Trending: దొంగతనానికి వచ్చి అక్కడే నిద్రపోయాడు.. పోలీసులు రావడంతో సీన్ అదుర్స్.. కట్ చేస్తే..
కామన్ గా దొంగతనానికి వచ్చిన వారు.. కనిపించిందంతా దోచుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోతుంటారు. కానీ.. తమిళనాడులో జరిగిన ఓ దొంగతనం మాత్రం.. చిత్ర విచిత్రగా మారింది. ఆలయంలో..

కామన్ గా దొంగతనానికి వచ్చిన వారు.. కనిపించిందంతా దోచుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోతుంటారు. కానీ.. తమిళనాడులో జరిగిన ఓ దొంగతనం మాత్రం.. చిత్ర విచిత్రగా మారింది. ఆలయంలో చోరికి ప్రయత్నించిన ఓ దొంగ అక్కడే నిద్రపోయాడు. ఇంకేముంది.. పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిందీ ఘటన. చెన్నైలోని వ్యాసర్పాడి శర్మ నగర్లో వినాయకుడి ఆలయం ఉంది. దేవుడి విగ్రహానికి ఉన్న నగలను దొంగతనం చేసేందుకు సోమవారం రాత్రి ఆలయంలోకి ఓ వ్యక్తి ప్రవేశించాడు. నగల కోసం ఆలయంలో ఉన్న బీరువాను తెరిచేందుకు ట్రై చేశాడు. కానీ అది ఓపెన్ అవలేదు. దీంతో పక్కనే ఉన్న మరో బీరువాను తెరిచాడు. అందులో ఉన్న బట్టలన్నీ తీసి.. నగలు కోసం వెతికాడు. అందులోనూ ఏం దొరకలేదు. దీంతో తీవ్ర ఆయాసం వచ్చి పడిపోయాడు. దీనికి తోడుగా నిద్ర రావడంతో అక్కడే పడుకుండిపోయాడు.
ఎప్పటిలానే పూజలు చేసేందుకు ఆలయ పూజారి తలుపులు తెరిచి చూడగా.. బీరువాలోని బట్టలన్నీ చెల్లచెదురుగా పడి ఉండటాన్ని గమనించారు. ఆ పక్కనే మంచి నిద్రలో ఉన్న వ్యక్తిని చూసి పూజారి షాక్ అయ్యాడు. వెంటనే ఆలయ అధికారులను సమాచారం అందించాడు. అక్కడకు చేరుకున్న అధికారులు అతన్ని పట్టుకుని విచారించగా.. దొంగతనానికి వచ్చి ఆలయంలో నిద్రపోయినట్లు చెప్పాడు. దీంతో ఆలయ నిర్వాహకులు దొంగను పోలీసులకు అప్పగించారు. అనంతరం దొంగను కస్టడీలోకి తీసుకున్నారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం