AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zomato CEO: రెండో పెళ్లి చేసుకున్న జొమాటో సీఈవో.. రహస్యంగా మెక్సికన్‌ బ్యూటీతో వివాహం

ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ రెండో పెళ్లి చేసుకున్నారు. ప్రముఖ మోడల్ గ్రెసియా మునోజ్‌ను ఆయన వివాహం చేసుకున్నారు. మాజీ మోడల్ అయిన మునోజ్ గ్రెసియా లగ్జరీ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ స్పేస్‌లో స్వంత స్టార్టప్‌ను నడుపుతోంది. మెక్సికోలో పుట్టి పెరిగిన మునోజ్‌.. దీపిందర్‌ గోయల్‌ని పెళ్లి చేసుకోవడంతో భారతదేశంలోని మెట్టింట్లో అడుగుపెట్టినట్లు తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో తెల్పింది..

Zomato CEO: రెండో పెళ్లి చేసుకున్న జొమాటో సీఈవో.. రహస్యంగా మెక్సికన్‌ బ్యూటీతో వివాహం
Zomato CEO Deepinder Goyal
Srilakshmi C
|

Updated on: Mar 22, 2024 | 12:20 PM

Share

ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ రెండో పెళ్లి చేసుకున్నారు. ప్రముఖ మోడల్ గ్రెసియా మునోజ్‌ను ఆయన వివాహం చేసుకున్నారు. మాజీ మోడల్ అయిన మునోజ్ గ్రెసియా లగ్జరీ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ స్పేస్‌లో స్వంత స్టార్టప్‌ను నడుపుతోంది. మెక్సికోలో పుట్టి పెరిగిన మునోజ్‌.. దీపిందర్‌ గోయల్‌ని పెళ్లి చేసుకోవడంతో భారతదేశంలోని మెట్టింట్లో అడుగుపెట్టినట్లు తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో తెల్పింది. 2022 సంవత్సరానికి యునైటెడ్ స్టేట్స్‌లో జరిగిన మెట్రోపాలిటన్ ఫ్యాషన్ వీక్ మునోజ్ విజేతగా నిలిచింది. కాగా జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ కొన్ని నెలల క్రితం మునోజ్‌ను వివాహం చేసుకున్నారు. కాగా దీపిందర్ గోయల్‌కి ఇది రెండో వివాహం. గోయల్ గతంలో ఐఐటీ ఢిల్లీలో చదువుతున్నప్పుడు పరిచయమైన కంచన్ జోషిని వివాహం చేసుకున్నాడు. గత కొంత కాలంగా భార్యతో విడిగా ఉంటున్నట్లు సమాచారం.

భారతీయ స్టార్టప్‌ల పోస్టర్ బాయ్ గోయల్‌ను భారత్‌లోసెలబ్రిటీ స్టార్టప్ స్థాపకులలో ఒకరిగా పరిగణింప బడుతున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన స్టార్టప్ మహాకుంభ్‌లో స్టార్టప్ వ్యవస్థాపకులను, ఎంట్రపెన్యూర్‌లను ఉద్దేశించి గోయల్‌ మాట్లాడుతూ.. జొమాటో సంస్కృతి అభివృద్ధి చెందడానికి, ముందుకు సాగడానికి కృషి చేస్తుందన్నారు. జొమాటో బిజినెస్‌లో ఆవిష్కరణలను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.

వ్యవస్థాపకులు తమ కలల సంస్థను నిర్మించుకునేటప్పుడు డ్రీమ్స్‌, డ్రైవ్‌తో ముందుకు సాగాలని గోయల్ సూచించారు. డబ్బు సంపాదించాలనే ఏకైక కోరికతో వెంచర్‌ను ప్రారంభించడం పనికిరాదని, అది చెడు గవర్నెన్స్ కాల్స్‌కు దారి తీయవచ్చని హెచ్చరించారు. ‘నేను చాలా మంది స్టార్టప్‌ వ్యవస్థాపకులు చాలా కంపెనీలను ప్రారంభించడం చూస్తున్నాను. మీరు ఈ కంపెనీని ఎందుకు ప్రారంభించారని నేను వారిని చాలా సార్లు అడిగాను. వారి నుంచి సమాధానంగా ‘నేను చాలా డబ్బు సంపాదించాలనుకుంటున్నాను’… అని వస్తుంది. ఇది నిజంగా పని చేస్తుందని నేను అనుకోను. మీరు కంపెనీని ప్రారంభించాల్సిన ఉద్దేశ్యం అది కాదు, ఎందుకంటే ఇది బ్యాండ్‌ గవర్నెన్స్‌ కల్స్‌కు దారి తీస్తుందని’ అని అతను నిండిన హాల్‌ను ఉద్దేశించి అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.