AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sikkim Tunnel Tragedy: సిక్కింలో ఘోర ప్రమాదం.. టన్నెల్‌లో చిక్కుకొని ఏడుగురు కార్మికులు మృతి

సిక్కింలోని సమర్‌డంగ్ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తీస్తా-6 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉన్న టన్నెల్‌లో కొండచరియలు విరిగిపడటంతో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. టన్నెల్ లోపల చిక్కుకున్న మరికొందరి కార్మికులకోసం NDRF, SDRF బృందాలతో పాటు సిక్కిం పోలీసులు, ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. శిథిలాలను తొలగించి, లోపల ఉన్నవారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అధికారులు శ్రమిస్తున్నారు.

Sikkim Tunnel Tragedy: సిక్కింలో ఘోర ప్రమాదం.. టన్నెల్‌లో చిక్కుకొని ఏడుగురు కార్మికులు మృతి
Sikkim Tunnel
Anand T
|

Updated on: Jul 21, 2026 | 8:12 AM

Share

సిక్కింలోని నామ్‌చి జిల్లాలోని ఎన్హెచ్‌పీసీ తీస్తా స్టేజ్-VI హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నిర్మాణంలో తీవ్ర విషాదం వెలుగుచూసింది. నిర్మాణ పనులు కొనసాగుతున్న వేళ ఒక్కసారిగా మిథేన్ వాయువు పేలిపోవడంతో కొండచరియలు విరిగిపడి.. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 18 మందికి పైగా కార్మికులు సొరంగం లోపలే చిక్కుకుపోయారు. సమాచారంతో రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. అయితే పేడుడు దాటికి సొరంగం ప్రవేశ మార్గం పూర్తిగా మూసుకుపోవడంతో లోపల ఉన్నవారిని రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

అసలు ఏం జరిగింది?

అయితే సొరంగంలో 1.5 కిలోమీటర్ల లోతులో భూగర్భ శిలల నుంచి సహజంగా వెలువడిన మిథేన్ గ్యాస్ పెద్దమొత్తంలో పేరుకుపోయిందని.. అక్కడ పేరుకుపోయిన ఈ విషవాయువును బయటకు పంపేందుకు సిబ్బంది ప్రయత్నిస్తుండగా ఈ పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. ఈ పేలుడి ధాటికి విరిగిన కొండచరియలు.. ప్రవేశ ద్వారం మోత్తాన్ని కమ్మేశాయని.. దీంతో రెస్క్యూ ఆపరేషన్ సైతం సవాల్‌గా మారిందని తెలిపారు.

ఈ ప్రమాద సమయంలో NHPC సిబ్బందితో సహా మొత్తం 25 మంది కార్మికులు లోపలే ఉన్నారని.. ప్రమాదం జరిగినట్టు సోమవారం మధ్యాహ్నం 3:40 గంటల ప్రాంతంలో జిల్లా యంత్రాంగానికి సమాచారం రావడంతో వెంటనే NDRF, SDRF, అగ్నిమాపక, పోలీస్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయని తెలిపారు.

సవాల్‌గా మారిన రెస్క్యూ

అయితే ప్రమాదం జరిగిన ప్రదేశం చాలా ఇరుకుగా ఉండడం, లోపల మొత్తం చీకటిగా ఉండడం, అదే సమయంలో అక్కడ ప్రమాదకర స్థాయిలో ఉన్న మిథేన్ గ్యాస్ ఉండడం వల్ల రెస్క్యూ ఆపరేషన్ అనేది పెద్ద సవాల్‌గా మారిందని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయని.. తొలుత చిక్కుకున్న వారిని కాపాడేందుకు వెళ్లిన ఫైర్ సిబ్బంది ఊపిరాడక అనారోగ్యానికి గురయ్యారని.. అందుకే తొలి ప్రయత్నాన్ని నిలిపివేసినట్టు తెలిపారు.

రంగంలోకి ప్రత్యేక బృందాలు

పరిస్థితి తీవ్రతను బట్టి, ప్రత్యేకంగా గ్యాస్ రక్షణ పరికరాలు కలిగిన నిపుణుల బృందాన్ని పశ్చిమ బెంగాల్ నుంచి రప్పించామని.. అలాగే పాక్యోంగ్, సిలిగురి ప్రాంతాల నుంచి NDRF 2వ బెటాలియన్‌కు చెందిన అదనపు బలగాలు ప్రాజెక్ట్ ప్రాంతానికి చేరుకున్నాయి. ఎలాగైన లోపల చిక్కుకున్న 18 మంది కార్ములకు బయటలకు తీసుకొచ్చే లక్ష్యంతోనే ముందుకెళ్తున్నట్టు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నిమ్మ చెట్టుకు కాయలు కాయడం లేదా? అయితే ఈ పొరపాట్లు చేస్తున్నట్లే!
నిమ్మ చెట్టుకు కాయలు కాయడం లేదా? అయితే ఈ పొరపాట్లు చేస్తున్నట్లే!
భారత్ కొంపముంచుతోన్న గిల్, గంభీర్ మొండి పట్టుదల
భారత్ కొంపముంచుతోన్న గిల్, గంభీర్ మొండి పట్టుదల
బ్యాంక్ అకౌంట్‌కు ఈ ప్రక్రియ పూర్తి చేయలేదా..? జాగ్రత్త
బ్యాంక్ అకౌంట్‌కు ఈ ప్రక్రియ పూర్తి చేయలేదా..? జాగ్రత్త
ప్రకృతి ఒడిలో వింత జీవులు.. ఆకట్టుకుంటున్న ‘నేత చీమలు..
ప్రకృతి ఒడిలో వింత జీవులు.. ఆకట్టుకుంటున్న ‘నేత చీమలు..
'నా జీతం సగం తగ్గించండి.. లేదంటే బదిలీ చేయండి' ఓ IAS అధికారి లేఖ
'నా జీతం సగం తగ్గించండి.. లేదంటే బదిలీ చేయండి' ఓ IAS అధికారి లేఖ
అందరి కోసం పోరాడితే నన్ను జైల్లో వేశారు..
అందరి కోసం పోరాడితే నన్ను జైల్లో వేశారు..
ఇదెక్కడి ట్విస్ట్ బాబూ.. బాలయ్య సినిమాలో విలన్ గా యంగ్ హీరోయిన్..
ఇదెక్కడి ట్విస్ట్ బాబూ.. బాలయ్య సినిమాలో విలన్ గా యంగ్ హీరోయిన్..
ICAIలో భారీగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు.. రూ.15.68లక్షల జీతం
ICAIలో భారీగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు.. రూ.15.68లక్షల జీతం
విద్యార్థులకు సూపర్ గుడ్‌న్యూస్.. రేపే అకౌంట్లోకి రూ.13 వేలు!
విద్యార్థులకు సూపర్ గుడ్‌న్యూస్.. రేపే అకౌంట్లోకి రూ.13 వేలు!
తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్ట్.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్ట్.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..