Bihar: బీహార్ లో 72 శాతం మంది మంత్రులపై క్రిమినల్ కేసులు.. ఎక్కువ మంది ఆ పార్టీ ఎమ్మెల్యేలే..

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కేబినేట్ లోని మంత్రుల నేర చరిత్ర, విద్యార్హత, ఆస్తుల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తాజాగా వెల్లడించింది. ఎన్నికల అఫిడవిట్ లో సమర్పించిన ఆధారాల ఆధారంగా..

Bihar: బీహార్ లో 72 శాతం మంది మంత్రులపై క్రిమినల్ కేసులు.. ఎక్కువ మంది ఆ పార్టీ ఎమ్మెల్యేలే..
Bihar Cabinet
Follow us

|

Updated on: Aug 18, 2022 | 10:10 AM

Bihar: బీజేపీతో దోస్తికి కటీఫ్ చెప్పి.. ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ సహా ఇతర పార్టీలతో ఏర్పడిన మహాఘట్ బంధన్ కూటమిలో సీఎం పగ్గాలు చేపట్టిన నితీష్ కుమార్.. 32 మందితో తన మంత్రివర్గాన్ని ఏర్పరచుకున్నారు. రెండు రోజుల క్రితం కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం కూడా చేశారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కేబినేట్ లోని మంత్రుల నేర చరిత్ర, విద్యార్హత, ఆస్తుల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తాజాగా వెల్లడించింది. ఎన్నికల అఫిడవిట్ లో సమర్పించిన ఆధారాల ఆధారంగా ఈవివరాలను ప్రకటించింది. సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తో సహా 23 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ADR తెలిపింది. అయితే మంత్రి అశోక్ చౌదరి శాసనమండలి సభ్యుడు కావడంతో అతడికి సంబంధించిన వివరాలు పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో లేవని చెప్పింది.

క్రిమినల్ కేసులున్న 23 మందిలో 17 మంది మంత్రలు అంటే 53 శాతం మందిపై తీవ్రమైన నేరారోపణ కేసులు ఉన్నాయని ప్రకటించింది. ADR ప్రకటించిన వివరాల ప్రకారం.. పార్టీల పరంగా ఆర్జేడీ నుంచి 17 మంది మంత్రివర్గంలో ఉండగా 15 మంది అంటే 88 శాతం మంది క్రిమినల్ కేసులు కలిగి ఉన్నారు. వీరిలో 11 మంది అంటే 65 శాతం మంది మంత్రులు తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూకి చెందిన 11 మంది కేబినేట్ లో ఉంటే.. వీరిలో నలుగురిపై అంటే 36 శాతం మంది మంత్రులపై క్రిమినల్ కేసులుండగా..ముగ్గురిపై సీరియస్ క్రిమనల్ కేసులు నమోదై ఉన్నాయి. జేడీయూ పార్టీ నుంచి క్రిమినల్ కేసులు ఉన్న వారి జాబితాలో సీఎం నితీష్ కుమార్ యాదవ్ ఉన్నారు. మంత్రివర్గంలోని ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉండగా.. ఒకరు తీవ్రవమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఎన్డీయే ప్రభుత్వంలో నితీష్ కుమార్ సీఎంగా ఉన్నప్పుడు 31 మంది మంత్రుల్లో 18 మందిపై క్రిమినల్ కేసులు ఉండగా… ప్రస్తుతం మహాఘట్ బంధన్ కూటమిలో నితీష్ కుమార్ మంత్రి వర్గంలో 32 మందిలో 23 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ADR తన నివేదికలో వెల్లడించింది. అఫిడవిట్ లో పేర్కొన్న వివరాల ప్రకారం ప్రస్తుతం బీహార్ సీఎం నితీష్ కుమార్ మంత్రివర్గంలో ఉన్న మంత్రులు విద్యార్హతలను ADR విడుదల చేసింది. 32 మందిలో 8 మంది అంటే 25 శాతం మంది 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదుకుకోగా..24 మంది మంత్రులు 75 శాతం మంది డిగ్రీ, ఆపై చదువులు చదివారని ADR పేర్కొంది. నితీష్ కుమార్ మంత్రివర్గంలో అతి తక్కువ విద్యార్హత డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ (8వ తరగతి) కాగా.. తేజస్వి సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఇంటర్మీడియట్ గా తన విద్యార్హతగా పేర్కొన్నారు. ఆస్తుల పరంగా 16 మంది ఆర్జేడీ మంత్రులు, 9 మంది జేడీయూ మంత్రులు కోటీశ్వరులని ADR నివేదిక స్పష్టం చేస్తుంది.

ఇది కూడా చదవండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!