Allahabad High Court: రూ.15 వేలు లేక ఐఐటీలో సీటు కోల్పోయింది.. కానీ ఆమె పోరాటం ఆపలేదు.. చివరికి..

ఆమెది పేద కుటుంబం. అయినా కష్టపడి చదివింది.. ఎంతో శ్రమించి ఐఐటీలో సీటు తెచ్చుకుంది. అయితే ఆమెకు సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేదు. కాలేజీలో చేరడానికి డబ్బు లేక నిస్సహాయస్థితిలో ఉన్న ఆమె చివరికి హైకోర్టు ఆశ్రయించింది....

Allahabad High Court: రూ.15 వేలు లేక ఐఐటీలో సీటు కోల్పోయింది.. కానీ ఆమె పోరాటం ఆపలేదు.. చివరికి..
Representative Image
Follow us

|

Updated on: Nov 30, 2021 | 7:11 PM

ఆమెది పేద కుటుంబం. అయినా కష్టపడి చదివింది.. ఎంతో శ్రమించి ఐఐటీలో సీటు తెచ్చుకుంది. అయితే ఆమెకు సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేదు. కాలేజీలో చేరడానికి డబ్బు లేక నిస్సహాయస్థితిలో ఉన్న ఆమె చివరికి హైకోర్టు ఆశ్రయించింది. ఆమె దీనస్థితిపై స్పందించిన అలహబాద్ హైకోర్టు లక్నో బెంచ్ రూ.15,000 మంజూరు చేసింది. విద్యార్థినిని గణితం, కంప్యూటింగ్ కోర్సులో (బ్యాచిలర్, మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ, డ్యూయల్ డిగ్రీ కోర్సు) చేర్చుకోవాలని జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ, IIT (BHU)ని ఆదేశించింది. దళిత విద్యార్థికి ఇప్పుడు సీటు ఖాళీ లేకపోతే సూపర్‌న్యూమరీ సీటును సృష్టించాలని బీహెచ్‌యూకు ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రవేశానికి అవసరమైన పత్రాలతో పాటు మూడు రోజుల్లోగా BHUలో రిపోర్టు చేయాలని విద్యార్థినిని కోరింది.

సంస్కృతి రంజన్ అనే విద్యార్థిని 10వ తరగతిలో 95.6 శాతం మార్కులు, 12వ తరగతిలో 94 శాతం మార్కులు సాధించింది. రంజన్ JEE మెయిన్స్ పరీక్షలో 92.77 పర్సంటైల్ సాధించి SC అభ్యర్థిగా 2,062 ర్యాంకు సాధించారు. ఆ తర్వాత, ఆమె సెప్టెంబరు 16న JEE అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసి, అక్టోబర్ 15న ఎస్సీ కేటగిరీలో 1,469 ర్యాంక్ సాధించారు. ఆమెకు కౌన్సెలింగ్‌లో IIT (BHU) వారణాసిలో మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్ కోర్సులో వచ్చింది. అయితే ఆమె కోర్సులో చేరాలంటే రూ.15,000 చెల్లించాల్సి ఉంది. కానీ డబ్బులు లేక ఆమె ఫీజు చెల్లించలేకపోయారు.

రంజన్ ఈ విషయమై వ్యక్తిగతంగా దాఖలు చేసిన పిటిషన్‌ దాఖలు చేసింది. రూ.15,000 రుసుమును జమ చేసేందుకు తనకు మరికొంత సమయం ఇవ్వాలని జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ, IIT (BHU)ని ఆదేశించాలని ఆమె ధర్మాసనాన్ని అభ్యర్థించారు. తన తండ్రి దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్నాడని, అతనికి కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యులు సూచించారని తెలిపింది. తన తండ్రికి వారానికి రెండు సార్లు డయాలసిస్ చేయిస్తున్నామని.. అలాంటి పరిస్థితుల్లో తండ్రి వైద్య ఖర్చులు, కోవిడ్-19 వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంగా డబ్బు చెల్లించలేదని వివరించింది. దీనిపై జస్టిస్ దినేష్ కుమార్ సింగ్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

ఫీజును జమ చేయలేనని తన పరిస్థితిని వివరిస్తూ సమయం పొడిగింపు కోసం రంజన్, ఆమె తండ్రి జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీకి చాలాసార్లు లేఖలు రాసినప్పటికీ సమాధానం రాలేదు” అని న్యాయవాదులు సర్వేష్ దూబే, సమతా రావు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్‌కు సహాయం చేయమని బెంచ్ అడిగారు. ఆమె తన కేసును వాదించడానికి న్యాయవాదిని కూడా నియమించుకు స్థితిలో లేదని, దళిత యువతి బంగారు భవిష్యత్తుకు సాయం చేయాలని కోరారు. స్పందించిన న్యాయస్థానం రూ. 15,000 మంజూరు చేసింది. విద్యార్థినిని గణితం, కంప్యూటింగ్ కోర్సులో (బ్యాచిలర్, మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ, డ్యూయల్ డిగ్రీ కోర్సు) చేర్చుకోవాలని జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ, IIT (BHU)ని ఆదేశించింది. దళిత విద్యార్థికి ఇప్పుడు సీటు ఖాళీ లేకపోతే సూపర్‌న్యూమరీ సీటును సృష్టించాలని బీహెచ్‌యూకు ధర్మాసనం స్పష్టం చేసింది. అడ్మిషన్ ప్రక్రియలో భవిష్యత్తులో ఏదైనా సీటు ఖాళీ అయిన సందర్భంలో పిటిషనర్ యొక్క అడ్మిషన్‌కు లోబడి క్రమబద్ధీకరించాలని జస్టిస్ సింగ్ ఆదేశించారు. సోమవారం కోర్టు ముగిసిన తర్వాత తనకు రూ.15,000 ఇచ్చారని రంజన్ తెలిపారు.

Read Also.. Viral Video: మంచి పనికి మతంతో సంబంధం లేదు.. వైరల్‎గా మారిన వీడియో.