BRS: ఢిల్లీలో భారత్‌ రాష్ట్ర సమితి జోష్‌.. బుధవారం సరిగ్గా ఆ సమయంలోనే కొత్త పార్టీ ఆఫీస్‌‌లోకి సీఎం కేసీఆర్..

తెలంగాణ టు ఢిల్లీ..! దేశ రాజధాని హస్తినలో ఘనంగా అడుగుమోపబోతోంది BRS. పార్టీ ఆఫీస్‌ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. వేదపండితులు నిర్ణయించిన దివ్యముహూర్తంలో కార్యక్రమాలను నిర్వహిస్తారు CM కేసీఆర్. భావసారూప్యత కలిగిన పార్టీలన్నింటికీ ఆహ్వానాలు పంపారు..!

BRS: ఢిల్లీలో భారత్‌ రాష్ట్ర సమితి జోష్‌.. బుధవారం సరిగ్గా ఆ సమయంలోనే కొత్త పార్టీ ఆఫీస్‌‌లోకి సీఎం కేసీఆర్..
BRS
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 13, 2022 | 8:07 PM

దేశవ్యాప్తంగా బీఆర్ఎస్‌ను విస్తరించే దిశగా తొలి అడుగు..! ఢిల్లీలోని సర్దార్‌ పటేల్‌ మార్గ్‌లో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు. వేదపండితులు నిర్వహించిన ముహూర్తం ప్రకారం.. సరిగ్గా 12గంటల 37 నిమిషాల నుంచి 12 గంటల 47 నిమిషాల మధ్య జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం ఆఫీస్‌ను ప్రారంభించి.. తన గదిలో కూర్చుంటారు సీఎం కేసీఆర్. ప్రారంభోత్సవ కార్యక్రమానికి పంజాబ్, హ‌ర్యానా, యూపీ, ఒడిశా, త‌మిళ‌నాడు రాష్ట్రాల‌కు చెందిన రైతు నేతలకు ఆహ్వానం పంపారు. కర్నాటక మాజీ సీఎం కుమార‌స్వామి, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది.

మంగళవారం బీఆర్ఎస్ ఆఫీస్‌ను సీఎం కేసీఆర్ పరిశీలించారు. యాగం, పూజ‌లు జ‌రుగుతున్న ప్రదేశాలను సందర్శించారు. అనంత‌రం స‌ర్దార్ ప‌టేల్ మార్గ్ నుంచి వ‌సంత్ విహార్‌కు వెళ్లారు సీఎం కేసీఆర్. అక్కడ నిర్మాణంలో ఉన్న బీఆర్ఎస్ నూతన భవ‌ననంలో అన్ని ఫ్లోర్లలోనూ క‌లియతిరిగారు. ప‌లు సూచ‌న‌లు చేశారు. ఈ కొత్తభవనం పూర్తయ్యేందుకు మరికొంత సమయం పడుతుంది. అందుకే ప్రస్తుతానికి ఎస్పీ మార్గ్‌లోని అద్దెభవనంలో పార్టీ ఆఫీస్‌ను ఏర్పాటు చేశారు.

పార్టీ ఆఫీస్‌ ప్రాంగణంలో వైభవంగా పూజాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటలకు 12 మంది ఋత్విక్కులు గణపతి పూజతో యాగానికి శ్రీకారం చుట్టారు. పుణ్యహవాచనం, యాగశాల ప్రవేశం, చండీ పారాయణం, మూలమంత్ర జపాలు నిర్వహించారు. బుధవారం నవ చండీహోమం, రాజశ్యామల హోమం ఉంటుంది. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం