AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aero India 2023: ఇండియన్‌ ఆర్మీలోకి ఎగిరే సైనికులు వచ్చేస్తున్నారు.. అబ్బురపరుస్తోన్న జెట్‌ప్యాక్‌ సూట్స్‌.

సాహో చిత్రంలో హీరో ప్రభాస్‌ ఓ వెరైటీ సూట్‌ ధరించి గాల్లో వాయు వేగంతో దూసుకుపోయే సీన్‌ గుర్తుంది కదూ.! ఇప్పటి వరకు ఇలాంటి సన్నివేశాలను సినిమాల్లోనో విదేశాల్లోనో చూసి ఉంటాం. కానీ మరికొన్ని రోజుల్లో ఇలా గాల్లో ఎగిరే సైనికులు మన దేశంలోనూ సందడి చేయనున్నారు. ఎలాంటి...

Aero India 2023: ఇండియన్‌ ఆర్మీలోకి ఎగిరే సైనికులు వచ్చేస్తున్నారు.. అబ్బురపరుస్తోన్న జెట్‌ప్యాక్‌ సూట్స్‌.
Representative Image
Narender Vaitla
|

Updated on: Feb 16, 2023 | 11:44 AM

Share

సాహో చిత్రంలో హీరో ప్రభాస్‌ ఓ వెరైటీ సూట్‌ ధరించి గాల్లో వాయు వేగంతో దూసుకుపోయే సీన్‌ గుర్తుంది కదూ.! ఇప్పటి వరకు ఇలాంటి సన్నివేశాలను సినిమాల్లోనో విదేశాల్లోనో చూసి ఉంటాం. కానీ మరికొన్ని రోజుల్లో ఇలా గాల్లో ఎగిరే సైనికులు మన దేశంలోనూ సందడి చేయనున్నారు. ఎలాంటి ప్యారాచూట్‌లు అవసరం లేదకుండా పక్షిలా ఎగిరే సైనికులు ఇండియన్‌ ఆర్మీలోకి రానున్నారు. బెంగళూరుకు చెందిన అబ్సల్యూట్‌ కంపోజిట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(ఏసీపీఎల్‌) అనే స్టార్టప్‌ సైనిక దుస్తులను (జెట్‌ప్యాక్‌) తయారు చేసింది. బెంగళూరు నిర్వహిస్తున్న ఏరో ఇండియా ప్రదర్శనలో ఈ జెట్‌ ప్యాక్‌ ఆకట్టుకుంటోంది.

ఈ జెట్‌ప్యాక్‌ను టర్బోజెట్‌లతో పనిచేసే విధంగా రూపొందించారు. ఇందులో ఇంధనంతో మండించే చిన్నపాటి కంప్రెసర్లతో కూడిన టర్బో ఇంజిన్‌, 30 లీటర్ల డీజిల్‌ ట్యాంకు అమర్చారు. పర్వతాలు, కొండల ప్రాంతాలు, విమానాలు, హెలికాప్టర్లు చేరుకోలేని ప్రాంతాలకు ఈ జెట్‌ ప్యాక్‌లతో సులభంగా చేరుకోవచ్చు. అబ్సల్యూట్‌ కంపోజిట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ స్టార్టప్‌ ఎండీ రాఘవ్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఈ జెట్‌సూట్‌ ధరించిన వ్యక్తి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో 15 మీటర్ల ఎత్తు వరకు ఎగరగలడని తెలిపారు.

Jetpacks

ఇవి కూడా చదవండి

పేలోడ్‌తో కలిపి ఈ సూట్‌ 80 కిలోల బరువు ఉంటుంది. వీటిని 70 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఇప్పటికే 48 జెట్‌ సూట్‌లను ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు రక్షణ శాఖ ప్రతిపాదనల విభాగానికి పంపారు. త్వరలోనే ఈ సూట్స్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించిన అనంతరం పూర్తిస్థాయిలో సైనిక సేవలకు వినియోగించేందుకు నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ ఈ సూట్స్‌ అందుబాటులోకి వస్తే ఇండియన్‌ ఆర్మీ ముఖచిత్రం పూర్తిగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..