Mobile Blast: గేమ్స్ ఆడుతుండగా భారీ శబ్దంలో పేలిన మొబైల్.. ఏంటని చూస్తే మైండ్ బ్లోయింగ్ సీన్..

మొబైల్ ఫోన్.. ఎంత ప్రయోజనమో అంతే ప్రమాదం కూడా. కరోనా పుణ్యమా అని ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగింది. చిన్నా పెద్దా ఆడా మగా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వాడేస్తున్నారు. ఇక చిన్నారుల పరిస్థితి మాత్రం...

Mobile Blast: గేమ్స్ ఆడుతుండగా భారీ శబ్దంలో పేలిన మొబైల్.. ఏంటని చూస్తే మైండ్ బ్లోయింగ్ సీన్..
Mobile Blast
Follow us
Ganesh Mudavath

|

Updated on: Dec 11, 2022 | 5:22 PM

మొబైల్ ఫోన్.. ఎంత ప్రయోజనమో అంతే ప్రమాదం కూడా. కరోనా పుణ్యమా అని ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగింది. చిన్నా పెద్దా ఆడా మగా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వాడేస్తున్నారు. ఇక చిన్నారుల పరిస్థితి మాత్రం మరింత తీవ్రంగా ఉంది. చిన్నప్పటి నుంచి వారికి సెల్ ఫోన్లు అలవాటు అయిపోతున్నాయి. అవి లేకుంటే అన్నం కూడా తినలేని పరిస్థితి వస్తోంది. ఇక ఆన్ లైన్ క్లాసుల పుణ్యమా అని.. ఇప్పుడు చిన్నపిల్లలు సైతం ఫోన్లను ఉపయోగిస్తున్నారు. క్లాసెస్ అయిపోయినప్పుడు విచ్చలవిడిగా గేమ్స్ ఆడుకుంటున్నారు. గతంలో ఔట్ డోర్ గేమ్స్ ఆడే పిల్లలు.. ఇప్పుడు స్క్రీన్ గేమ్స్ కు అడిక్ట్ అవుతున్నారు. ఈ అలవాటును మాన్పించేందుకు తల్లిదండ్రులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. కనీసం మార్పురావడం లేదు. అతిగా వినియోగించి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఉత్తర ప్రదేశ్ లో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.

ఉత్తర ప్రదేశ్ లోని మేవతి మొహల్లా ప్రాంతానికి చెందిన జావేద్‌.. కు జునైద్‌ అనే 13 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. జునైద్ తన గదిలో మొబైల్‌లో గేమ్‌ అడుకుంటున్నాడు. ఈ క్రమంలో మొబైల్‌ ఫోన్‌ ఒక్కసారిగా పేలిపోయింది. ఒక్కసారిగా గదిలో నుంచి భారీ శబ్దం రావడంతో కుటుంబ సభ్యులు భయంతో పరుగులు తీశారు. పరుగు పరుగున అక్కడికి వెళ్లి చూశారు. జునైద్ కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.

బాలుడికి ఛాతి భాగంలో తీవ్ర గాయాలయ్యాయని, తలపైన జుట్టు కూడా కాలిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఒక్కసారిగా బ్లాస్ట్‌ జరగడంతో జునైద్‌ తీవ్రంగా భయపడ్డాడని తెలిపాడు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోందని, జునైద్ ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు వైద్యులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి