Air India: ఎయిర్ ఇండియా విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం.. హుటాహుటీన ముంబాయికి..
హైదరాబాద్ నుంచి దుబాయ్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. A320 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ముంబయి విమానాశ్రయంలో శనివారం (డిసెంబర్ 17) అత్యవసరంగా..
హైదరాబాద్ నుంచి దుబాయ్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. A320 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ముంబయి విమానాశ్రయంలో శనివారం (డిసెంబర్ 17) అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. 143 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా విమానం శనివారం రాత్రి 7 గంటల 45 నిముషాలకు హైదరాబాద్ నుంచి దుబాయ్‌కి బయల్దేరింది. మూడున్నర గంటల సమయంలో దుబాయ్‌కి చేరుకోవల్సిన ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. ఎల్లో హైడ్రాలిక్ సిస్టంలో సమస్య తలెత్తినట్లు అధికారులు తెలిపారు. ఈ సంఘటనలో ఎటువంటి ప్రమాదం సంభవించలేదని, విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు డీజీసీఏ అధికారులు తెలిపారు.
ఎయిర్ ఇండియా సీనియర్ పైలట్ మాట్లాడుతూ.. ‘విమానంలో మూడు హైడ్రాలిక్ సిస్టమ్‌లు ఉన్నాయి. వాటిల్లో ఒక సిస్టమ్‌లో సాకేంతిక లోపం తలెత్తింది. ఐతే ఇదేమీ పెద్ద సమస్యకానప్పటికీ పైలట్లు విమానాన్ని ఎందుకు ముంబాయ్‌కి దారి మళ్లించారనేది మెయింటెనెన్స్ టీం పరిశీలించి తెలియజేస్తారని’ అన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.