Delhi liquor scam case: ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్.. తైవాన్ వెళ్లాలని అనుకున్న తరుణంలో..
Sanjay Singh Arrested: ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఉదయం నుంచి సంజయ్‌సింగ్ నివాసంలో సోదాలు చేసిన ఈడీ ఆయన్ను బుధవారం సాయంత్రం అరెస్ట్ చేసింది. మహిళా సాధికారతపై తైవాన్‌లో జరుగుతున్న ఓ కార్యక్రమంలో.. సంజయ్ సింగ్ ఇవాళ హాజరుకావాల్సింది. అయితే ఆయన పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించింది. మరోవైపు ఈ కేసులో అప్రూవర్లుగా మారిన శరత్ చంద్రారెడ్డి, దినేశ్ అరోరా..

ఢిల్లీ లిక్కర్ స్కాం మరో కీలక మలుపు తిరిగింది. ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఉదయం నుంచి సంజయ్‌సింగ్ నివాసంలో సోదాలు చేసిన ఈడీ ఆయన్ను బుధవారం సాయంత్రం అరెస్ట్ చేసింది. లిక్కర్ కేసు చార్జిషీట్‌లో సంజయ్ సింగ్ పేరును ఈడీ మూడుసార్లు ప్రస్తావించింది. ఈ క్రమంలో ఢిల్లీ నార్త్ అవెన్యూలోని ఆయన నివాసంలో ఈడీ సోదాలు జరిపింది.
మహిళా సాధికారతపై తైవాన్‌లో జరుగుతున్న ఓ కార్యక్రమంలో.. సంజయ్ సింగ్ ఇవాళ హాజరుకావాల్సింది. అయితే ఆయన పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించింది. మరోవైపు ఈ కేసులో అప్రూవర్లుగా మారిన శరత్ చంద్రారెడ్డి, దినేశ్ అరోరా, మాగుంట రాఘవలు.. కీలక వివరాలు వెల్లడించారు. ఆ సమాచారం మేరకే ఈడీ సంజయ్‌సింగ్‌పై చర్యలు తీసుకున్నట్టు తెలుస్తొంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో..
ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను బుధవారం (అక్టోబర్ 4) ED అరెస్టు చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈరోజు తెల్లవారుజామున ఈడీ దాడులు ప్రారంభించింది. సంజయ్ సింగ్ (51) ఆప్ నుంచి రాజ్యసభ సభ్యుడు. ఈ కేసులో ఆయన సిబ్బందిని, అతనితో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులను ఈడీ గతంలో విచారించింది.
అరవింద్ కేజ్రీవాల్ ఏమన్నారంటే..
సంజయ్ సింగ్ అరెస్టును రాజకీయం అంటూ అభివర్ణించింది ఆప్. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ, పోలీసులు వంటి అన్ని ఏజెన్సీలు యాక్టివ్‌గా మారతాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. నిన్న జర్నలిస్టుల ఆవరణలో, నేడు సంజయ్ సింగ్ ఆవరణలో దాడులు నిర్వహించారు. ఇలాంటి దాడులు చాలా జరుగుతాయి. కానీ భయపడాల్సిన పని లేదు.
పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే మోదీ తమ నేతలపై ఈడీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. 1000 సార్లు సోదాలు చేసినప్పటికి ఈడీ అధికారులకు ఏమి దొరకదన్నారు. అసలు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరగలేదన్నారు కేజ్రీవాల్.
అవినీతికి అడ్డాగా ఆప్ సర్కార్..
ఢిల్లీలో ఆప్ సర్కార్ అవినీతికి అడ్డాగా మారిందని బీజేపీ విమర్శించింది. లిక్కర్‌స్కామ్‌లో అసలు సూత్రధారి కేజ్రీవాల్ అని బీజేపీ నేతలు ఆరోపించారు. ఢిల్లీలో ఆప్ కార్యాలయంతో పాటు కేజ్రీవాల్ నివాసాన్ని ముట్టడించేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. పోలీసులు వాళ్లను అరెస్ట్ చేశారు.
ED తన ఛార్జ్ షీట్‌లో ఏమి ఆరోపించిందంటే..
ఈ కేసులో నిందితుడు దినేష్ అరోరా ప్రధాన లింక్‌గా భావిస్తున్నారు. దినేష్ అరోరా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలో కలిశారని ఈడీ తన చార్జిషీట్‌లో పేర్కొంది. ఈ సమావేశంలో సంజయ్ సింగ్ కూడా ఉన్నారు. ఒక కార్యక్రమంలో సంజయ్ సింగ్‌ను కలిశానని విచారణ సందర్భంగా దినేష్ అరోరా తెలిపారు. ఆ తర్వాత మనీష్ సిసోడియాతో పరిచయం ఏర్పడింది. ఢిల్లీ ఎన్నికలకు ముందు ఆప్ అధినేత నిర్వహించిన నిధుల సేకరణ కార్యక్రమం ఇది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




