AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Account: బ్యాంక్ అకౌంట్‌కు ఈ ప్రక్రియ పూర్తి చేయలేదా..? ఎప్పుడైనా మీ అకౌంట్ నిలిచిపోవచ్చు.

ఆర్బీఐ కేవైసీపై కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఇక నుంచి కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలి. లేకపోతే బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజింగ్ చేయాలని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశించింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.

Bank Account: బ్యాంక్ అకౌంట్‌కు ఈ ప్రక్రియ పూర్తి చేయలేదా..? ఎప్పుడైనా మీ అకౌంట్ నిలిచిపోవచ్చు.
Kyc
Venkatrao Lella
|

Updated on: Jul 21, 2026 | 8:09 AM

Share

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. కేవైసీపై కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ప్రతీ బ్యాంక్ తప్పనిసరిగా తమ ఖాతాదారుల కేవైసీ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే కేవైసీ ప్రక్రియను మూడు రకాలుగా విభజించారు. ఈ మేరకు ఒక సాఫ్ట్‌వేర్‌ను ఆర్బీఐ రూపొందించింది. కేవైసీ ప్రక్రియలో భాగంగా ఖాతాదారులు వ్యక్తిగత గుర్తింపు, అడ్రస్ వివరాలను అందించడంలో జాప్యం చేస్తే వారి అకౌంట్లలో ట్రాన్సాక్షన్లను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతీ బ్యాంక్ తప్పనిసరిగా దీనిని పాటించాలని సూచించింది. ఏయే బ్యాంక్ అకౌంట్లకు ఎప్పుడెప్పుడు కేవైసీ పూర్తి చేయాలనే దానిపై ఆర్బీఐ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మూడు వర్గాలుగా విభజన

రూ.50 వేలకు మించిన ట్రాన్సాక్షన్లను తరచుగా చేసే ఖాతాదారులను హైరిస్క్‌గా గుర్తిస్తారు. వీరికి రెండేళ్లకు ఒకసారి కేవైసీ పూర్తి చేయాలి. ఇక లావాదేవీలు కాస్త తక్కువ చేసేవారిని మీడియం రిస్క్‌గా గుర్తిస్తారు. వీరికి 8 ఏళ్లకు ఒకసారి ఖచ్చితంగా కేవైసీ పూర్తి చేయాలి. ఇక అరుదుగా లావాదేవీలను చేసేవారిని లోరిస్క్‌గా పరిగణిస్తారు. వీరికి ప్రతీ ఐదేళ్లకు ఒకసారి కేవైసీ పూర్తి చేయాలి. గత ఆర్ధిక సంవత్సరం మార్చి 31 నాటికి తెలంగాణలో 24,59,248 కేవైసీ వివరాలు బ్యాంకులు సమర్పించలేదు. ఈ అకౌంట్లలో 2,88,122లో అసలు లావాదేవీలే జరగడం లేదు. ఒక పెద్ద బ్యాంకులో 9.99 లక్షల కేవైసీ వివరాలు పెండింగ్‌లో ఉండగా.. మరో బ్యాంకులో 4.13 లక్షల రీకేవైసీ వివరాలు పెండింగ్‌లో ఉన్నాయి. కేవైసీ వివరాలు సమర్పించని అకౌంట్లలకు సంబంధించి ఫ్రీజింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఎప్పటికప్పుడు రీకేవైసీ చేయించుకోవాలని, లేకపోతే అకౌంట్ల ఫ్రీజింగ్ ప్రక్రియను సమీక్షిస్తామని ఆర్బీఐ స్పష్టం చేసింది.

కేవైసీ అంటే ఏంటి..?

కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ అని అర్థం. బ్యాంకులు తమ కస్టమర్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం. వారి పేరు, అడ్రస్, ఇతర వివరాలు తెలుసుకోవాలి. నిజమైన వ్యక్తిని గుర్తించడంలో ఇది సహాయడపతుంది. సేవలు వేగంతంగా అందించేందుకు ఇది సహాయపడుతుంది. కస్టమర్లు కేవైసీ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి పూర్తి చేయవచ్చు. ఇక నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ ద్వారా కూడా ఇంటి వద్ద నుంచే చేసుకోవచ్చు. ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, పాన్ కార్డు లాంటి వివరాలు అందించడం ద్వారా ఈ ప్రాపెస్ పూర్తి చేయవచ్చు.  దీంతో ఎలాంటి అవాంతరాలు లేకుండా బ్యాంక్ సేవలు పొందవచ్చు.

Follow Us