Top-9 News: మంత్రి మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణం సహా టాప్-9 వార్తా విశేషాలు..
మంత్రి మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణంతో అందరూ షాక్‌కు గురైయ్యారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్ద పలువురు ప్రముఖులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు.
Top-9 News: మంత్రి మేకపాటి గౌతం రెడ్డి(Minister Mekapati Goutham Reddy) హఠాన్మరణంతో అందరూ షాక్‌కు గురైయ్యారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్ద పలువురు ప్రముఖులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. అటు కేంద్రంపై సీఎం కేసీఆర్(CM KCR) మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. తెలుగు రాష్ట్రాలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చోటుచేసుకున్న టాప్-9 వార్తా విశేషాలు మీ కోసం..
- గౌతంరెడ్డి భౌతిక కాయం దగ్గర నేతలు కన్నీటి నివాళి అర్పిస్తున్నారు. సీఎం జగన్ మేకపాటి కుటుంబాన్ని పరామర్శించారు. గౌతంరెడ్డి హుందాగా ఉండే వారన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. మంత్రి మేకపాటి అరుదైన వ్యక్తిగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కొనియాడారు. ఎల్లుండి అంత్యక్రియలకు నెల్లూరు జిల్లా బ్రాహ్మణపల్లిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
- దేశ రాజకీయాల్లో మార్పు రావాలన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కుల మతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకుంటున్నారంటూ బీజేపీపై విరుచుకపడ్డారు. బంగారు భారత్ నినాదంతో ఇక పనిచేస్తామన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు సీఎం శంకుస్థాపన చేశారు. దీని ద్వారా 3.90 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్‌వన్‌కు చేరుకుంటోందన్నారు.
- ఏపీ సర్కార్‌పై ఎదురుదాడికి దిగుతున్నారు బీజేపీ నేతలు. కేంద్ర నిధులను వాడుకోవడంలో విఫలమయ్యారని జీవీఎల్ విమర్శించారు. ఏపీ అభివృద్ధి కోసం జనసేనతో కలిసి ముందుకెళ్తామన్నారు. త్వరలో విశాఖకు రైల్వేజోన్ వస్తుందని సోమువీర్రాజు తెలిపారు. సర్పంచ్‌ల అకౌంట్లలో డబ్బులు వేయడం లేదని ఆరోపించారు.
- మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసు విచారణ వేగవంతం చేసింది సీబీఐ. దస్తగిరి మరోసారి పులివెందుల కోర్టుకు హాజరయ్యారు. రెండోసారి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. త్వరలోనే కేసు చిక్కుముడి వీడుతుందంటున్నారు సీబీఐ అధికారులు. అనుమానితుల విచారణ కొనసాగిస్తున్నారు.
- యూపీ ఎన్నికల ప్రచారంలో మాటల దాడి మొదలైంది. బుల్లెట్ ట్రైన్ కావాలా పంక్చర్ సైకిల్ కావాలా అని సీఎం యోగి ఆదిత్యనాథ్ సెటైర్ వేశారు. రాహుల్‌గాంధీపైనా యోగి విమర్శలు చేశారు.
- కులం, మతం ఆధారంగా అఖిలేష్ రాజకీయాలు చేస్తున్నారంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ధ్వజమెత్తారు. సీతాపూర్ ప్రచారసభలో ఆరోపణలు గుప్పించారు.
- దాణా స్కామ్‌లో లాలుకి శిక్ష ఖరారైంది. ఐదేళ్ల జైలు శిక్ష.. 60 లక్షల జరిమానా విధించింది సీబీఐ ప్రత్యేక కోర్టు. 25 ఏళ్ల తర్వాత కోర్టు దోషిగా తేల్చింది. 139 కోట్లు అక్రమంగా విత్‌డ్రా చేసినట్లు నిర్ధారిస్తూ..లాలూకు శిక్ష విధించింది.
- ఉక్రెయిన్‌పై యుద్ధం చేయకుండా రాజీ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. రష్యాతో చర్చలకు అమెరికా యత్నిస్తోంది. పుతిన్‌తో చర్చలకు సిద్ధమన్నారు బైడెన్. రష్యా దురాక్రమణకి దిగకూడదని షరతు విధించారు. అటు ఫ్రాన్స్ అధ్యక్షుడికి బైడెన్ ఫోన్ చేశారు.
- మంత్రి మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణంతో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్ర యూనిట్ వాయిదా వేసింది. విషాద సమయంలో సినిమా వేడుక చేయడానికి మనస్కరించట్లేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. అందువల్లనే భీమ్లా నాయక్ వేడుక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
Also Read..
Telangana: కేంద్రంపై తగ్గేదే లే అంటున్న కేసీఆర్.. తెలంగాణ సీఎం కొత్త నినాదం ఇదే..