కరోనా ఎఫెక్ట్.. ఆన్‌లైన్‌లోనూ హ్యాండ్ శానిటైజర్ల బ్లాక్ మార్కెటింగ్

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తుండగా.. ఫేస్ మాస్కులు, చేతి శానిటైజర్లను బ్లాక్ మార్కెట్లో విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఓ వైపు కేంద్రం హెచ్చరిస్తుండగా మరో వైపు.. ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలు ఇదే అదనని నిర్భయంగా

కరోనా ఎఫెక్ట్.. ఆన్‌లైన్‌లోనూ హ్యాండ్ శానిటైజర్ల బ్లాక్ మార్కెటింగ్
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Mar 08, 2020 | 3:47 PM

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తుండగా.. ఫేస్ మాస్కులు, చేతి శానిటైజర్లను బ్లాక్ మార్కెట్లో విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఓ వైపు కేంద్రం హెచ్చరిస్తుండగా మరో వైపు.. ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలు ఇదే అదనని నిర్భయంగా ఆన్‌లైన్‌లో బ్లాక్ మార్కెట్‌లో అధికధరలకు వీటిని అమ్ముతున్నాయి. మామూలు ధరల కన్నా మూడింతలు, నాలుగింతల ధరలకు అమ్ముతున్నాయి. 30 ఎం ఎల్ బాటిల్ తో కూడిన హ్యాండ్ శానిటైజర్ ని ఫ్లిప్ కార్ట్.. ‘సూపర్ రిటైలర్స్’ పేరిట అసలు ధర కన్నా 16 రెట్లు ఎక్కువ ధరకు అమ్ముతోందట. తమవి హిమాలయ ప్యూర్ హ్యాండ్ శానిటైజర్స్ అని, ఈ ప్రాడక్ట్ ని 999 రూపాయలకు అమ్ముతున్నామని ఈ సంస్థ పేర్కొంది. ఇదే ప్రాడక్ట్ వేర్వేరు ధరలకు లభించవచ్చునని, కానీ తమ వస్తువు నాణ్యమైనదని చెప్పుకుంటోంది. కానీ హిమాలయ డ్రగ్ కంపెనీ మాత్రం ఇలా అధిక ధరలకు అమ్ముతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్వీట్ చేసింది. మేము వీటి ధరలు ఏమాత్రం పెంచలేదు. అనధికారిక థర్డ్ పార్టీ సెల్లర్లు అక్రమంగా మా సంస్థ పేరును ఉపయోగించుకుంటూ  అత్యధిక ధరలకు విక్రయిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం అని ఈ సంస్థ వార్నింగ్ ఇచ్చింది.

హిమాలయ సంస్థ అమ్ముతున్న శానిటైజర్లలో వివిధ ఉత్పత్తుల ధరలు కేవలం 58 రూపాయల నుంచి వంద రూపాయలలోపే ఉన్నాయి. కాగా వీటికి కొరత ఏర్పడడంతో ఈ-బే సంస్థ వీటితో బాటు ఫేస్ మాస్కుల అమ్మకాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఎన్-95, ఎన్ 100 ఫేస్ మాస్కులు, హ్యాండ్ శానిటైజర్ల లిస్టింగులను తాము తిరస్కరిస్తున్నట్టు ఈ సంస్థ స్పష్టం చేసింది.