AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్వయంగా చితిపేర్చుకుని తన చేతులతో నిప్పంటించి.. ఆ తర్వాత ఏం చేశాడంటే..

కేరళలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. ఏం కష్టం వచ్చిందో.. 68 ఏళ్ల వృద్ధుడు తన చితిని తనే పేర్చుకుని, దానికి తన చేతులతో తనే నిప్పు అంటించుకుని.. ఆత్మహుతి చేసుకున్నాడు..

స్వయంగా చితిపేర్చుకుని తన చేతులతో నిప్పంటించి.. ఆ తర్వాత ఏం చేశాడంటే..
Funeral Pyre In Kerala
Srilakshmi C
|

Updated on: Feb 10, 2023 | 4:14 PM

Share

కేరళలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. ఏం కష్టం వచ్చిందో.. 68 ఏళ్ల వృద్ధుడు తన చితిని తనే పేర్చుకుని, దానికి తన చేతులతో తనే నిప్పు అంటించుకుని.. ఆత్మహుతి చేసుకున్నాడు. గురువారం నాడు చోటు చేసుకున్న ఈ విషాద ఘటన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కేరళలోని పుత్తురు జిల్లాకు చెందిన విజయకుమార్ (68) అనే వృద్ధుడు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆరోగ్యం సహకరించకపోవడంతో గత కొంతకాలంగా పనులకు వెళ్లడం కూడా మానివేశాడు. దీంతో తన పూర్వీకుల నుంచి సంక్రమించిన ఇంట్లో ఒంటరిగా బతుకు వెళ్లదీస్తున్నాడు. ఈ క్రమంలో వృద్ధుడు నివాసం ఉంటున్న ఇంటి నుంచి గురువారం అర్ధరాత్రి మంటలను రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. అప్పటి వరకు అందరూ ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని ఉండవచ్చని భావించారు. ఐతే సూసైడ్‌ నోట్‌లోని విషయాలు తెలిశాక అందరూ దగ్ర్భాంతికి గురయ్యారు. తన స్నేహితుడికి రాసిన లేఖలో.. తన అనరోగ్యం కారణంగా ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని ముగిస్తున్నట్లు వృద్ధుడు తెలిపాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.