Mallikharjun Kharge: ఝార్ఖండ్ అంశంపై వాడి వేడి చర్చలు.. పార్లమెంట్లో ఖర్గే కీలక వ్యాఖ్యలు..
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఝార్ఖండ్ అంశంపై వాడీవేడిగా చర్చ జరిగింది. రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బీహార్, ఝార్ఖండ్ అంశాన్ని ప్రస్తావించారు. బిహార్‌లో నితీశ్ రాజీనామా చేసిన 12 గంటల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైతే.. ఝార్ఖండ్‌లో మెజార్టీ ఉన్నా చంపై సోరెన్ ప్రమాణ స్వీకారాన్ని ఎందుకు జాప్యం చేశారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ప్రోద్భలంతోనే హేమంత్ సోరెన్‌ను అరెస్టు చేశారని ఆరోపించారు ఖర్గే.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఝార్ఖండ్ అంశంపై వాడీవేడిగా చర్చ జరిగింది. రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బీహార్, ఝార్ఖండ్ అంశాన్ని ప్రస్తావించారు. బిహార్‌లో నితీశ్ రాజీనామా చేసిన 12 గంటల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైతే.. ఝార్ఖండ్‌లో మెజార్టీ ఉన్నా చంపై సోరెన్ ప్రమాణ స్వీకారాన్ని ఎందుకు జాప్యం చేశారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ప్రోద్భలంతోనే హేమంత్ సోరెన్‌ను అరెస్టు చేశారని ఆరోపించారు ఖర్గే. రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం ముక్కలు చేస్తోందని.. దేశంలో ఇవే చివరి ఎన్నికలు.. మరోసారి ఎన్నికలు ఉండవని.. ఈ చర్యలను బట్టి అర్థం అవుతోందన్నారు ఖర్గే.
ఖర్గే వ్యాఖ్యలను తప్పు బట్టారు కేంద్రమంత్రి పియూష్ గోయల్, భూ కుంభకోణంలో సోరెన్ రాజీనామా చేశారని, అవినీతి పరులకు కాంగ్రెస్ మద్దతు తెలుపుతోందని మండిపడ్డారు. అంతకుముందు.. మహిళా రిజర్వేషన్ల విషయంలోనూ ఖర్గే, పియూష్ గోయల్ మధ్య మాటల యుద్ధం నడిచింది. మహిళలంటే బీజేపీకి అంటరాని వాళ్లులా కనిపిస్తున్నారని ఖర్గే అంటే.. దేశాన్ని, మహిళలను అవమానిస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు పియూష్ గోయల్. పీఎం కిసాన్, పీఎం ఆవాస్, పీఎం ఫసల్ బీమా అంటూ.. ప్రతీదానికి పీఎం పేరు ఎందుకుని ఖర్గే ప్రశ్నించగా.. పథకాలకు ఒక ఫ్యామిలీ పేర్లు కాకుండా ప్రధాని పేరు పెడితే తప్పేంటని ప్రహ్లాద్ జోషి ప్రశ్నించారు.మోదీని దర్శించుకుంటే.. రాముడ్ని దర్శించుకున్నట్లే అంటూ సెటైర్లు వేశారు ఖర్గే. అయోధ్యలో మోదీయే పెద్ద పూజారిగా ప్రజలకు కనిపించారన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




