Bharat Bandh: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా నేడు భారత్ బంద్.. ఆ ప్రాంతాల్లో హై అలర్ట్.. కఠిన చర్యలకు ఆదేశాలు..

| Edited By: Ravi Kiran

Jun 20, 2022 | 10:10 AM

Bharat Bandh: విధ్వాంసానికి పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్ని RPF యూనిట్లకు ఆదేశాలు జారీ చేశారు. భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని కఠినమైన సెక్షన్ల కింద నిరసనకారులపై చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Bharat Bandh: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా నేడు భారత్ బంద్.. ఆ ప్రాంతాల్లో హై అలర్ట్.. కఠిన చర్యలకు ఆదేశాలు..
Agnipath Scheme Protest
Follow us on

Agnipath Scheme Protest: కేంద్ర ప్రభుత్వ ఆర్మీలో నియామకాల్లో అమల్లోకి తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కొన్ని సంస్థలు సోమవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. భారత్ బంద్ (Bharat Bandh) దృష్ట్యా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), గవర్నమెంట్ రైల్వే పోలీసులు (GRP) అప్రమత్తమయ్యారు. రైల్వే స్టేషన్లు తదితర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ మేరకు RPF సీనియర్ అధికారులు ఒక ప్రకటన విడుదల చేసారు. అల్లర్లు, విధ్వాంసానికి పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్ని RPF యూనిట్లకు ఆదేశాలు జారీ చేశారు. భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని కఠినమైన సెక్షన్ల కింద నిరసనకారులపై చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అగ్నిపథ్ పథకంపై యువతలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ పథకాన్ని విరమించుకోవాలని యువకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. అగ్నిపథ్‌ను నిరసిస్తూ ఇటీవల బీహార్, యూపీ, తెలంగాణ, కేరళ, జార్ఖండ్, అస్సాం తదితర రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. నిరసనకారులు పలు రైళ్లకు నిప్పుపెట్టారు. ప్రాణ నష్టంతోపాటు ఆస్థి నష్టం కూడా జరిగింది. ఈ క్రమంలో అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని ఆర్మీ ఆదివారం విలేకరుల సమావేశంలో స్పష్టం చేసింది.

ఈ క్రమంలో అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కొన్ని సంస్థలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు, ఆర్పీఎఫ్, జీఆర్పీలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మొబైల్ ఫోన్లు, వీడియో రికార్డింగ్ పరికరాలు, సీసీ కెమెరాల ద్వారా అక్రమార్కులకు వ్యతిరేకంగా డిజిటల్ సాక్ష్యాలను సేకరించాలని పోలీసులను ఆదేశించారు. ఏమైనా ఘటనలు జరిగితే వీడియో ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టనున్నారు. ఎలాంటి హాని జరగకుండా ఉండేందుకు పోలీసు అధికారులు కూడా రక్షణ కవచాలను ధరించాలని కోరారు. అదే సమయంలో ఈరోజు బీహార్‌లోని కనీసం 20 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించారు.

భద్రత కట్టుదిట్టం

ఇవి కూడా చదవండి

ఇదిలాఉంటే.. గతంలో జరిగిన హింసాత్మక ఘటనలను పరిగణలోకి తీసుకోని పలు ప్రాంతంల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. బీహార్‌లోని కైమూర్, భోజ్‌పూర్, బక్సర్, ఔరంగాబాద్, రోహ్తాస్, తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్, సమస్తిపూర్, నవాడా, బెగుసరాయ్, లఖిసరాయ్, సరన్, వైశాలి, ముజఫర్‌పూర్, దర్భంగా, మధుబని, గయా, ఖగారియా, జెహనాబాద్ లలో ఆంక్షలు విధించడంతోపాటు.. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. భారత్ బంద్ ప్రకటన నేపథ్యంలో పంజాబ్‌లోని అన్ని సున్నితమైన సైనిక స్థావరాలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల చుట్టుపక్కల భద్రతను కట్టుదిట్టం చేశారు.

కేరళలో భారీగా పోలీసు బలగాల మోహరింపు..

ప్రజా ఆస్తులకు నష్టం కలిగించే లేదా హింసకు పాల్పడిన వారిని అరెస్టు చేయడానికి వెనకాడమని.. పోలీసు బలగాలను మోహరించామని కేరళ పోలీసులు ఆదివారం తెలిపారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..