Satyendra Jain: ఆప్ మాజీ మంత్రి సత్యేంద్రజైన్ ఆరోగ్యం విషమం.. కొనసాగుతున్న చికిత్స..
మనీలాండరింగ్ కేసులో అరెస్టు అయి.. తీహార్ జైల్లో ఉన్నా ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్రజైన్ ఆరోగ్యం క్షీణించింది. గురువారం ఉదయం బాత్‌రూమ్‌లో జారిపడడంతో సత్యేందర్ జైన్ కు తీవ్రగాయాలయ్యాయి.
మనీలాండరింగ్ కేసులో అరెస్టు అయి.. తీహార్ జైల్లో ఉన్నా ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్రజైన్ ఆరోగ్యం క్షీణించింది. గురువారం ఉదయం బాత్‌రూమ్‌లో జారిపడడంతో సత్యేందర్ జైన్ కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో అధికారులు.. ఆయన్ను హుటాహుటిన ఢిల్లీ LNJP ఆస్పత్రికి తరలించారు. మనీలాండరింగ్ కేసులో సత్యేంద్రజైన్‌ను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది నుంచి ఆయన జైల్లో ఉన్నారు. ఆస్పత్రిలో సత్యేంద్రజైన్ ఆక్సిజన్ సపోర్ట్‌పై ఉన్నారని ఆప్ నేతలు వెల్లడించారు.
బాత్‌రూమ్‌లో స్పృహతప్పి పడిపోయిన సత్యేందర్ జైన్ ను మొదట.. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన్ను ఢిల్లీ నగరంలోని ఎల్ఎన్‌జేపీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆక్సిజన్ సపోర్ట్‌పై ఉన్నారని.. ఆయనకు చికిత్స కొనసాగుతుందని జైలు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
కాగా.. సత్యేందర్ జైన్ ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ కీలక ప్రకటన చేసింది. బాత్‌రూమ్‌లో కళ్లుతిరగడంతో ఆయన కిందపడిపోయారని, గతంలో కూడా బాత్‌రూమ్‌లో పడిపోవడంతో వెన్నెముకకు తీవ్ర గాయమైందని తెలిపింది. అయితే, గత సోమవారం జైన్ అస్వస్థతకు గురవ్వడంతో ఆయన్ను జైలు అధికారులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ సమయంలో ఆయన బక్కచిక్కి పోయి చాలా నీరసంగా కన్పించారు. జైల్లో దాదాపు 35 కేజీలు తగ్గిపోయి కనిపించారు.
ఇదిలాఉంటే.. సత్యేంద్రజైన్ బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేంద్రం కుట్రతో సత్యేంద్రజైన్‌ను అరెస్ట్ చేసిందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. జైల్లో 30 కేజీల బరువు తగ్గి ఆయన అస్థిపంజరంలా తయారయ్యాయని తెలిపారు. సత్యేంద్రజైన్‌ను చంపేందుకు బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..