AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన స్టార్‌ హీరో.. తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ప్రమామాణాలతో ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుపై చర్చ!

తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యానికి ముందుకొస్తున్న సినీ, క్రీడా ప్రముఖులు ముందుకొస్తున్నారు. రాష్ట్రంలో అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని సినీనటుడు అజయ్ దేవగన్, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన స్టార్‌ హీరో..  తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ప్రమామాణాలతో ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుపై చర్చ!
Cm Revanth Reddy
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Jul 07, 2025 | 11:23 PM

Share

తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు ముందుకు వస్తున్నారు సినీ,క్రీడా ప్రముఖులు. అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు వంటి అంశాలకు సంబంధించి సినీనటుడు అజయ్ దేవగన్,భారత క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తెలంగాణలో క్రీడాభివృద్ధికి, సిని ఇండస్ట్రీ ఎదుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వారు ప్రసంసించారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్దిలో భాగమయ్యేందుకు తాము తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు.

సినీ నిర్మాణంలో కీల‌క‌మైన యానిమేష‌న్‌, వీఎఫ్ఎక్స్ స్టూడియో, ఏఐ, ఇత‌ర స‌దుపాయాల‌తో అంతర్జాతీయ ప్ర‌మాణాల‌తో కూడిన‌ స్టూడియో నిర్మాణాన్ని తెలంగాణ‌లో ఏర్పాటు చేసేందుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని నటుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. అంత‌ర్జాతీయ స్థాయి స్టూడియో నిర్మాణంతో పాటు సినీ ప‌రిశ్ర‌మ‌లో వివిధ విభాగాల‌కు అవ‌స‌ర‌మైన నిపుణులను అందుబాటులోకి తెచ్చేందుకు.. నైపుణ్య శిక్ష‌ణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు అజ‌య్ దేవ‌గ‌ణ్ సంసిద్ధ‌త వ్య‌క్తం చేశారు. తెలంగాణ రైజింగ్‌కు సంబంధించి మీడియా, సినిమా రంగాల‌కు ప్ర‌చార‌క‌ర్త‌గా ఉంటాన‌ని అజ‌య్ దేవ‌గ‌ణ్ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి తెలియ‌జేశారు.

వీడియో చూడండి..

క్రీడాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించిన కపిల్‌దేవ్‌..

తెలంగాణ‌ ప్ర‌భుత్వం క్రీడా రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్ ప్ర‌శంసించారు. రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ ఏర్పాటు, క్రీడాభివృద్ధికి త‌మ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను సీఎం రేవంత్ రెడ్డి క‌పిల్ దేవ్‌కు వివ‌రించారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీతో పాటు తెలంగాణ‌లో క్రీడాభివృద్ధికి సంబంధించిన అన్ని విష‌యాల్లో తాను భాగ‌స్వామిన‌వుతాన‌ని కపిల్ దేవ్ ముఖ్య‌మంత్రికి తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా ద‌క్షిణ కొరియాతో పాటు ప‌లు దేశాల్లో తాము సంద‌ర్శించిన క్రీడా యూనివర్సిటీలు.. అక్క‌డి క్రీడా ప్ర‌ముఖుల‌తో త‌మ భేటీల వివ‌రాల‌ను సీఎం రేవంత్ రెడ్డి క‌పిల్ దేవ్‌కు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మొలకలు.. చికెన్.. వేటిల్లో అధిక ప్రొటీన్‌ ఉంటుందో తెలుసా?
మొలకలు.. చికెన్.. వేటిల్లో అధిక ప్రొటీన్‌ ఉంటుందో తెలుసా?
మీ కురులు రాలిపోవడానికి ఈ ఆహారాలూ కారణమే.. తినకపోవడమే మంచిది!
మీ కురులు రాలిపోవడానికి ఈ ఆహారాలూ కారణమే.. తినకపోవడమే మంచిది!
2026లో ఊహించని సంచలనాలు.. వణుకు పుట్టిస్తున్న బాబా వంగా అంచనాలు
2026లో ఊహించని సంచలనాలు.. వణుకు పుట్టిస్తున్న బాబా వంగా అంచనాలు
పెరుగుతో కలిపి తినకూడని పదార్థాలు ఇవే.. ఎందుకంటే..
పెరుగుతో కలిపి తినకూడని పదార్థాలు ఇవే.. ఎందుకంటే..
T20 World Cup 2026: ఛీ కొట్టిన ప్లేయరే బీసీసీకి దిక్కయ్యాడుగా..
T20 World Cup 2026: ఛీ కొట్టిన ప్లేయరే బీసీసీకి దిక్కయ్యాడుగా..
ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే కుక్కలను పెంచుకోవచ్చా..?
ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే కుక్కలను పెంచుకోవచ్చా..?
చివరి రోజుల్లో నన్ను పిలిచి అలా చేశాడు.. బ్రహ్మానందం కన్నీళ్లు..
చివరి రోజుల్లో నన్ను పిలిచి అలా చేశాడు.. బ్రహ్మానందం కన్నీళ్లు..
వేలంలో రూ. 25.20 కోట్లు.. ఇంటికి తీసుకెళ్లేది మాత్రం..
వేలంలో రూ. 25.20 కోట్లు.. ఇంటికి తీసుకెళ్లేది మాత్రం..
పెద్ద జామకాయ Vs చిన్న జామకాయ.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది?
పెద్ద జామకాయ Vs చిన్న జామకాయ.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది?
45 బంతుల్లోనే సెంచరీ.. కట్‌చేస్తే.. బీసీసీఐకి స్ట్రాంగ్ వార్నింగ్
45 బంతుల్లోనే సెంచరీ.. కట్‌చేస్తే.. బీసీసీఐకి స్ట్రాంగ్ వార్నింగ్