంధించి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రక్షణ శాఖ సీనియర్ అధికారులతో ఆయన సమావేశం అయ్యారు. ప్రమాదం గురించి రాజ్‌నాథ్ సింగ్ ప్రధాని మోడీకి వివరించారు.

  • 08 Dec 2021 04:00 PM (IST)

    నీలగిరి పర్యటనకు ఎంకే స్టాలిన్

    తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈరోజు సాయంత్రం చెన్నై విమానాశ్రయం నుంచి కోయంబత్తూరు వెళ్లి ఆ తర్వాత నీలగిరికి చేరుకుంటారు. ఈ జిల్లాలో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించనున్నారు.

  • 08 Dec 2021 03:58 PM (IST)

    వెల్లింగ్టన్‌లోని మిలటరీ ఆసుపత్రికి మృతదేహాలు

    తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ – సూలూరు మధ్య హెలికాప్టర్ కూప్పకూలినట్లు అధికారులు గుర్తించారు. ప్రమాద స్థలాన్ని ఆర్మీ అధికారులు స్వాధీనం చేసుకుని, మృతదేహాలను తమిళనాడులోని వెల్లింగ్టన్‌లోని మిలటరీ ఆసుపత్రికి తరలించినట్లు సైనిక వర్గాలు తెలిపాయి.

  • 08 Dec 2021 03:56 PM (IST)

    హెలికాప్టర్‌లో ఉన్న వ్యక్తుల పేర్లు

    తమిళనాడులో కూలిన సైనిక హెలికాప్టర్‌లో 14 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో CDS జనరల్ బిపిన్ రావత్, అతని భార్య మధులికా రావత్, బ్రిగేడియర్ LS లిద్దర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, NK గుర్సేవక్ సింగ్, NK జితేంద్ర కుమార్, L/నాయక్ వివేక్ కుమార్, L/నాయక్ B సాయి తేజ, హవల్దార్ సత్పాల్ ఉన్నారు.

  • 08 Dec 2021 03:54 PM (IST)

    వెల్లింగ్టన్ వెళుతున్న హెలికాప్టర్

    IAF Mi-17V5 హెలికాప్టర్ సూలూరు నుండి వెల్లింగ్టన్‌కు వెళుతోంది. విమానంలో సిబ్బందితో సహా 14 మంది ఉన్నారు. వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ స్టాఫ్ కాలేజీకి సీడీఎస్ రావత్ వెళ్తున్నట్లు సమాచారం. అప్పుడే ఈ ప్రమాదం జరిగింది.

  • 08 Dec 2021 03:50 PM (IST)

    ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ప్రత్యేక‌తలు

    Mi-17V-5 హెలికాప్టర్ Mi-8/17 కుటుంబానికి చెందిన మిలిట‌రీ ర‌వాణా విమానం ర‌ష్యన్ హెలికాప్టర్స్‌కు చెందిన స‌బ్సిడ‌రీ అయిన క‌జాన్ హెలికాప్ట‌ర్స్ దీనిని రూపొందించారు ఈ Mi-17V-5 హెలికాప్ట‌ర్ ప్ర‌పంచంలోనే అత్యాధునిక ర‌వాణా హెలికాప్ట‌ర్‌ ఈ హెలికాప్ట‌ర్‌ల‌ను భ‌ద్ర‌తాబ‌లాగాల ర‌వాణాకు, అగ్నిప్ర‌మాదాల క‌ట్ట‌డికి సేవలకు మాత్రమే వినియోగం కాన్వాయ్ ఎస్కార్ట్‌గా, పెట్రోలింగ్ విధుల్లో, గాలింపు, ర‌క్ష‌ణ ఆప‌రేష‌న్‌ల‌లో వినియోగం

  • 08 Dec 2021 03:47 PM (IST)

    సహాయక చర్యలు చేపట్టాంః రామచంద్రన్

    తమిళనాడులోని ఊటి దగ్గర ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనపై తమిళనాడు రాష్ట్ర మంత్రి రామచంద్రన్ కీలక ప్రకటన చేశారు. ఈ హెలికాప్టర్‌లో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణితో సహా 14 మంది ఈ హెలికాఫ్టర్‌లో ప్రయాణించారని తెలిపారు. సీఎం స్టాలిన్ ఆదేశాలతో ప్రమాదస్థలిలో సహాయక చర్యలు వేగవంతం చేశామన్నారు. ప్రస్తుతం ముగ్గురు ఆస్పత్రిలో విషమపరిస్థితిలో ఉన్నారు. ఆర్మీ నుండి ఉన్నతస్థాయి అధికారులు వచ్చారని.. ఈ ప్రమాదం జరిగిన తీరుఫై వివరాలు సేకరిస్తున్నారని మంత్రి తెలిపారు.

  • 08 Dec 2021 03:43 PM (IST)

    ఉత్తరాఖండ్‌ ముద్దు బిడ్డ

    ఉత్తరాఖండ్‌లోని పౌరీలో రాజ్‌పుత్‌ కుటుంబంలో ఆయన జన్మించారు. ఆయన తండ్రి లక్ష్మణ్‌ సింగ్‌ రావత్‌ భారత సైన్యంలో లెఫ్టినెంట్‌ జనరల్‌గా పదవీ విరమణ చేశారు.

  • 08 Dec 2021 03:42 PM (IST)

    రక్షణ రంగంలో సంస్కరణలకు మార్గదర్శి

    భారత్‌ రక్షణ రంగంలో అతిపెద్ద సంస్కరణలకు ఆయన మార్గదర్శి. ప్రభుత్వం భారత్‌లో వేర్వేరు చోట్ల త్రివిధ దళాలకు ఉన్న 17 కమాండ్లను కలిపి ఇంటిగ్రేటెడ్‌ థియేటర్‌ కమాండ్లుగా ఏర్పాటు చేసే గురుతర భాధ్యత ఆయనే. ప్రస్తుత ఆర్మీ చీఫ్‌ ఎంఎం నరవణే కంటే ముందు ఆయనే ఆర్మీ చీఫ్‌గా వ్యవహరించారు.

  • 08 Dec 2021 03:41 PM (IST)

    త్రివిధ దళాలకు వ్యూహకర్తగా..

    ప్రస్తుతం భారత్‌లో అత్యంత శక్తిమంతమైన సైనికాధికారి ఆయనే. చైనా, పాకిస్తాన్‌ దూకుడుకు కళ్లెం వేయడంతో బిపిన్‌ రావత్‌కు ఎక్స్‌పర్ట్‌గా ఉన్నారు. లడ్డాఖ్‌ సంక్షోభం సమయంలో ఆయన త్రివిధ దళాలకు వ్యూహకర్తగా పనిచేశారు.

  • 08 Dec 2021 03:40 PM (IST)

    తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌గా రావత్

    జనరల్‌ బిపిన్‌ రావత్‌ భారత తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌గా వ్యవహరిస్తున్నారు. రెండేళ్ల క్రితం అంటే డిసెంబర్‌ 2019లో ఈ పదవిలో బిపిర్‌ రావత్‌ను నియమించింది కేంద్రం. ఆర్మీ చీఫ్‌గా రిటైర్‌ అయిన తరువాత ఈ పదవిని చేపట్టారు బిపిన్‌ రావత్‌.

Published On - Dec 08,2021 3:33 PM

Follow us