AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Corona Cases: దేశంలో తగ్గుముఖం ప‌ట్టిన‌ కొత్త కేసులు.. ప్ర‌మాద‌క‌రంగా మ‌ర‌ణాలు.. తాజా వివ‌రాలు ఇవి

దేశవ్యాప్తంగా కరోనా క‌ల్లోలం కొన‌సాగుతంది. కొద్ది రోజులుగా కొత్త కేసుల్లో తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ.. మ‌ర‌ణాల సంఖ్య మాత్రం ఆందోళ‌న‌క‌రంగా ఉంది.

India Corona Cases: దేశంలో తగ్గుముఖం ప‌ట్టిన‌ కొత్త కేసులు.. ప్ర‌మాద‌క‌రంగా మ‌ర‌ణాలు.. తాజా వివ‌రాలు ఇవి
India Corona Updates
Ram Naramaneni
|

Updated on: May 18, 2021 | 10:20 AM

Share

దేశవ్యాప్తంగా కరోనా క‌ల్లోలం కొన‌సాగుతంది. కొద్ది రోజులుగా కొత్త కేసుల్లో తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ.. మ‌ర‌ణాల సంఖ్య మాత్రం ఆందోళ‌న‌క‌రంగా ఉంది. నాలుగు వేల‌కు పైగానే మ‌ర‌ణాలు ఉండ‌టం జ‌నాల్లో భ‌యాన్ని పెంచుతుంది. మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం 18,69,223 మందికి క‌రోనా టెస్టులు చేయ‌గా నిర్వహించగా..2,63,533 మందికి వైర‌స్ సోకిన‌ట్లు తేలింది. వరసగా ఐదో రోజు కొత్త కేసుల సంఖ్యలో డ్రాప్ క‌నిపించింది. ప‌లు రాష్ట్రాల్లో అమ‌లు చేస్తోన్న లాక్ డౌన్ దీనికి ప్ర‌ధాన కార‌ణంగా చెప్పుకోవ‌చ్చు. మరణాలు మాత్రం రికార్డ్ రేంజ్‌లో నమోదయ్యాయి. సోమ‌వారం ఒక్కరోజే 4,329 మంది చ‌నిపోయారు. ఇప్పటివరకు నమోదైన టాప్ మరణాలు ఇవే. మే 11న 4,205 మంది చ‌నిపోయారు.

కొత్త కేసుల తగ్గుదల ఉండ‌టంతో.. యాక్టివ్ కేసుల విష‌యంలో కూడా తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం 33,53,765 మంది క‌రోనాతో చికిత్స పొందుతుండ‌గా.. యాక్టివ్ కేసుల రేటు 13.29 శాతంగా ఉంది. సోమ‌వారం 4,22,436 మంది వైర‌స్ బారి నుంచి కోలుకున్నారు. మొత్తంగా 2,15,96,512 మంది వైరస్‌ను జయించారు. రికవరీ రేటు 85.60 శాతంగా ఉంది. మహారాష్ట్రలో క‌రోనా క‌ల్లోలం కొన‌సాగుతుంది. సోమవారం అక్క‌డ‌ భారీగా కరోనా మరణాలు న‌మోద‌య్యాయి. ఒక్కరోజులో వెయ్యిమంది చ‌నిపోయారు. మార్చి 30 తరవాత కొత్త కేసులు సంఖ్య 30 వేల దిగువకు ప‌డిపోయిన‌ప్ప‌టికీ..మృతుల సంఖ్య ప్రభుత్వాన్ని టెన్ష‌న్ పెడుతుంది. తాజాగా అక్కడ 26,616 మందికి కరోనా సోకింది.

Also Read: హ్యాట్సాఫ్ కానిస్టేబుల్ గారు.. చిన్నారుల ఆక‌లి తీర్చిన‌ మ‌స‌నున్న పోలీస్

ఏపీలో క‌ర్ఫ్యూ గ‌డువు పెరిగిన వేళ‌.. ఈ-పాస్‌ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోండి..

Follow Us
‘పురుషులను గౌరవించడం మన సంప్రదాయం’.. తెగ సంబరపడుతున్న మగానుభావులు
‘పురుషులను గౌరవించడం మన సంప్రదాయం’.. తెగ సంబరపడుతున్న మగానుభావులు
మ్యాచ్ మధ్యలో బాంబ్ పేల్చిన గంభీర్.. కోహ్లీతోపాటు రోహిత్ ఎమోషన్
మ్యాచ్ మధ్యలో బాంబ్ పేల్చిన గంభీర్.. కోహ్లీతోపాటు రోహిత్ ఎమోషన్
గానుగలో తీసిన కొబ్బరి నూనె.. రిఫైన్డ్ ఆయిల్ కంటే మంచిదా..?
గానుగలో తీసిన కొబ్బరి నూనె.. రిఫైన్డ్ ఆయిల్ కంటే మంచిదా..?
మహారాష్ట్ర పాఠ్యపుస్తకంలో నల్లగొండ ఉపాధ్యాయుడి బాలగేయం..
మహారాష్ట్ర పాఠ్యపుస్తకంలో నల్లగొండ ఉపాధ్యాయుడి బాలగేయం..
రక్తహీనతను చిటికెలో తగ్గించే నేచురల్ పొడి.. ఒక్క చెంచాడు చాలు..
రక్తహీనతను చిటికెలో తగ్గించే నేచురల్ పొడి.. ఒక్క చెంచాడు చాలు..
స్కూల్‌కు వెళ్తుండగా వెంటాడిని మృత్యువు..ఇద్దరు విద్యార్థులు మృతి
స్కూల్‌కు వెళ్తుండగా వెంటాడిని మృత్యువు..ఇద్దరు విద్యార్థులు మృతి
కొండచిలువ వర్సెస్ చిరుతపులి పోరాటంలో గెలుపు ఎవరిది..?
కొండచిలువ వర్సెస్ చిరుతపులి పోరాటంలో గెలుపు ఎవరిది..?
ఈ రెండు పనులు చేయకపోతే తల్లికి వందనం కట్.. ప్రభుత్వం అలర్ట్
ఈ రెండు పనులు చేయకపోతే తల్లికి వందనం కట్.. ప్రభుత్వం అలర్ట్
ట్రంప్‌కే ధమ్కీ.. లేపేస్తే రూ.83 కోట్ల రివార్డు అంటూ ప్రకటన
ట్రంప్‌కే ధమ్కీ.. లేపేస్తే రూ.83 కోట్ల రివార్డు అంటూ ప్రకటన
Garuda Purana: మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? యమలోకానికి..
Garuda Purana: మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? యమలోకానికి..