Viral News: అయ్యబాబోయ్.. నిప్పులు కక్కుతున్న ధృవపు ఎలుగుబంటి.. ఎదురుపడితే భస్మమేనా..?!

ధృవపు ఎలుగుబంట్లు సాధారణంగా ఆర్కిటిక్, కెనడా, అలాస్కా, గ్రీన్లాండ్, రష్యా, నార్వేలోని మంచు ఏడారుల్లో కనిపిస్తాయి. పూర్తిగా మంచుతో కప్పబడిన ప్రాంతంలో తెల్లటి ధృవపు ఎలుగుబంటి నిలబడి ఆగ్రహంతో తన నోటి నుండి నిప్పులు చిమ్ముతున్న

Viral News: అయ్యబాబోయ్..  నిప్పులు కక్కుతున్న ధృవపు ఎలుగుబంటి.. ఎదురుపడితే భస్మమేనా..?!
Polar Bear
Follow us

|

Updated on: Feb 10, 2023 | 5:39 PM

సాధారణంగా ప్రశాంతంగా ఉండే ధృవపు ఎలుగుబంట్లు ఇటీవల దూకుడుగా ప్రవర్తిస్తున్నాయనే నివేదికలు వస్తున్నాయి. అయితే, గత కొన్ని రోజులుగా ధృవపు ఎలుగుబంటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఆ ఫోటో చూసిన వినియోగదారులు షాక్‌కు గురవుతున్నారు. ఇంతకీ ఆ ఫోటోలో ఏముందన్నది పరిశీలించినట్టయితే.. అక్కడంతా పూర్తిగా ఘనీభవించిన మంచు ఏడారి అని తెలుస్తోంది. అలాంటి మంచుగడ్డలపై ఉన్న గంభీరమైన ధృవపు ఎలుగుబంటి నోటి నుంచి నిప్పులు కక్కుతున్నట్టుగా కనిపిస్తుంది. చల్లటి వాతావరణంలో ప్రశాంతంగా ఉండే, ధృవపు ఎలుగుబంటి నోటి నుంచి ఎర్రటి నిప్పు కనికలు ఉమ్మేస్తున్నట్టుగా కనిపించే ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

2015లో తీసిన ఫోటో 2023 ఫిబ్రవరి 7న ఒక ట్విట్టర్ యూజర్ షేర్ చేయడంతో మళ్లీ వైరల్ అయింది. ట్విట్టర్ వినియోగదారు మాసిమో ఈ చిత్రాన్ని పంచుకున్నారు. దీనిని ఫోటోగ్రాఫర్ జోష్ అనన్ సంగ్రహించారు. ఉదయించే సూర్యుడు ధృవపు ఎలుగుబంటి ఉచ్ఛ్వాసాన్ని అగ్నిగా మార్చినట్లు పేర్కొన్నాడు. పూర్తిగా మంచుతో కప్పబడిన ప్రాంతంలో తెల్లటి ధృవపు ఎలుగుబంటి నిలబడి ఆగ్రహంతో తన నోటి నుండి నిప్పులు చిమ్ముతున్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ అసలు సంగతి ఏంటంటే..

ఇవి కూడా చదవండి

పొగమంచు వాతావరణంలో ధృవపు ఎలుగుబంటి నిశ్వాస గాలి గుండా సూర్యుడి నారింజ కాంతి ప్రసరించినప్పుడు ఇలాంటి అద్భుతమైన దృశ్యం ఆవిషృతమైంది. 2015లో ఒకరోజు ఆర్కిటిక్ యాత్రలో ఉన్నప్పుడు అనన్ ఈ చిత్రాన్ని తీశారు. ఇప్పటికే 10 లక్షల మందికి పైగా ఈ ఫోటోని చూసిన ఆశ్చర్యపోయారు.

ఇంతకు ముందు చాలా మంది ఈ చిత్రాన్ని చూసినప్పటికీ, చాలా మంది ఈ చిత్రాన్ని షేర్ చేశారు. ఈ ఫోటోపై చాలా మంది నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్‌ చేశారు. ఫోటోగ్రాఫర్ క్రియేటివిటీని చాలా మంది మెచ్చుకున్నారు. ఇంత అద్భుత క్షణాన్ని సంగ్రహించి తమతో పంచుకున్నందుకు ఫోటోగ్రాఫర్‌కి ధన్యవాదాలు చెబుతున్నారు. మరికొందరు నెటిజన్లు ఇలాంటి ఫోటోగ్రాఫర్ల సహసం, సహానాన్ని అభినందిస్తున్నారు. ఇలాంటి అరుదైన ఫోటోలను తీయడానికి వారు గంటల తరబడి అలాంటి మంచు ప్రదేశంలో నిరీక్షించాల్సి ఉంటుందని ఫోటోగ్రాఫర్ల సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ధృవపు ఎలుగుబంట్లు సాధారణంగా ఆర్కిటిక్, కెనడా, అలాస్కా, గ్రీన్లాండ్, రష్యా, నార్వేలోని మంచు ఏడారుల్లో కనిపిస్తాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..