AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సముద్రంలో నగ్నంగా స్నానం చేసి ఈ ద్వీపంలోకి వెళ్లాలి..! పురుషులకు కూడా రహస్య ప్రయాణం..!!

ఇక ఈ ద్వీపంలోకి వెళ్లి వచ్చిన ఎవరైనా సరే తమ ప్రయాణాన్ని గోప్యంగా ఉంచాలి. ఎవరితోనూ చర్చించరాదు. ఈ ద్వీపం గురించి మరో ఆసక్తికరమైన విషయం ఉంది.

సముద్రంలో నగ్నంగా స్నానం చేసి ఈ ద్వీపంలోకి వెళ్లాలి..! పురుషులకు కూడా రహస్య ప్రయాణం..!!
Okinoshima Island
Jyothi Gadda
|

Updated on: Feb 10, 2023 | 3:04 PM

Share

దేశాన్ని బట్టి , కాలాన్ని బట్టి మనిషి జీవితంలో జీవన దృక్పథంలో తేడాలు ఉంటాయి. ఒక్క భారత ఉపఖండాన్నే తీసుకుంటే చాలా వైవిధ్యం కనిపిస్తుంది. అలా చూసుకుంటే ప్రపంచం అంతా వైవిధ్యంతో నిండిపోయి ఉంది. ? మానవ సామాజిక జీవితంలో భిన్నత్వంతో పాటు వైరుధ్యాలు కూడా సర్వసాధారణం. అలాంటిదే ఓ వింత ద్వీపం ఒకటి ఉంది. అదే ఒకినోషిమా.. ఎన్నో రహస్యాలు, ఇతిహాసాలతో నిండిన ఒకినోషిమా ద్వీపం UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడింది. అయితే ఇక్కడ మహిళలకు పూర్తి నిషేధం అమల్లో ఉంది. ఇక్కడ పురుషులకు మాత్రమే ప్రవేశం. ఒకినోషిమా అనేది ఫుకుయోకాలోని మునకటా తీరంలో ఉన్న ఒక ద్వీపం. ఇక్కడి ఆదివాసీలు, మునాటక తెగ వారు ఈ ద్వీపాన్ని పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ పురుషులు సముద్ర దేవతను పూజిస్తారు. అయితే దీవిలోకి మహిళలకు ప్రవేశం లేదు. మొత్తం వైశాల్యం 700 చదరపు మీటర్లు మాత్రమే. ఈ ద్వీపం 4వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం వరకు కొరియన్ దీవులు, చైనాల మధ్య వాణిజ్య కేంద్రంగా ఉంది. తర్వాత జపాన్ ఆధీనంలోకి వచ్చింది.

జపనీస్ మూలాలు కలిగిన పురాతన మతమైన షింటో మతానికి ఈ ద్వీపం ముఖ్యమైనది. షిన్రో కూడా దేవుడే. షింటో విశ్వాసాల ప్రకారం ఋతుస్రావం ద్వీపాన్ని కలుషితం చేస్తుంది. ఇక్కడ రక్తం అశుద్ధంగా పరిగణించబడుతుంది. అందుకే దీవిలోకి మహిళలకు ప్రవేశం నిరాకరించబడింది. మహిళలు లేకుండా, పురుషులు ఎప్పుడైనా ఇక్కడ ప్రవేశించవచ్చు. దీనికి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. సంవత్సరానికి ఒకసారి 200 మంది పురుషులు మాత్రమే ఈ దీవిలోకి ప్రవేశిస్తారు. వారు స్వయంగా సమీపంలోని సముద్రంలో నగ్న స్నానం చేసి శుద్ధి చేసుకోవాలి. ఇది ద్వీపంలోకి ప్రవేశించే పురుషుల ఆత్మలను శుద్ధి చేస్తుందని షింటో విశ్వాసులు నమ్ముతారు. ఇక ఈ ద్వీపంలోకి వెళ్లి వచ్చిన ఎవరైనా సరే తమ ప్రయాణాన్ని గోప్యంగా ఉంచాలి. ఎవరితోనూ చర్చించరాదు.

ఈ ద్వీపం గురించి మరో ఆసక్తికరమైన విషయం ఉంది. ఒకినోషిమా ద్వీపం జపాన్, రెండు పురాతన గ్రంథాలలో ప్రస్తావించబడింది. కోజికి, నిహోన్ షోకి. కోజికిలో సూర్య దేవత అమతెరాసు తన కత్తి నుండి ముగ్గురు కుమార్తెలను సృష్టించి జపాన్‌కు పంపింది. వీరిని మునకత వంశీయులు పూజించేవారు. ఈ దేవతలను మునకటలోని మూడు పుణ్యక్షేత్రాల సమ్మేళనం అయిన మునకత తైషాలో పూజిస్తారు. సముద్రాన్ని దాటడంలో భద్రత కోసం స్థానికులు ఈ దేవతలను పూజిస్తారు. ఒకినోషిమా ద్వీపాన్ని మునకత వంశం కూడా దైవిక ద్వీపంగా పరిగణిస్తుంది. అంతే కాదు, ద్వీపం నుండి ఏమీ తీసుకువెళ్లకూడదు.. గడ్డిపరక కూడా. అంతేకాదు, అక్కడ చూసేవాటి గురించి లేదా అక్కడ విన్నదాని గురించి ఎవరితోనూ మాట్లాడటానికి కూడా అనుమతించబడదు. ప్రస్తుతం పూజారులు, పరిశోధకులు, సైనికాధికారులు మాత్రమే అక్కడకు వెళ్తుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..