ఆస్ట్రేలియా వెళ్లిన ఎయిర్‌ ఇండియా ఫైలట్‌కు కరోనా పాజిటివ్

ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీకి వెళ్లిన ఎయిర్‌ ఇండియా పైలట్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఫ్లైట్ ఎక్కే ముందు జరిపిన పరీక్షల్లో అతడికి నెగిటివ్‌గా ఉన్నప్పటికీ..

ఆస్ట్రేలియా వెళ్లిన ఎయిర్‌ ఇండియా ఫైలట్‌కు కరోనా పాజిటివ్
Follow us

| Edited By:

Updated on: Jun 23, 2020 | 2:47 PM

ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీకి వెళ్లిన ఎయిర్‌ ఇండియా పైలట్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఫ్లైట్ ఎక్కే ముందు జరిపిన పరీక్షల్లో అతడికి నెగిటివ్‌గా ఉన్నప్పటికీ.. ఆ తరువాత పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ల్యాండ్ అయిన తరువాత పైలట్‌తో పాటు కాక్ పిట్‌లో ఉన్న మరో ఇద్దరు సిబ్బందిని అధికారులు క్వారంటైన్‌కు తరలించారు.

ఈ విషయంపై ఎయిర్ ఇండియా సంస్థ మాట్లాడుతూ.. విమానయానానికి సిద్ధమయ్యే పైలట్‌లకు తాము ముందుగానే పరీక్షలు చేస్తామని, ఆ క్రమంలో ఈ నెల 16న జరిపిన పరీక్షల్లో అతడికి నెగిటివ్‌గా వచ్చిందని తెలిపారు. దాంతో విమానాన్ని నడిపేందుకు ఈ నెల 20న సదరు పైలట్‌కు అవకాశం ఇచ్చామని అన్నారు. అంతేకాకుండా ఆ పైలట్ మామూలుగా లాగోస్‌కి వెళ్లాలని కానీ సిడ్నీకి వెళ్లే పైలట్‌కి బాలేకపోవడంతో.. లాగోస్‌కి వెళ్లాల్సిన ఈ పైలట్‌ని సిడ్నీకి పంపినట్లు తెలిపారు. అయితే ఎయిర్‌ ఇండియాలో ఇలా జరగడం ఇది రెండో సారి. గత నెల 30న ఢిల్లీ నుంచి మాస్కోకు వెళ్లిన పైలట్‌కు కరోనా వచ్చిందని తెలీడంతో.. మార్గమాధ్యమంలోనే అతడు వెనక్కి రావాల్సి వచ్చిన విషయం తెలిసిందే.

Read This Story Also: వారందరికి నూటికి నూరు శాతం ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాల్సిందే: సీఎం జగన్

Latest Articles
వాడేసిన టీ బ్యాగ్‌లు పారేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే భద్రంగా..
వాడేసిన టీ బ్యాగ్‌లు పారేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే భద్రంగా..
పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌‌గా టీమిండియా ఫ్యూచర్ కీపర్
పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌‌గా టీమిండియా ఫ్యూచర్ కీపర్
కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా.?
కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా.?
నానబెట్టిన ఎండు ద్రాక్ష నీటిని ఇలా తాగితే సగం రోగాలు పరార్!
నానబెట్టిన ఎండు ద్రాక్ష నీటిని ఇలా తాగితే సగం రోగాలు పరార్!
'అందరినీ ఒకేసారి అరెస్ట్ చేయండి'.. జైల్ భరోకి కేజ్రీవాల్ పిలుపు..
'అందరినీ ఒకేసారి అరెస్ట్ చేయండి'.. జైల్ భరోకి కేజ్రీవాల్ పిలుపు..
తొలి 7 మ్యాచ్‌ల్లో ఒకే విజయం.. 15 రోజుల్లో మారిన ఆర్‌సీబీ
తొలి 7 మ్యాచ్‌ల్లో ఒకే విజయం.. 15 రోజుల్లో మారిన ఆర్‌సీబీ
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
అక్కడ వర్షాలకు వజ్రాలు దొరుకుతాయి.. రత్నాల వేటలో స్థానికులు..
అక్కడ వర్షాలకు వజ్రాలు దొరుకుతాయి.. రత్నాల వేటలో స్థానికులు..
ముగ్గురు చెప్పుల వ్యాపారుల ఇళ్లలో ఐటీ సోదాలు.. ఓ గది తెరవగా!
ముగ్గురు చెప్పుల వ్యాపారుల ఇళ్లలో ఐటీ సోదాలు.. ఓ గది తెరవగా!
పాపం అమ్మాయిలు.! స్నాక్స్ తింటుండగా ఏంటి ఇలా జరిగింది..
పాపం అమ్మాయిలు.! స్నాక్స్ తింటుండగా ఏంటి ఇలా జరిగింది..