Delhi Liquor Scam: కేజ్రీవాల్ పై అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు.. ఏం అన్నారంటే

దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంచలనం రేపుతోంది. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్టు అయిన  విషయం తెలిసిందే. అయితే ఆయన అరెస్ట్‌పై ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నాయి. కాగా, కేజ్రీవాల్ అరెస్టుపై సామాజిక కార్యకర్త అన్నా హజారే కూడా రియాక్ట్ అయ్యారు.

Delhi Liquor Scam: కేజ్రీవాల్ పై అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు.. ఏం అన్నారంటే
Anna Hazare
Follow us
Balu Jajala

|

Updated on: Mar 22, 2024 | 1:36 PM

దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంచలనం రేపుతోంది. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్టు అయిన  విషయం తెలిసిందే. అయితే ఆయన అరెస్ట్‌పై ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నాయి. కాగా, కేజ్రీవాల్ అరెస్టుపై సామాజిక కార్యకర్త అన్నా హజారే కూడా రియాక్ట్ అయ్యారు. అరవింద్ నా మాట వినలేదని, ఈ విషయంలో బాధగా ఉందని, లిక్కర్ పాలసీని ఆపాలని నేనెప్పుడూ మాట్లాడేవాడినని, కానీ ఆయనే దాన్ని ప్రారంభించారని, అందువల్లే వల్లే అరెస్ట్ అయ్యారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 21, గురువారం నాడు ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులందరిలో గందరగోళం కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై వ్యాఖ్యానిస్తూ.. ఒకప్పుడు లిక్కర్‌ లాంటి అవినీతికి వ్యతిరేకంగా మేం ఇద్దరం కలిసికట్టుగా పోరాడేవాళ్లం. కానీ నేడు తనపై లిక్కర్ స్కామ్ ఆరోపణలు రావడం గురించి బాధపడ్డాను అని రియాక్ట్ అయ్యారు.

లిక్కర్ పాలసీని ఆపాలని కేజ్రీవాల్‌కు చాలాసార్లు లేఖలు రాశానని, మద్యం వల్ల మనుషులపై హత్య కేసులు పెరిగి, మహిళలను చిత్రహింసలకు గురిచేస్తున్నాయని, అందుకే లిక్కర్ పాలసీ ఆపాలని నేను మాట్లాడానని, కానీ అరవింద్ నా దృష్టికి తీసుకురాకాపోగా మద్యం పాలసీని ప్రారంభించాడు. చివరకు అదే మద్యం పాలసీ కారణంగా అరెస్టయ్యాడు అని వ్యాఖ్యలు చేశారు. అయితే కేజ్రీవాల్ అరెస్ట్ తో ఆప్ నేతల్లో ఆందోళన నెలకొంది. లోక్ సభ ఎన్నికల ముందు ఆయన అరెస్ట్ కావడం నేతలకు షాక్ ఇచ్చినట్టయింది.