భార్యను ఇంప్రెస్ చేయబోయి బొక్కలో ఇరుక్కున్నాడు.. ఇంతకీ ఏం జరిగిందంటే..?
కట్టుకున్న భార్యను మెప్పించేందుకు కోటి తిప్పలు పడుతుంటారు పతి. ఆమె మెప్పు కోసం ఏడు సముద్రాలను కూడా ఇట్టే దాటేస్తానంటూ కోతలు కోస్తుంటాడు వల్లభుడు. అయితే ముంబైలోని

ప్రేమ.. ఓ మధుర భావన.. ప్రేమికులు దంపతులుగా మారితే.. సరికొత్త అనుభూతుల పయనం.. కట్టుకున్న భార్యను మెప్పించేందుకు కోటి తిప్పలు పడుతుంటారు పతి. ఆమె మెప్పు కోసం ఏడు సముద్రాలను కూడా ఇట్టే దాటేస్తామంటాడు కోతలు కోస్తుంటాడు వల్లభుడు. అయితే ముంబైలోని ఓ మొగుడు మరో అడుగు ముందుకేసాడు. ఏకంగా పోలీసుల సాఫ్ట్‌వేర్ సిస్టంనే ఫ్యాక్ చేశాడు. ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలనుకున్న భార్యకు నచ్చజెప్పేందుకు సదరు వ్యక్తి చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. సిటీ పోలీస్ పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ బ్రాంచ్ సిస్టమ్‌ను హ్యాక్ చేసినందుకు 27 ఏళ్ల సివిల్ ఇంజనీర్‌ను ముంబై క్రైమ్ బ్రాంచ్ సైబర్ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. సిస్టమ్‌ను హ్యాక్ చేసిన తర్వాత.. నిందితుడు అతని భార్యతో సహా ముగ్గురు వీసా దరఖాస్తుదారులపై విచారణకు ఆదేశించారు.
27 ఏళ్ల సివిల్ షా.. ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలని భావించిన తన భార్యకు నచ్చజెప్పాలని నిందితుడు భావించాడని పోలీసులు తెలిపారు. ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు, షా తనకు తెలిసిన సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసుల వెబ్ సైట్‌ను ఫ్యాక్ చేశాడు. షా భార్య సమర్పించిన పత్రాలు సక్రమంగా ఉన్నాయి. ఎటువంటి సమస్య లేదు. కానీ ఎఫ్‌ఐఆర్ తర్వాత, షా భార్య పాస్‌పోర్ట్ నిలిపివేయబడిందని పోలీసులు తెలిపారు.
గత ఏడాది ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తిపై విలువైన సెక్యూరిటీ, వీలునామా, గుర్తింపు చౌర్యం, కంప్యూటర్ వనరులను ఉపయోగించి మోసం చేసినందుకు శిక్ష, ఐపిసి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది.
ముంబైలోని ఆంటోప్ హిల్, చెంబూర్, తిలక్ నగర్‌కు చెందిన ముగ్గురు మహిళల పాస్‌పోర్ట్‌లపై పోలీసులు విచారణ చేసిన పోలీసులు క్లియరెన్స్ ఇచ్చారు. ఆజాద్ మైదాన్ పోలీసుల విచారణలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు నోయిడాలోని ఒక పరికరానికి కేటాయించిన ఇంటర్నెట్ ప్రోటోకాల్ (IP) చిరునామాను ఉపయోగించినట్లు గుర్తించారు.
నిందితుడు బాబు షాను యూపీలోని ఘజియాబాద్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. షా యూపీలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. షా భార్య ముంబైలో పని చేస్తుంది. ఆమె పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసింది. షా చట్టవిరుద్ధంగా సిస్టమ్‌ను యాక్సెస్ చేశాడు. అతని భార్యతో సహా మూడు విచారణలను క్లియర్ చేసాడు. అయితే షా ఈ సిస్టమ్‌ను ఎలా యాక్సెస్ చేశాడో చెప్పేందుకు పోలీసులు నిరాకరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం




