Elephant whisperers: సెలబ్రిటీలుగా మారిన ‘ఆస్కార్‌ ఏనుగులు’.. క్యూ కడుతోన్న జనాలు.

ట్రిపులార్‌తో పాటు భారత్‌ నుంచి 'ది ఎలిఫెంట్ విస్పర్స్’ అనే డాక్యుమెంటరీకి కూడా ఆస్కార్‌ లభించిన విషయం తెలిసిందే. ఆస్కార్‌ బరిలోకి సైలెంట్‌ ఎంట్రీ ఇచ్చిన తమళ డాక్యుమెంటరీ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్‌ను గెలుచుకుంది. తమిళనాడులోని..

Elephant whisperers: సెలబ్రిటీలుగా మారిన ఆస్కార్‌ ఏనుగులు.. క్యూ కడుతోన్న జనాలు.
The Elephant Whisperers

Updated on: Mar 14, 2023 | 1:00 PM

ట్రిపులార్‌తో పాటు భారత్‌ నుంచి ‘ది ఎలిఫెంట్ విస్పర్స్’ అనే డాక్యుమెంటరీకి కూడా ఆస్కార్‌ లభించిన విషయం తెలిసిందే. ఆస్కార్‌ బరిలోకి సైలెంట్‌ ఎంట్రీ ఇచ్చిన తమళ డాక్యుమెంటరీ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్‌ను గెలుచుకుంది. తమిళనాడులోని ముదమలై టైగర్‌ రిజర్వ్‌లో రెండు అనాథ ఏనుగులను దత్తత తీసుకున్న ఓ కుటంబం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. 39 నిమిషాల నిడివిగల ఈ షార్ట్‌ ఫిల్మ్‌ ఆస్కార్‌ను ఎగరేసుకుపోయింది.

ఇదిలా ఉంటే.. ఆస్కార్‌తో ఫేమస్ అయిన ఏనుగు పిల్లలను చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. అవి ఇప్పుడు ముదుమలై తెప్పకాడు ఏనుగుల శిబిరంలో సంరక్షణలో ఉన్నాయి. విదేశాల నుంచి వచ్చి ఇండియా టూర్‌లో ఉన్న టూరిస్టులు సైతం ఈ ఏనుగులను చూసేందుకు వస్తున్నారు. ఏనుగులను చూసేందుకు వచ్చిన టూరిస్టులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులు చూడడానికి రావడం ఆనందంగా ఉందని, ఈ చిత్రం ఆస్కార్ గెలుచుకోవడం సంతోషంగా ఉందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే ఈ డాక్యుమెంటరీని కార్తికి గోన్సాల్వేస్ తెరకెక్కించారు. ఇక ఈ డాక్యుమెంటరీ కథ విషయానికొస్తే.. అడవి నుంచి తప్పించుకున్న రఘు, అము అనే రెండు ఏనుగు పిల్లను అక్కిడికి దగ్గరలోని గ్రామంలో ఉన్న ఓ వృద్ద జంట బొమ్మన్ అండ్ బెల్లి పెంచుకుంటారు. ఈక్రమంలో ఆ ఏనుగు పిల్లతో పాటు అక్కడి ప్రకృతితో వీరి బంధం, అనుబంధం మరింత పెరుగుతుంది. ప్రకృతి, జంతువులతో మనుషులకు ఉండే బంధం గురించి ఈ కథ చర్చిస్తుంది. మనుషులకు, ఏనుగులకు మధ్య ఏర్పడిన బంధం ఆకట్టుకుంటుంది. ఈ డాక్యుమెంటరీని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..