AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat: ఆబగా ఐస్‌క్రీం తినాలనుకుంది.. నోట్లో పెట్టుకోగానే.. అమ్మబాబోయ్!

సమ్మర్ సీజన్‌ ఎండలు దంచేస్తున్నాయని చల్లగా ఐస్‌క్రీం తిందామని వెళ్లిన ఓ మహిళకు షాక్ తగిలింది. తను కొనుక్కొని తిన్న ఐస్‌క్రీంలో బల్లితోక దర్శనం ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా కంగుతున్న మహిళ షాప్‌ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.

Gujarat: ఆబగా ఐస్‌క్రీం తినాలనుకుంది.. నోట్లో పెట్టుకోగానే.. అమ్మబాబోయ్!
Gujarat
Anand T
|

Updated on: May 15, 2025 | 3:36 PM

Share

ఓ మహిళ ఐస్‌క్రీమ్ కొనుగోలు చేసి దాన్ని తినగా అందులో బల్లి తోక దర్శనమిచ్చిన ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అహ్మాబాద్‌లోని మణినగర్ ప్రాంతంలో ఉన్న ఓ ఐస్‌క్రీం షాప్‌కు వెళ్లిన మహిళ.. తన పిల్లల కోసం  నాలుగు కోన్‌ ఐస్‌క్రీమ్‌లు తీసుకుంది. అయితే సగం ఐస్‌క్రీం తిన్న తరువాత ఆమెకు దానిలో బల్లి తోక భాగం దర్శనమిచ్చింది. అయితే ఐస్‌క్రీం తిన్న కొద్దిసేపటి తర్వాత తాను అనారోగ్యానికి గురైనట్టు ఆమె ఓ వీడియోలో తెలిపింది. తర్వాత ఆమె హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స తీసుకుంది.

ఇక తనకు నాణ్యతలేని ఐస్‌క్రీమ్స్‌ అమ్మిన షాప్‌పై మహిళ అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌కు ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ ఫిర్యాదును పరగణనలోకి తీసుకున్న అధికారులు ఆ షాప్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా మహిళకు ఐస్‌క్రీమ్‌లు విక్రయించిన షాప్‌కు ఫుడ్ సేఫ్టీ లైసెన్స్‌లు లేనట్టు గుర్తించింది. దీంతో ఆ షాప్‌ను అధికారులు క్లోజ్ చేయించారు.

దీంతో పాటు ఆమె తిన్న ఐస్‌క్రీం ఏం కంపెనీకి సంబంధించిందో అనే వివరాలపై ఆరా తీశారు. దాని తయారీ కంపెనీ నరోడా GIDC ఫేజ్ 1లో ఉందని గుర్తించారు. ఆ కంపెనీకి సంబంధించిన ఐస్‌క్రీమ్‌లను ల్యాబ్‌కు పంపించారు. వాటి రిపోర్ట్స్‌ ఆధారంగా కంపెనీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. ఆ కంపెనీపై రూ. 50,000 జరిమానా విధించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీకి సూపర్‌ ట్రిక్‌.. ఇలా చేశారంటే..
ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీకి సూపర్‌ ట్రిక్‌.. ఇలా చేశారంటే..
మొన్నటి వరకు స్టార్ హీరోయిన్..ఇప్పుడు IPS ఆఫీసర్
మొన్నటి వరకు స్టార్ హీరోయిన్..ఇప్పుడు IPS ఆఫీసర్
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కొత్త రూల్స్.. ఆ టికెట్లు ఉండవ
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కొత్త రూల్స్.. ఆ టికెట్లు ఉండవ
మేడారం మహా జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఇలా చేస్తే ఇంటికే ‘బంగారం’
మేడారం మహా జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఇలా చేస్తే ఇంటికే ‘బంగారం’
4 కారణాల వల్లే కోటాను కోట్లు పోగొట్టుకున్నా..!
4 కారణాల వల్లే కోటాను కోట్లు పోగొట్టుకున్నా..!
కాళ్లకు సాక్స్‌ వేసుకుని నిద్రపోతే ఇన్ని లాభాలా..? నిపుణుల సూచన
కాళ్లకు సాక్స్‌ వేసుకుని నిద్రపోతే ఇన్ని లాభాలా..? నిపుణుల సూచన
బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న మన శంకరవరప్రసాద్ గారు..
బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న మన శంకరవరప్రసాద్ గారు..
సేఫ్టీ పిన్‌ చరిత్ర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. అసలు దాని..
సేఫ్టీ పిన్‌ చరిత్ర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. అసలు దాని..