Trending: పెళ్లి పార్టీలో ఫుల్లుగా మందు కొట్టిన వరుడు… ఛీకొట్టి వెళ్లిపోయిన వధువు.. కట్ చేస్తే..

భారతీయ సంస్కృతిలో వివాహానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ వివాహాన్ని స్పెషల్ గా జరుపుకోవాలని కోరుకుంటారు. కోటి ఆశలతో వధూవరులు కొత్త జీవితంలోకి అడుగుపెడతారు. ఇటీవల..

Trending: పెళ్లి పార్టీలో ఫుల్లుగా మందు కొట్టిన వరుడు... ఛీకొట్టి వెళ్లిపోయిన వధువు.. కట్ చేస్తే..
Wedding
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 15, 2023 | 11:49 AM

భారతీయ సంస్కృతిలో వివాహానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ వివాహాన్ని స్పెషల్ గా జరుపుకోవాలని కోరుకుంటారు. కోటి ఆశలతో వధూవరులు కొత్త జీవితంలోకి అడుగుపెడతారు. ఇటీవల వివాహ వేడుక ట్రెండ్‌గా మారింది. ఎవరూ చేయని విధంగా వెరైటీ వెరైటీ పనులు చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్, హల్దీ, మెహందీ.. ఇలా చెప్పుకుంటూ పోతే పెళ్లి తంతు చాలా పెద్దదే. ప్రతి ఒక్కరూ తమ వివాహ సమయంలో జరిగే ఇన్సిడెంట్స్‌ను నెట్టింట షేర్‌ చేసుకుంటున్నారు. తాజాగా ఓ యువతి పెళ్లి పీటలపైనే వరుడ్ని ఛీకొట్టి వివాహం రద్దు చేసుకొని వెళ్లిపోయింది. అసలేం జరిగిందంటే. తమిళనాడులోని కాంచీపురానికి చెందిన లక్ష్మీ నరసింహన్‌కు, చెంగల్పట్టుకు చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయించారు. ఫిబ్రవరి 13న వివాహం.

ఫిబ్రవరి 12 ఆదివారం రాత్రి ఇరుకుటుంబ సభ్యులు సంగీత్‌ లాంటి ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పార్టీలో వరుడు ఫుల్లుగా మద్యం సేవించి రెచ్చిపోయాడు. అతని తీరు చూసి షాకయిన యువతి వెంటనే ఓ నిర్ణయానికి వచ్చింది. ఇలాంటివాడిని పెళ్లి చేసుకుంటే జీవితం నరకమే అని భావించిన ఆ యువతి వెంటనే తనకు ఈ వివాహం వద్దని చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోయింది. వధువు అలా వెళ్లిపోవడంతో పార్టీ మధ్యలోనే ఆగిపోయింది. అంతేకాదు వరుడు చేసిన నిర్వాకానికి వధువు కుటుంబ సభ్యులు సైతం నివ్వెరపోయారు.

వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కళ్యాణమండపానికి వచ్చిన పోలీసులకు వరుడు తప్పతాగి కదలలేని స్థితిలో కనిపించాడు. ఈ క్రమంలో తమ కుమార్తె వివాహం సదరు వరుడితో రద్దు చేసుకుంటున్నట్టు తెగేసి చెప్పేశారు వధువు తల్లిదండ్రులు. అంతేకాదు వరుడికి కానుకగా ఇచ్చిన బంగారు ఆభరణాలను వెనక్కి తిరిగి తీసుకొని వెళ్లిపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!