Covid 19 Vaccination: దేశంలో ఇప్పటి వరకు 7.5 కోట్ల మందికి వ్యాక్సిన్‌: కేంద్ర ప్రభుత్వం

|

Apr 04, 2021 | 2:36 PM

Covid 19 Vaccination: దేశంలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. ఒక వైపు వ్యాక్సినేషన్‌ కొనసాగుతుంటే మరో వైపు కరోనా.

Covid 19 Vaccination: దేశంలో ఇప్పటి వరకు 7.5 కోట్ల మందికి వ్యాక్సిన్‌: కేంద్ర ప్రభుత్వం
Covid 19 Vaccination
Follow us on

Covid 19 Vaccination: దేశంలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. ఒక వైపు వ్యాక్సినేషన్‌ కొనసాగుతుంటే మరో వైపు కరోనా విజృంభిస్తోంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 7.5 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్‌ మందికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అందులో 6.5 కోట్ల మంది కోవిడ్‌ వ్యాక్సిన్‌ మొదటి డోసు తీసుకున్నారని, మరో కోటి మందికిపైగా రెండో డోస్‌ తీసుకున్నారని తెలిపారు.

అయితే ఒక వైపు వైపు వ్యాక్సినేషన్‌ కొనసాగుతుండగా, మరో వైపు కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనే కొత్త కేసుల సంఖ్య ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నదని తెలిపింది.

కాగా, ప్రపంచ వ్యాప్తంగా రోజువారీ కేసుల్లో భారత్ ఇప్పటికే మొదటి స్థానానికి చేరింది. దీన్ని బట్టి చూస్తే కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తోందని అర్థం చేసుకోవచ్చు. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఏకంగా 93,249 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,24,85,509కి చేరింది. ఇక కరోనా కారణంగా 513 మంది చనిపోగా.. 60,048 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక 1,16,29,289 మంది రికవరీ అయ్యారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,64,623 మంది కరోనా తమ ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 6,91,597 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

ఇవీ చదవండి: Covid-19 Vaccine: వామ్మో.. ఫోన్ మాట్లాడుతూ.. ఒకేసారి రెండు కరోనా వ్యాక్సిన్లు వేసిన నర్సు.. ఎక్కడంటే?

Covid-19 Vaccine: ఆస్ట్రాజెనెకా టీకాపై అనుమానాలు.. గడ్డ కడుతున్న రక్తం.. బ్రిటన్‌లో వెలుగులోకి మరో 25 కేసులు

Johnson and Johnson: జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్ పై ఎన్నో సందేహాలు.. నాణ్యతలో విఫలం