Rahul Gandhi: రాహుల్ గాంధీనే పార్టీ చీఫ్‌గా నియమించాలి.. యూత్ కాంగ్రెస్ తీర్మానం..
Indian Youth Congress: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీనే నియమించాలంటూ ఇండియన్ యూత్ కాంగ్రెస్ తీర్మానం చేసింది. సోనియా గాంధీ ప్రస్తుతం తాత్కాలిక కాంగ్రెస్ పార్టీ
Indian Youth Congress: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీనే నియమించాలంటూ ఇండియన్ యూత్ కాంగ్రెస్ తీర్మానం చేసింది. సోనియా గాంధీ ప్రస్తుతం తాత్కాలిక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి అధ్యక్షుడి ఎంపికపై పార్టీ సీనియర్లు సైతం పలు ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో యూత్ కాంగ్రెస్ చేసిన తీర్మానం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. గోవాలోని పనాజీలో జరిగిన ఇండియన్ యూత్ కాంగ్రెస్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో ఈ తీర్మానం చేసి పార్టీ అధిష్టానానికి పంపించారు. దీనికి సంబంధించిన కాపీని యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ సోమవారం ట్విట్టర్‌లో పంచుకున్నారు. రాబోయే రోజుల్లో యూత్ కాంగ్రెస్ దేశ ప్రయోజనాల దృష్ట్యా పలు సమస్యలపై పోరాడుతుందంటూ పేర్కొన్నారు.
కాగా.. 2017లో సోనియాగాంధీ నుంచి రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పగ్గాలను తీసుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల వరకూ ఆయన పార్టీకి సారథ్యం వహించారు. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 52 సీట్లతో దారుణమైన ఫలితాలను చవిచూసింది. పార్లమెంటులో పది శాతం సీట్లు కూడా పొందలేకపోవడంతో.. పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ.. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసారు. దీంతో సోనియాగాంధీ మళ్లీ ఏఐసీసీ తాక్కలిక చీఫ్‌గా బాధ్యతలను చేపట్టేందుకు అంగీకరించారు.
At the National Executive meeting of the Indian Youth Congress, IYC Jointly passes a resolution that Shri @RahulGandhi Ji should be appointed as AICC President as per the constitution of Indian National Congress. pic.twitter.com/c5wxDm6wM7
— Srinivas BV (@srinivasiyc) September 6, 2021
అయితే.. పార్టీ అధ్యక్షుడి విషయంలో కొంతకాలం నుంచి నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెజారిటీ నేతలు రాహుల్ గాంధీకే అధ్యక్ష పగ్గాలు ఇవ్వాలని అంటుండగా కొంతమంది గాంధీయేతర అధ్యక్షుడిని కోరుతున్నారు. ఈ క్రమంలో నేషనల్ యూత్ కాంగ్రెస్ తీర్మానం ఆమోదించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. రాహుల్ గాంధీ తన రాజీనామా లేఖలో గాంధీయేతర వ్యక్తి కాంగ్రెస్‌కు నాయకత్వం వహించాలని పేర్కొన్న విషయం తెలిసిందే.
Also Read: