AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICAIలో భారీగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.15.68 లక్షల జీతంతో కొలువు

నిరుద్యోగులకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) తీపికబురు చెప్పింది. సంస్థలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. చార్టర్డ్ అకౌంటెంట్ (CA) అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 31, 2026లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఏడాదికి రూ.15.68 లక్షల వేతనం అందించనుండగా, ఆగస్టు 16న కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించనున్నారు..

ICAIలో భారీగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.15.68 లక్షల జీతంతో కొలువు
ICAI Executive Officer Recruitment
Srilakshmi C
|

Updated on: Jul 21, 2026 | 7:37 AM

Share

ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI)లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న చార్టర్డ్ అకౌంటెంట్లకు భారీ జీతంతో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ICAI సంస్థలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన జారీ చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా జూలై 31, 2026లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నియామకాల ద్వారా మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ICAIలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా చార్టర్డ్ అకౌంటెంట్ (CA) ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 2026 జూన్ 30 నాటికి 25 సంవత్సరాలు మించరాదు. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ముగింపు గడువులోగా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు కింద ప్రతి ఒక్కరూ రూ.500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతనం అందించనున్నారు. వార్షిక వేతనం దాదాపు రూ.15.68 లక్షలుగా నిర్ణయించారు. అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT) ద్వారా జరుగుతుంది. పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారికి నియామక అవకాశాలు కల్పిస్తారు. దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే జూలై 18, 2026 నుంచి ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 31, 2026లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్షను ఆగస్టు 16, 2026న నిర్వహించనున్నారు. చార్టర్డ్ అకౌంటెంట్ అర్హత కలిగిన యువతకు కేంద్ర స్థాయి సంస్థలో మంచి వేతనంతో ఉద్యోగం పొందేందుకు ఇది మంచి అవకాశం.

ICAIలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ముఖ్యమైన వివరాలు..

  • పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
  • ఖాళీలు: 50
  • అర్హత: చార్టర్డ్ అకౌంటెంట్ (CA)
  • వయోపరిమితి: 30 జూన్ 2026 నాటికి 25 ఏళ్లు మించరాదు
  • వేతనం: ఏడాదికి రూ.15.68 లక్షలు
  • దరఖాస్తు ఫీజు: రూ.500
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
  • చివరి తేదీ: 31 జూలై 2026
  • పరీక్ష తేదీ: 16 ఆగస్టు 2026

ICAIలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
వానాకాలం స్పెషల్ స్నాక్.. కొరికితే చీజ్ బయటకు రావాల్సిందే!
వానాకాలం స్పెషల్ స్నాక్.. కొరికితే చీజ్ బయటకు రావాల్సిందే!
సిని ఫక్కీలో చేజింగ్..చైన్ స్నాచర్లను పట్టుకున్న సరిహద్దు ప్రజలు
సిని ఫక్కీలో చేజింగ్..చైన్ స్నాచర్లను పట్టుకున్న సరిహద్దు ప్రజలు
మీ ఇంట్లో అందరూ ఫోన్‌లోనే మునిగిపోతున్నారా?.. కారణమిదే..
మీ ఇంట్లో అందరూ ఫోన్‌లోనే మునిగిపోతున్నారా?.. కారణమిదే..
రానున్న రోజుల్లో బంగారం ధరలు పెరుగుతాయా.. తగ్గుతాయా..?
రానున్న రోజుల్లో బంగారం ధరలు పెరుగుతాయా.. తగ్గుతాయా..?
అందుకే నేను ఇస్లాం మతంలో మారిపోయాను
అందుకే నేను ఇస్లాం మతంలో మారిపోయాను
సిటీలో సీరియల్ కిల్లర్..OTT ట్రెండింగ్‌లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్
సిటీలో సీరియల్ కిల్లర్..OTT ట్రెండింగ్‌లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్
అరటిపండు హ్యాక్‌తో కుండీలోనే మిరియాల మొక్క.. సీక్రెట్ ట్రిక్!
అరటిపండు హ్యాక్‌తో కుండీలోనే మిరియాల మొక్క.. సీక్రెట్ ట్రిక్!
ఫ్రిజ్‌లో మాంసం ఫ్రెష్‌గా ఉందా.. ప్యాకెట్‌ తెరవకుండానే చెప్పొచ్చు
ఫ్రిజ్‌లో మాంసం ఫ్రెష్‌గా ఉందా.. ప్యాకెట్‌ తెరవకుండానే చెప్పొచ్చు
అబ్బా... పెసరపప్పుతో డ్రై ఫ్రూట్ లడ్డూలు.. రుచి ఇంత బాగుంటుందా..
అబ్బా... పెసరపప్పుతో డ్రై ఫ్రూట్ లడ్డూలు.. రుచి ఇంత బాగుంటుందా..
తెలంగాణలో ఏకంగా 73 లక్షలకు పైగా ఓట్లు గల్లంతయ్యే ఛాన్స్!
తెలంగాణలో ఏకంగా 73 లక్షలకు పైగా ఓట్లు గల్లంతయ్యే ఛాన్స్!