Tamil Nadu Politics: వేడెక్కుతున్న తమిళనాడు రాజకీయాలు.. డీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చిన నటుడు శరత్ కుమార్
Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాలు రోజురోజుకు వేడెక్కిపోతున్నాయి. రాష్ట్రంలో కొత్త పొత్తులు మొదలవుతున్నాయి. మూడో కూటమి దిశగా అడుగులు పడుతున్నాయి. ...
Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాలు రోజురోజుకు వేడెక్కిపోతున్నాయి. రాష్ట్రంలో కొత్త పొత్తులు మొదలవుతున్నాయి. మూడో కూటమి దిశగా అడుగులు పడుతున్నాయి. కమల్ హాసన్ పార్టీ నేతృత్వంలో మూడో కూటమికి సన్నాహాలు కొనసాగుతున్నాయి. డీఎంకే కూటమి నుంచి నటుడు శరత్ కుమార్ బయటకు వచ్చారు. మక్కల్ నీది మయ్యం పార్టీతో కలిసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పలు పార్టీల అధినేతలతో శరత్ కుమార్ భారీగా మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. డీఎంకే కూటమి నుంచి ఐజేకే బయటకు వచ్చారు. అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత నాలుగైదు రోజుల కిందట సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్‌ఎం) అదినేత కమల్ హాసన్ కీలక వ్యాఖ్యాలు చేసిన విషయం తెలిసిందే. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన నాయకత్వంలో మూడో కూటమి ఏర్పడే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఎంఎన్‌ఎం 4వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కమల్ హాసన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడు రాష్ట్రంలో మూడో కూటమి అవకాశాలున్నట్లు భావిస్తున్నానని అన్నారు. పరిస్థితులు అందుకు అనుకూలంగా మారుతున్నాయిన ఆయన అభిప్రాయపడ్డారు. అతి త్వరలోనే నా నాయకత్వంలోనే ఇది జరగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. మరో వైపు ద్రవిడ మున్నేట్ర కళగమ్ (డీఎంకే) అంగీకరిస్తే తామకు కూటమికి సిద్ధంగా ఉన్నట్లు కమల్‌హాసన్ చెప్పారు. డీఎంకే రహస్య ప్రతినిధి తమను సంప్రదించారిన చెప్పినట్లు అన్నారు. పార్టీ అధిష్టానం నుంచి నేరుగా ఆహ్వానం అందితేనే పొత్తను అంగీకరిస్తామని స్పష్టం చేశారు.
అయితే అధికార పార్టీ అన్నాడీఎంకే – బీజేపీ – కాంగ్రెస్ నేతృత్వంలో కూటములు ఇప్పటికే ఎన్ని్కల ప్రచారాన్ని ప్రారంభించాయి. మాజీ ముఖ్యమంత్రులు, జయలలిత, కరుణానిధి మరణం అనంతరం రాష్ట్రంలో జరగబోయే తొలి మొదటి అసెంబ్లీ ఎన్నికలకు ఎంఎన్‌ఎం సిద్ధమవుతోంది. పార్టీ టికెట్ కోసం అభ్యర్థులలకు దరఖాస్తులు అందిస్తోంది. ఇలా తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు తీవ్ర స్థాయికి చేరాయి. ఇక తాజాగా దేశంలో ఐదు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారాలలో తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు భారత ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఏప్రిల్ 6న ఎన్నికలు నిర్వహించగా, మే 2వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి.
Also Read: CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం.. పలువురు మంత్రులకు కీలక బాధ్యతలు.. ఆదేశాలు జారీ