యూపీ గ్రామాల్లో కోవిడ్ పరిస్థితి దారుణం, అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం, ‘రాముడే రక్షించాలని’ వ్యాఖ్య ,ప్రభుత్వానికి మొట్టికాయ
ఉత్తరప్రదేశ్ లో కోవిడ్ పరిస్థితి దారుణంగా ఉందని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. కొన్ని చిన్న పట్టణాలు, గ్రామాల్లో కోవిడ్ రోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, హెల్త్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ తీవ్రంగా దెబ్బ తిన్నదని ఇద్దరు జడ్జీల బెంచ్ పేర్కొంది.
ఉత్తరప్రదేశ్ లో కోవిడ్ పరిస్థితి దారుణంగా ఉందని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. కొన్ని చిన్న పట్టణాలు, గ్రామాల్లో కోవిడ్ రోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, హెల్త్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ తీవ్రంగా దెబ్బ తిన్నదని ఇద్దరు జడ్జీల బెంచ్ పేర్కొంది. ఈ వ్యవస్థను ఇక ‘రాముడే రక్షించాలని’జడ్జీలు సిధార్థ వర్మ, అజిత్ కుమార్ లతో కూడిన బెంచ్ అభివర్ణించింది. రాష్ట్రంలో రోగులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని న్యాయమూర్తులు ప్రభుత్వాన్నిఆదేశించారు. ఈ సందర్భంగా వారు హిందీలోని ‘రామ్ భరోసే’ (రాముడే దిక్కు) అన్న నానుడిని పదేపదే ప్రస్తావించారు .మీరట్, బిజ్నూర్ వంటి జిల్లాల్లో రోగులను వైద్య సిబ్బంది పట్టించుకోని విషయం తమ దృష్టికి వచ్చిందని బెంచ్ పేర్కొంది. మీరట్ లో ఓ కోవిద్ రోగి ఉదంతంపై ముగ్గురు సభ్యుల కమిటీ సమర్పించిన నివేదికను ప్రస్తావిస్తూ..ఓ రోగి మరణిస్తే ఎవరో గుర్తు తెలియని రోగి మృతి చెందినట్టు డాక్టర్లు పేర్కొన్నారని, నిజానికి సంతోష్ కుమార్ అనే వ్యక్తి చికిత్స కోసం చాలాసేపు వేచి ఉండి రెస్ట్ రూమ్ లో కుప్ప కూలిపోయాడని తెలిపింది. స్ట్రెచర్ కూడా చాలాసేపటి రాలేదని, వైద్యులు వచ్చేటప్పటికి ఆ వ్యక్తి మరణించాడని, అప్పటికైనా అతడు మరణించిన విషయాన్నీ అతని కుటుంబ సభ్యులకు తెలియజేయకుండా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చనిపోయాడని తమ రిపోర్టులో పేర్కొన్నారని కోర్టు గుర్తు చేసింది. ఇంకా ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయని విచారం వ్యక్తం చేసింది.
వైద్య సిబ్బంది ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ఈ ఉదంతమే చెబుతోందని న్యాయమూర్తులు అన్నారు. యూపీలో ఇప్పటివరకు 16.19 లక్షల కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. రోజూ 20 వేలకు పైగా కేసులు నమోదవుతూ వచ్చాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: ఆస్పత్రి కారిడార్‌లో డాక్టర్ల డ్యాన్సులు….!! సల్మాన్ ఖాన్ సిటీమార్ సాంగ్‌కి అదిరే స్టెప్పులు.. ( వీడియో )
Viral Video: పులిని పిల్లి అనుకున్న చిన్నారి…!! వైరల్‌గా మారిన వీడియో...