తమిళనాడు ఇంటర్ మార్కుల జాబితాలు విద్యార్థుల మతిపోగొడుతున్నాయి. నూటికి నూరు మార్కొలస్తే ఫరవాలేదు. మధురైలో ఓ విద్యార్థికి నూటికి 138 మార్కులేసి విద్యార్థులను అవాక్కయ్యేలా చేసింది తమిళనాడు విద్యాశాఖ. అంతేకాదండోయ్.. ఇలాంటి లీలలు చాలానే ఉన్నాయి తమిళనాడు ఎస్ఎస్‌సీ ఫలితాల్లో.
తమిళనాడులో దిండికల్ జిల్లాకు చెందిన నందిని అనే విద్యార్థినికి 600 లకు 600 మార్కులు వచ్చాయి. విషయం తెలుసుకున్న సీఎం స్టాలిన్.. విద్యార్థినిని పిలిచి అభినందించారు. అంతేకాదు.. నందిని విద్యకు అయ్యే ఖర్చునంతా ప్రభుత్వమే చూసుకుంటుందని హామీ ఇచ్చారు. ఇదిలాఉంటే.. మధురైలో ఆర్తి అనే విద్యార్థినికి 100కు 138 మార్కులు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మొత్తం 600 మార్కులకు 514 మార్కులు వచ్చినా నాలుగు సబ్జెక్టులు ఫెయిల్ ఫెయిల్ అయ్యింది ఆర్తి. దాంతో ఈ మార్కుల వ్యవహారంపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు విద్యార్థిని తల్లిదండ్రులు. ఈ మార్కులపై విచారణకు ఆదేశించారు ఉన్నతాధికారులు.
మరిన్ని తమిళనాడు వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..