AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఎంపీ నాలుగు మేకలు దొంగిలించాడు.. యూపీలో కేసు నమోదు..!

యూపీ రాజకీయాల్లో సీనియర్ రాజకీయ నేత, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అజాంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలకు మరోపేరు. ఆయన ప్రస్తుతం విచిత్రమైన కేసుల బెడదతో సతమతమవుతున్నారు. ఇప్పటివరకు ఆయనపై 82 కేసులు నమోదయ్యాయి. వీటన్నిటిలో ప్రధానమైనవి భూ కబ్జాఆరోపణలే. సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలిచే ఆజాంఖాన్ తాజాగా ఒక విచిత్రమైన కేసులో ఇరుకున పడ్డారు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అజాంఖాన్ ఆపార్టీలో సీనియర్ నేత. ఆయనపై ఎన్నో ఆరోపణలున్నాయి. ఇప్పటికే […]

ఆ ఎంపీ నాలుగు మేకలు దొంగిలించాడు..  యూపీలో కేసు నమోదు..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 13, 2019 | 6:38 PM

Share

యూపీ రాజకీయాల్లో సీనియర్ రాజకీయ నేత, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అజాంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలకు మరోపేరు. ఆయన ప్రస్తుతం విచిత్రమైన కేసుల బెడదతో సతమతమవుతున్నారు. ఇప్పటివరకు ఆయనపై 82 కేసులు నమోదయ్యాయి. వీటన్నిటిలో ప్రధానమైనవి భూ కబ్జాఆరోపణలే. సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలిచే ఆజాంఖాన్ తాజాగా ఒక విచిత్రమైన కేసులో ఇరుకున పడ్డారు.

సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అజాంఖాన్ ఆపార్టీలో సీనియర్ నేత. ఆయనపై ఎన్నో ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఆయనపై పదుల సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటన్నిటిపై దర్యాప్తు చేయడం ఉత్తరప్రదేశ్ పోలీసులకు తలకుమించిన భారంగా పరిణమించింది. యతీంఖాన్ సరాయ్ గేట్ ప్రాంతానికి చెందిన ససీమా ఖాతూన్ (50) అనే మహిళ 2016లో అక్టోబర్ 15వ తేదీన ఎంపీ అజాంఖాన్ తన మేకలు దొంగిలించారంటూ స్ధానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయన 25 మంది అనుచరులతో కలిసి తన ఇంటిపై దాడి చేశారని, తన ఇంట్లో ఉన్న బంగారం, గేదెలు, ఆవులు, నాలుగు మేకల్ని వీరంతా ఎత్తుకుపోయారంటూ ఆరోపించింది. తాను వక్ఫ్ బోర్డుకు చెందిన భూమిలో కౌలుదారునని, రెండు దశాబ్దాలుగా కౌలుదారుగా ఉన్నానంటూ నసీమా తన ఫిర్యాదులో పేర్కొంది. వక్ఫ్‌కి చెందిన భూమిని కబ్జా చేయడానికి అజాంఖాన్ ప్రయత్నిస్తున్నాడని ఆమె ఆరోపించింది.

నసీమా ఖాతున్ ఈ ఫిర్యాదును 2016లో చేయగా .. ఉత్తరప్రదేశ్ పోలీసులు మాత్రం ఇన్నాళ్లకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒక ఎంపీ నాలుగు మేకలు దొంగిలించారని ఆరోపించడం స్ధానికంగా కలకలం రేపుతోంది. ఇదిలా ఉంటే ఆజాంఖాన్ భార్య కరెంట్ దొంగిలించారనే కేసు కూడా నమోదైంది. అయితే ఇటువంటి కేసులు ఎంపీ అజాంఖాన్‌కు కొత్తేమీ కాదని, ఇలాంటి ఎన్నో నమోదయ్యాయంటున్నారు స్ధానికులు.

Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్