వీడు ఎవడండీ బాబు.. హెల్మెట్ పెట్టుకో అన్నందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్ వేలును కొరికేశాడు!

వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంగిస్తూ పోలీసులకు చుక్కలు చూపిస్తున్న ఘటన వెలుగుచూస్తూనే ఉన్నాయి. హెల్మెట్ ధరించకుండా, ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తూ అమర్యాదగా ప్రవర్తిసున్నారు.

వీడు ఎవడండీ బాబు.. హెల్మెట్ పెట్టుకో అన్నందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్ వేలును కొరికేశాడు!
Traffic Restrictions
Follow us

| Edited By: TV9 Telugu

Updated on: Feb 13, 2024 | 6:47 PM

వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంగిస్తూ పోలీసులకు చుక్కలు చూపిస్తున్న ఘటన వెలుగుచూస్తూనే ఉన్నాయి. హెల్మెట్ ధరించకుండా, ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తూ అమర్యాదగా ప్రవర్తిసున్నారు. తాజాగా బెంగళూరులో జరిగిన ఓ ఘటనలో ఓ వాహనదారుడు హెల్మెట్ పెట్టుకో అన్నందుకే ఏకంగా వేలునే కొరికిశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బెంగుళూరులో విల్సన్ గార్డెన్ 10వ క్రాస్ సమీపంలో హెల్మెట్ లేకుండా స్కూటీని నడుపుతూ పట్టుబడ్డాడు. వాహనదారుడి అయిన సయ్యద్ సఫీని ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు.

హెల్మెట్ ధరించకుండా ఇష్టానుసారంగా సమాధానం ఇవ్వడంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ స్కూటీ తాళాలు  తీయగా, మరో హెడ్ కానిస్టేబుల్ సిద్ధరామేశ్వర రికార్డ్ చేయడానికి సంఘటనను చిత్రీకరించడానికి ప్రయత్నించాడు. 28 ఏళ్ల యువకుడు ట్రాఫిక్ కానిస్టేబుళ్లిద్దరినీ ఎదిరించడం వీడియోలో చూడొచ్చు. ఓ దశలో తాళాలు తీసేందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్ వేలిని కొరికాడు.

తాను ఆసుపత్రికి వెళుతుండగా హెల్మెట్ ధరించడం మర్చిపోయానని, తన వీడియో వైరల్‌గా మారితే పట్టించుకోనని చెప్పడం మరి విడ్డూరంగా ఉంది. దీంతో సయ్యద్ సఫీ హెడ్ కానిస్టేబుల్ ఫోన్‌ను లాక్కొని, వీడియో ఎందుకు రికార్డ్ చేస్తున్నారని పోలీసులను ప్రశ్నించి అక్కడ్నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. వెంటనే అతడిని పట్టుకుని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని దుర్భాషలాడడం, నేరపూరిత బెదిరింపులు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు అతనిపై కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు.

సొంతింటి కల..నెరవేర్చుకోండిలా..!
సొంతింటి కల..నెరవేర్చుకోండిలా..!
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.